రంజాన్ కానుకగా జూన్ 7న “కిల్లర్” భారీ విడుదల..!!

రంజాన్ కానుకగా జూన్ 7న “కిల్లర్” భారీ విడుదల..!!
రంజాన్ కానుకగా జూన్ 7న “కిల్లర్” భారీ విడుదల..!!
 
ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.  అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది.  సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..కాగా  ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగ విజయ్ ఆంటోనీ, అర్జున్ ల కలయికగా తో వస్తున్న ఈ సినిమా కి భారీ డిమాండ్ ఏర్పడింది.. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది..
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ , హీరో విజయ్ ఆంటోనీ లు నటించిన కిల్లర్ చిత్రానికి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది.. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..  సెన్సార్ పూర్తయ్యింది.. జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం.. అన్నారు..
 
నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ 
 
సాంకేతిక నిపుణులు : 
రచయిత & దర్శకుడు: ఆండ్రూ లూయిస్
నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌
సంగీతం: సైమన్ కే కింగ్
సాహిత్యం మరియు సంభాషణలు: భాష్యశ్రీ
సినిమాటోగ్రఫీ: మాక్స్
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్
పి.ఆర్.ఓ: సాయి సతీష్