`సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న “కలశ” చిత్రం ప్రారంభం!!

`సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న “కలశ” చిత్రం ప్రారంభం!!
 
 
 
 
 
 
అనురాగ్ హీరోగా, సోనాక్షి వర్మ, రోషిణి  హీరోయిన్స్ గా    చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై కొండా రాంబాబు దర్శకత్వంలో డా. రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం “కలశ”. ఈ చిత్రం ప్రారంభోత్సవం జనవరి 9న హైదరాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైంది.. ప్రముఖ నటులు, మాజీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్, గిరిబాబు, ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, యుగ తులసి ఫౌండేషన్ అధినేతలు కొలిశెట్టి శివకుమార్, బాలకృష్ణ, నటి సన, కర్రీ బాలాజీ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా విచ్చేశారు… పూజా కార్యక్రమాలు అనంతరం హీరో అనురాగ్, హీరోయిన్స్ సోనాక్షి వర్మ, రోషిణి లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మురళీమోహన్ క్లాప్ నివ్వగా, ఫస్ట్ షాట్ డైరెక్షన్ తో పాటు సీనియర్ నటులు గిరిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో… 
 
హీరో అనురాగ్ మాట్లాడుతూ.. ‘ ఇది నా మూడవ చిత్రం. రాంబాబు చెప్పిన స్టోరీ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నా క్యారెక్టర్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. చంద్రజ గారు నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయి ఆవిడ ఇంకా మరిన్ని మంచి చిత్రాలు తీయాలి.. అన్నారు. 
 
హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ.. ‘ నన్ను నమ్మి నామీద నమ్మకంతో ఈ సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన రాంబాబు గారికి చంద్రజ గారికి థాంక్స్. వెరీ ఛాలెంజింగ్ రోల్ నాది. ఒక కొత్త మూవీని చూసిన ఫీలింగ్ ఆడియెన్స్ కి కలుగుతుంది.. అన్నారు. 
 
మరో హీరోయిన్ రోషిణి  మాట్లాడుతూ..  డిఫరెంట్ పాయింట్ తో రాంబాబు గారు రూపొందిస్తున్న కలశ చిత్రంలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంత మంచి పాత్ర నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. అన్నారు. 
 
దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి డిఫరెంట్ పాయింట్ తో రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటూ ఇంటెన్సిటీతో ఎమోషన్ క్యారీ అవుతూ సబ్జెక్ట్ రన్ అవుతుంది. హాలీవుడ్ స్థాయికి మించి “కలశ” చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం.. మా నిర్మాత చంద్రజ గారు బేసిగ్గా సింగర్. మేల్, ఫీమేల్ వాయిస్ తో ఏకధాటిగా పాటలు పాడి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. కథ చెప్పగానే బాగా ఎగ్జైట్ అయి ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు. మూడు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక హౌస్ సెట్ వేశాం.. అందులోనే ముఖ్యమైన మేజర్ సన్నివేశాలు చిత్రీకరిస్తాం. మరికొన్ని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుతాం. క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్స్, టేకింగ్ అంతా కొత్తగా ప్రెజెంట్ చెయ్యాలని డిజైన్ చేశాం. ఫస్ట్ మూవీ అయినా కూడా మేకింగ్ విషయంలో మా నిర్మాత రాజేశ్వరి చంద్రజ గారు, స్వామి గారు కాంప్రమైజ్ కాకుండా చాలా ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. అన్నారు. 
 
చిత్ర నిర్మాత డా. రాజేశ్వరి చంద్రజ వాడపల్లి మాట్లాడుతూ.. ‘ బేసిగ్గా నేను ఆర్టిస్టు ని. రాంబాబు వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. తెలుగు తెరపై రానటువంటి కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్ గా సాగే సైకలాజికల్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. హార్రర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. రాంబాబు డే అండ్ నైట్ కష్టపడుతూ ఈ ప్రాజెక్ట్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అలాగే డివోపి వెంకట్ చాలా సపోర్ట్ చేస్తూ.. సహకరిస్తున్నారు. టీమ్ అంతా ఒక హిట్ మూవీ చెయ్యాలి అని కసితో వర్క్ చేస్తున్నారు. కథ డిమాండ్ మేరకు ఖర్చుకు వెనకాడకుండా హాలీవుడ్ సినిమాలకి ధీటుగా మా “కలశ” చిత్రాన్ని నిర్మిస్తాం.. ఒక గొప్ప సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.. అన్నారు. గిరిబాబు టైటిల్ పోస్టర్ లాంచ్ చేసి టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కర్రీ బాలాజీ, నటి సన, నటులు కోటేశ్వరరావు, రవి వర్మ మాట్లాడుతూ.. కొండా రాంబాబు ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్. కలశ వంటి అద్భుతమైన టైటిల్ తో ఈ సినిమా చేస్తున్నాడు. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి మా రాంబాబు మంచి దర్శకుడిగా ఇండస్ట్రీలో నిలబడాలని యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. 
 
 *రవి వర్మ, సమీర్, జీవ, రచ్చ రవి, రాజు, కోటేశ్వరరావు మనవ్, బోసుబాబు, నవ్య, ఆమీర్, బాలచందర్, అజీజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్; పద్మనాబ్ భరద్వాజ్, ప్రొటోగ్రఫి; వెంకట్ గంగాధరి, ఎడిటర్; జునైద్ సిద్ధికీ, ఆర్ట్; యలమంచిలి కరిష్ కుమార్, పాటలు; యం. సాగర్ నారాయణ, పీఆర్ఓ; వంశీ-శేఖర్,  ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్; సుబ్బు, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్; శంకర్ సల్లా, అసోసియేట్ డైరెక్టర్; ప్రణీత్ బట్టు, కాస్ట్యూమ్ డిజైనర్; సునీల అనిమిరెడ్డి, నిర్మాత; డా. రాజేశ్వరి చంద్రజ వాడపల్లి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు;దర్శకత్వం; కొండా రాంబాబు.*