సి.కళ్యాణ్ గారి చేతులమీదుగా దేవినేని చిత్ర ప్రమోషల్ సాంగ్ ను విడుదల !!

సి.కళ్యాణ్ గారి చేతులమీదుగా దేవినేని చిత్ర ప్రమోషల్ సాంగ్ ను విడుదల !!

“దేవినేని” ఒక మహాభారత కథతో పోల్చి తీయడం జరిగింది.వంగ వీటి,దేవినేనిల కుటుంబాలను తక్కువ చేసి చూపించలేదు.. దర్శకుడు నర్రా శివ నాగు  

మహాభారతం లోనికౌరవులు, పాండవులను గుర్తుతెచ్చుకుంటూ ఈ ఇద్దరు మహా నాయకుల కథ రాసుకున్నాను.నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం) అనేది ట్యాగ్ లైన్.ఈ చిత్రం ప్రమోషల్ సాంగ్ ను శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వచ్చిన ప్రముఖ నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ గారి చేతులమీదుగా ఈ చిత్ర ప్రమోషల్ సాంగ్ ను విడుదల చేశారు.అనంతరం

 ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్
 సి.కళ్యాణ్ మాట్లాడుతూ …ఇలాంటి ఎస్టాబ్లిష్ అయిన పాత్రలను చేయడం చాలా కష్టం.రంగా గారు ఎలా ఉండేవారో దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. అలాంటి రంగా క్యారెక్టర్ ను  సురేష్ కొండేటి చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మంచి కంటెంటు ఉంది. కానీ ప్రాజెక్టులో కష్టాలు కనిపించట్లేదు, ఎప్పుడూ కూడా తెర వెనక కష్టాలున్నా ప్రాజెక్ట్ లో క్వాలిటీ మెయింటెన్ చేసిన
సినిమాలన్నీ హిట్టయ్యాయి అలాంటి కోవలో ఈ సినిమా వచ్చి విజయం సాధించాలి.దర్శకుడు. మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన ఈ సినిమా తెలుగు ప్రజలందరికీ తప్పక నచ్చుతుంది
టైలర్ లు చాలా బాగున్నాయి.ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చి,నిర్మాతకు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 చిత్ర దర్శకుడు నర్రా శివ నాగు మాట్లాడుతూ…  నిర్మాతలు నన్ను నమ్మి మొత్తం బాధ్యతలను అప్పజెప్పారు.గత ప్రెస్ మీట్ లో నేను చెప్పిన విషయాలు కొంత మందికి బాధ కలిగించాయి. శివ నాగు కులాలు, మతాల మీద చేసిన ఈ సినిమా విడుదల అయితే బెజవాడ లో అల్లర్లు జరుగుతాయని బెజవాడ, గుంటూరు , గోదావరి, ఏలూరు నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఈ సినిమాను విడుదల కాకుండా చేయాలని ప్రజలకు చెప్పడం జరిగింది. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.నేను తీసిన ఈ సినిమా బయోపిక్ కాదు. దేవినేని, వంగవీటి గార్ల మీద అభిమానంతోనే ఈ సినిమా చేయడం జరిగింది. మహాభారతంలో పాండవులు, కౌరవులు మధ్య చిన్న గొడవ జరిగి విడిపోవడం వల్లే మహాభారతం పుట్టి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ కౌరవులు, పాండవులను గుర్తుతెచ్చుకుంటూ ఈ ఇద్దరు మహా నాయకుల కథ రాసుకున్నాను.ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా  ఇద్దరి ఫ్యామిలీ లలో ఎవరిని తక్కువ చేయకుండా
ఇద్దరినీ సమానంగా చూపిస్తూ వంగవీటి అభిమానులను గాని, దేవినేని అభిమానులను గాని ఎవరినీ డ్యామేజ్ చేసే విధంగా సినిమా లో ఎక్కడ చూపించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కేసులు వేశారు ఈ చిత్ర నిర్మాతలు పెద్ద నిర్మాతలు కాదు, చిన్న నిర్మాతలైనా ఏంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారు.మంచి కంటెంట్ తో వస్తున సినిమాపై పగ పెట్టుకోకుండా మీరందరూ పాజిటివ్ గా ఆలోచించి ఈ గొడవను దయచేసి ఆపి మా సినిమాను ఆదరించాలని మరొకసారి మనవి చేసుకుంటున్నానని అన్నారు.

 చిత్ర నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు రియల్ క్యారెక్టర్స్ ను చూసినట్లు ఉంటుంది.కుటుంబం సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం వంగవీటి రంగా  అభిమానులను, దేవినేని అభిమానులను ఎక్కడ నిరుత్సాహపరచదు. వారందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని అసిస్తున్నానని అన్నారు.

 వంగవీటి రంగా పాత్రలో నటించిన  సురేష్ కొండేటి మాట్లాడుతూ …దర్శకుడు శివ గారు  వంగవీటి రంగా పాత్ర లో నటించమంటే ఆలాంటి మహానుభావుడి పాత్రలో  నటించడానికి భయమేసి వద్దని చెప్పాను.మీరైతే కరెక్టు గా షూట్ అవుతారని  కథ వినిపించాడు.నా శ్రేయోభిలాషుల  ప్రోత్సాహాంతో ఈ సినిమా చేశాను.దేవినేని లో నా ఫస్ట్ లుక్  చూసి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ  ఫోన్ ద్వారా నన్ను అభినందించడం జరిగింది.ఒక ఆడియన్ గా, డిస్ట్రిబ్యూటర్ గా ,జర్నలిస్టుగా, ప్రొడ్యూసర్ గా నాలో ఉన్న అన్ని కోణాలతో సినిమా చూశాను సినిమా చాలా బాగుంది .దేవినేని , వంగవీటిల మధ్య ఎలాంటి స్నేహం ఉందనే పాయింట్ తీసుకొని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు.

 ప్రముఖ జర్నలిస్ట్ నాగేంద్ర బాబు మాట్లాడుతూ.. ఒక జీవితం మురించి మాట్లాడే టైటిల్ ఇది .ఇలాంటి టైటిల్స్ చాలా అరుదుగా వస్తాయి. తరతరాలను ప్రబావితం చేసే ఈ పాత్రలు ఎన్నో సాంఘీక,రాజకీయ పాత్రలకు మూలాదారమయ్యాయి అలాంటి పాత్రలను పట్టుకొని చాలా రీస్కీ ఎలిమెంట్ తో వంగ వీటి,దేవినేని ల మధ్య స్నేహం, బాంధవ్యాన్ని సినిమాటిక్ గా శివనాగు  తెరకెక్కించడం జరిగింది.ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ
మనముందుకు వస్తున్న ఈ దేవినేని చిత్ర్రాన్ని మన సహకారంతో ప్రేక్షకులకు చేరవేసి చిత్రం విజయవంతం అయ్యేలా చేయాలని  కోరుకుంటున్నాను.

 నటీనటులు
నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార,
బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి,తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు

సాంకేతిక నిపుణులు
ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్
నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్
డైరెక్టర్ :-నర్రా శివనాగు
లిరిక్ రైటర్ :- మల్లిక్,
పి ఆర్ ఓ.:- మధు వి.ఆర్