` ప్ర‌ణ‌వం` మూవీ రివ్యూ

` ప్ర‌ణ‌వం` మూవీ రివ్యూ

బేన‌ర్ః చ‌రిత అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్
న‌టీన‌టులుః శ్రీ మంగం, శశాంక్‌, జెమిని సురేష్‌, అవంతిక‌, గాయ‌త్రి అయ్య‌ర్‌
నిర్మాతః త‌ను ఎస్‌
ద‌ర్శ‌క‌త్వంః కుమార్ జి
సంగీతంః ప‌ద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్‌
ఎడిటర్‌: సంతోష్‌
ఫైట్స్‌: దేవరాజ్‌
రిలీజ్ డేట్ః 5-2-21
రేటింగ్ః3 /5

ఈ రోజుల్లో ఫేం శ్రీ హీరోగా న‌టించిన తాజా చిత్రం `ప్ర‌ణ‌వం` ల‌వ్ అండ్ రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రంగా తెర‌కెక్కింది. శ‌శాంక్ చాలా గ్యాప్ త‌ర్వాత ఒక కీల‌క పాత్ర‌లో న‌టించాడు. జెమిని సురేష్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాడు. పాట‌ల‌తో, ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఈ రోజు థియేట‌ర్స్ లోకి వ‌చ్చేసింది. ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి టాక్ రాబ‌ట్టుకుంటుందో తెలుసుకందాం…

క‌థః
కార్తిక్ (శ్రీ మంగం) , జాను ( అవంతిక‌) ఫ‌స్ట్ మీట్ లో నే ఇష్ట‌ప‌డ‌తారు. నెక్ట్స్ మీట్ లో పెళ్లి చేసుకుంటారు. ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఒక అమ్మాయి ప్ర‌వేశిస్తుంది. అస‌లు ఆ అమ్మాయి ఎవ‌రు? ఎందుకు వ‌చ్చింది. కార్తిక్ కి త‌న‌కు ఉన్న సంబంధం ఏంటి? ఇంత‌లో జాను ఎలా మిస్స‌వుతుంది? ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ కార్తిక్ ఎందుకు టార్గెట్ చేస్తాడు. వీట‌న్నింటినీ హీరో ఎలా అధిగ‌మించాడు అన్న‌ది మిగిలిన స్టోరి.

ఆర్టిస్ట్స్ ప‌ర్ఫార్మెన్స్ః
ఫేమ‌స్ ఫ్యాష‌న్ ఫొటోగ్రాప‌ర్ గా , ప్లే బాయ్ గా శ్రీ అద్భుతంగా న‌టించాడు. అలాగే ఒక భ‌ర్త గా చాలా మెచ్యూర్డ్ గా న‌టించాడు. శ్రీ లో మున‌ప‌టి కంటే కూడా బాడీలో ఈజ్ చాలా పెరిగింది అని చెప్ప‌వ‌చ్చు. అలాగే శ్రీ భార్య‌గా అవంతిక డీసెంట్ ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచింది. క‌న్నింగ్ పాత్ర‌లో శ‌శాంక్ న‌టించాడు. ఇక ప‌వ‌ర్ ఫుల్ అండ్ స్టైలిష్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో జెమిని సురేష్ అద్భుతంగా న‌టించి సినిమాకై హైలెట్ గా నిలిచాడు. జ‌బ‌ర్ద‌స్త్ దొర‌బాబు క‌నిపించింది ఒకే ఒక సీన్ లో అయినా న‌వ్వులు పండించాడు. ఇక మిగ‌తా పాత్ర‌లు అన్నీ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

టెక్నీషియ‌న్స్
ల‌వ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కు సంగీతం, సినిమాటో్గ్ర‌ఫీ చాలా ఇంపార్టెంట్. ఇక ఈ సినిమాకు ప‌ద్మ‌నావ్ భ‌రద్వాజ్ అందించిన మూడు పాట‌లతో పాటు నేప‌థ్య సంగీతం చాలా ప్ల‌స్ అయింది. ముఖ్యంగా ఆర్ పి ప‌ట్నాయ‌క్, ఉష క‌లిసి పాడిన పాట థియేట‌ర్ లో చూడటానికి విన‌డానికి బావుంది. అలాగే సినిమాటోగ్ర‌ఫీ కూడా క‌థ మూడ్ కి త‌గ్గ‌ట్టుగా ఉంది. ఇక ఈ సినిమా విష‌యంలో మెయిన్ గా చెప్పాలంటే ద‌ర్శ‌కుడు ఎన్నుకున్న క‌థ , క‌థ‌నాలు సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు. ఒక మంచి క‌థ‌ను ఎన్నుకోవ‌డ‌మే కాకుండా దానికి త‌గ్గ స్ర్కీన్ ప్లే రాసుకున్నాడు. ఫ‌స్ట్ టైమ్ సినిమా డైర‌క్ట‌ర్ లా కాకుండా ఎంతో అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిలా డీల్ చేశాడు. ఇక నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ‌కు కావాల్సిన బ‌డ్జెట్ పెట్టి సినిమా క్వాలిటీగా రావ‌డానికి స‌హ‌క‌రించారు.
విశ్లేష‌ణ‌లోకి వెళితే…
ముందుగా ఒక మ‌ర్డ‌ర్ చూపించి …దాన్ని హీరో పైకి వ‌చ్చేలా క్రియేట్ చేసి ఆ త‌ర్వాత క‌థ లోకి తీసుకుళ్ల‌డం అనేది ఇంట్ర‌స్టింగ్ గా అనిపించింది. టూ మ‌చ్ ల‌వ్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే అని గాయ‌త్రి అనే అమ్మాయి క్యార‌క్ట‌ర్ ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకుంటుంది. కొన్ని సార్లు పరిస్థితులు మ‌న‌ల్ని విల‌న్ గా, హీరోగా మారుస్తుంటాయి అని హీరో శ్రీ క్యారక్ట‌ర్ లో అంత‌ర్లీనంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాప్ అంతా ల‌వ్ స్టోరీ ఎంట‌ర్ టై న్ మెంట్ తో సాగుతూనే, సెకండాఫ్ లో ఇన్వెస్టిగేష‌న్ తో ఇంట్ర‌స్టింగ్ గా సినిమాను తీసుకెళ్లాడు. క‌థ‌తో పాటు టైట్ స్ర్క్రీన్ ప్లే తో సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు దర్శ‌కుడు. కార్తిక్ భార్య గా అవంతిక ప‌ర్వాలేద‌నిపించినా ఇంపార్టెంట్ పాత్ర‌లో న‌టించిన గాయ‌త్రి త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేయ‌లేక‌పోయింది. త‌న స్థానంలో ఇంకా మంచి ఆర్టిస్ట్ ని పెట్టుకోవాల్సింది. డైలాగ్స్ కొన్ని బాగున్న‌ప్ప‌టికీ ఫ‌స్టాప్ లో కామెడీ మాత్రం త‌గ్గింది. చిన్న చిన్న లోపాలు ఉన్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు త‌న స్ర్కీన్ ప్లే, అంత‌ర్లీనంగా ఇచ్చిన సందేశంతో ప్ర‌ణ‌వం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా పేరు తెచ్చుకుంటుంది.