‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మార్చి 19 న సినిమా విడుదల..!!

‘ఈ కథలో పాత్రలు కల్పితం’   మార్చి 19 న సినిమా విడుదల..!!

‘ఈ కథలో పాత్రలు కల్పితం’  రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్.. మార్చి 19 న సినిమా విడుదల..!!
 
పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు..  ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఇటీవలే  సెకండ్ లిరికల్ సాంగ్‌ను పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోన్న వైఎస్ షర్మిల చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాట యూట్యూబ్ లో ఒక ట్రెండ్ ని సృష్టిస్తుంది.ఒక్కో అప్ డేట్ తో సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఇటీవలే సెన్సార్ పనులను జరుపుకున్న ఈ సినిమా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. కాగా ఈ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఎమ్మెల్యే, కేబినెట్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా టైటిల్ చాలా వెరైటీ గా ఉంది అన్నారు.. సినిమా మరింత వెరైటీగా ఉంటుందని ఆశిస్తున్నాను.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి అల్ ది బెస్ట్.. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 19 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరు చూసి ఈ సినిమా సభ్యులను ఆశీర్వదించండి అన్నారు.. అన్నారు.. 
 
చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్  గారి ప్రత్యేక కృతజ్ఞతలు..అయన ఇచ్చిన సహాయ సహకారం మర్చిపోలేనిది.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.. అలాగే ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన అందరికి చిత్ర యూనిట్ తరపున హృద‌య‌పూర్వ‌క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరి నోటా ఈ సినిమా గురించే వినపడుతుంది. ప్రతి ఒక్కరు థ్రిల్ ఫీలయ్యే విధంగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది అంటున్నారు. మార్చి 19 న సినిమా ని ఎంతో ఘనంగా విడుదల చేస్తున్నాం.. అందరు ఈ సినిమా ని చూసి ఆశీర్వదించాలి.. ఎవరు ఊహించని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్ ని ఈ సినిమాలో  జోడించి డైరెక్టర్ ఎంతో అద్భుతంగా సినిమా ని తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా ని చూడగలరు అని అన్నారు. 
 
నటీనటులు:
పవన్‌ తేజ్‌, మేఘన,
 
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌, 
సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, 
ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు,  
ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌, 
ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి, 
డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌, 
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌,  
విఎఫ్ఎక్స్: విజువ‌ల్స్ ఫ్యాక్ట‌రీ(తిరు), 
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ఎజె ఆర్ట్స్‌, (అజయ్ కుమార్), 
నిర్మాత: రాజేష్‌ నాయుడు, 
క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌.