హిమ‌`జ‌` మూవీ రివ్యూ

హిమ‌`జ‌` మూవీ రివ్యూ

 

 

 

 

బ్యానర్: జై దుర్గా ఆర్ట్స్
సినిమాటోగ్రఫీ: శివ కుమార్ జి
సాహిత్యం & సంగీతం: వెంగి
ఎడిటర్: ఆనంద్ పవన్
నిర్మాత : కందుకూరి గోవర్ధన్‌రెడ్డి
దర్శకత్వం : సైదిరెడ్డి చిట్టెపు

నటీనటులు : బిగ్‌బాస్‌ హిమజ, ప్రతాప్‌రాజ్‌, సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, ప్రీతి నిగమ్‌, చత్రప‌తి శేఖ‌ర్‌ తదితరులు
విడుదల : 30-07-2021
రేటింగ్ : 3 .25/ 5

బిగ్‌బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హిమజ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `జ‌`. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై మొదటినుండి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ` జ `టైటిల్ పాట‌లు, ట్రైల‌ర్స్ సినిమా పై ఆస‌క్తిని పెంచాయి. ఈ నెల 30న విడుద‌లైన జ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం

కథ :

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ కొత్త కాపురం పెడుతుంది .. ఆ ఇంట్లోకి వెళ్లిన తరువాత అక్కడి పరిస్థితులు, అక్కడ జరిగే సంఘటనలు అనుమానాస్పదంగా ఉంటాయి. ముఖ్యంగా తన జీవితంలో ఎదో జరుగుతుందన్న సంగతి తెలుసుకోవడానికి హీరోయిన్ కి ఎక్కువ సమయమే పడుతుంది. అసలు ఎందుకు ఆ ఇంట్లో ఇలా ఒక్కో సంఘటన భయానికి గురిచేస్తుంది. తన జీవితం ప్రశాంతంగా ఉంటుందన్న ఆశతో కొత్త కాపురం మొదలెట్టిన హీరోయిన్ జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఏమిటి ? అసలు ఆమె ను తరుముతున్నది ఎవరు ? ఈ పరిస్థితి నుండి తనను తానూ రక్షించుకుంటూ తన భర్తను ఎలా కాపాడుకుంది అన్నది మిగతా కథ .

నటీనటుల హావ‌భావాలు:

బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హిమజ కీ రోల్ పోషించిన చిత్రమిది. అంతకుముందు రెండుమూడు సినిమాల్లో నటించి సత్తా చాటుకున్న హిమాజలోని టాలెంట్ ప్రూవ్ చేసుకునే సరైన సినిమా ఇదని చెప్పాలి. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హిమజ నటన ప్రధాన ఆకర్షణ. ఓ కొత్తగా పెళ్లయి కొత్త కాపురం పెట్టిన అమ్మాయి జీవితంలో జరగరాని సంఘటనలు జరిగితే ఆమె ఎలా ఫీల్ అవుతుంది అన్న భావాలూ చక్కగా పలికించింది. ఇక మిగతా పాత్రల్లో హీరో ప్రతాప్ రాజ్ తన పాత్ర మేరకు చక్కగా నటించాడు. ముక్యంగా కొన్ని సన్నివేశాల్లో అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక మిగతా పాత్రల్లో జబర్దస్త్ టీం పంచిన నవ్వులు సినిమాకు హైలెట్ అని చెప్పాలి. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుల పాత్రలు ఆకట్టుకుంటాయి. అలాగే ప్రీతీ నిగమ్ నటిగా సత్తా చాటింది. ఛత్రపతి శేఖర్ తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
ఇలాంటి హర్రర్ సినిమాలకు ప్రధాన ఆకర్షణ సంగీతం. మ్యూజిక్ డైరెక్టర్ వేంగి అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలిచింది. ముక్యంగా హర్రర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసేలా ఆర్ ఆర్ అదరగొట్టాడు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ గా నిలిచింది . ముక్యంగా శివ కుమార్ అందించిన కెమెరా వర్క్ బాగుంది. ఇక ఎడిటర్ ఆనంద్ పవన్ కొన్ని సన్నివేశాల విషయంలో కేర్ తీసుకోవాల్సింది. కథలో కొన్ని అనవసర సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఇక దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు ఎంచుకున్న కథ కొత్తగా ఉంది. జనరల్ గా హర్రర్ సినిమాలంటే ఇప్పటికే ఎన్నో వచ్చాయి.. ఎన్ని సినిమాలు వచ్చిన అందులో ఉండే కామన్ పాయింట్ .. బంగళాలో దెయ్యం ఉండడమే.. ఇందులో కూడా ఆ ఇంట్లో దెయ్యం అన్న కాన్సెప్ట్ ని ఎంచుకున్నప్పటికీ అందులో క్రొత్తదాన్ని చూపించే ప్రయత్నం చేసాడు. ముక్యంగా జన్మ కు సంబందించిన అంశాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :
ఇలాంటి క‌థ‌, క‌థ‌నాల‌తో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు వ‌చ్చినప్ప‌టికీ జ సినిమా మాత్రం విభిన్న‌మైంది అని చెప్పాలి. ముఖ్యంగా ‘జ’ అంటే జ‌న్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టారన్న ఆసక్తి చివరివరకు కొనసాగించిన విధానం బాగుంది. ఇక నటిగా హిమజ కెరీర్ కు చాలా ప్లస్ అయ్యే సినిమా ఇది. ఆమెలోని నటిని పరిచయం చేసింది. అలాగే మిగతా పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. హార‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వార‌కు జ సినిమా క‌చ్చితంగా న‌చ్చుతుంది. సో డోంట్ మిస్ మూవీ.