ఆది సాయికుమార్ హీరోగా కొత్త చిత్రం త్వ‌ర‌లోనే ప్రారంభం

ఆది సాయికుమార్ హీరోగా కొత్త  చిత్రం త్వ‌ర‌లోనే ప్రారంభం

 

 
 
               Aadi Saikumar And Vision Cinemas Combinational Production No 4 Film Starts Soon
 
Aadi Saikumar had created a special Place for himself as a protagonist by complimenting him with various films and unique characters.

Aadi’s next film under the direction of Natakam Fame Kalyanji Gogana  will start soon. Leading Businessman Nagam Tirupathi Reddy is producing this Production No 4 under Vision Cinemas. Hero Sunil playing important role in this film.

On this occasion Producer Nagam Tirupathi Reddy Said: I am very glad for producing this film with Aadi Saikumar as Hero Under the banner of Vision Cinemas. I have much impressed with this different concept narrated by the Director. Aadi Saikumar will be seen in a new dimension in this film. We are making this film prestigiously in our banner. Sai Karthik Who had scored music for many successful films is scoring music for our film. Bal reddy is the cinematographer and Mani Kanth is the Editor. Shooting will start soon and will announce the remaining details very shortly.

Crew
Banner: Vision Cinemas
Director : Kalyanji Gogana
Producer: Nagam Tirupathi Reddy
Executive Producer: Thirmal Reddy Yalla
Music: Sai Karthik
Editor: Manikanth
Cinematographer: Bal Reddy

 
 

ఆది సాయికుమార్ హీరోగా విజ‌న్ సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ నెం.4 చిత్రం త్వ‌ర‌లోనే ప్రారంభం

వైవిధ్య‌మైన సినిమాలు, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన  క‌ళ్యాణ్ జీ గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా  ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చింది. ఆది సాయికుమార్‌ను మ‌రో కొత్త డైమ‌న్ష‌న్‌లో ప్రెజంట్ చేసే చిత్ర‌మిది. అలాగే హీరో సునీల్‌గారు మా చిత్రంలో ఓ కీ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. అదేంట‌నేది సినిమా చూడాల్సిందే. పాత్ర‌కున్న ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి.. సునీల్‌గారైతే బావుంటుంద‌ని ఆయ‌న్ని కలిసి అడ‌గ్గానే ఆయ‌న న‌టించ‌డానికి ఒప్పుకున్నందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ఈ చిత్రాన్ని మా బ్యాన‌ర్‌పై ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాల‌కు స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్‌ను అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌ణికాంత్ ఎడిటర్‌. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను  వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: విజన్ సినిమాస్
ద‌ర్శ‌కుడు:  క‌ళ్యాణ్ జీ గోగ‌ణ‌
నిర్మాత‌:  నాగం తిరుప‌తి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  తిర్మ‌ల్ రెడ్డి యాళ్ల‌
సంగీతం:  సాయికార్తీక్‌
ఎడిటింగ్‌: మ‌ణికాంత్‌
సినిమాటోగ్ర‌ఫీ:  బాల్ రెడ్డి.