“డైరెక్టర్“‌ మూవీ ట్రైలర్ రిలీజ్ !!

“డైరెక్టర్“‌ మూవీ  ట్రైలర్ రిలీజ్ !!

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న “డైరెక్టర్” ట్రైలర్ చాలా డిఫరెంట్ గా వుంది- ట్రైలర్ రిలీజ్ లో ప్రముఖ దర్శకుడు వీరభద్రం చౌదరి!!

తొలి చిత్రం “నాటకం” వంటి విభిన్నకథాచిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకొని హీరోగా  ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని  సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ ఆశిష్ గాంధీ… తాజాగా ఆయన మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. శ్యామ్ వన్ ఆఫ్ ది హీరోగా  మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్ గా  మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్లు పై కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ  దర్శకత్వంలో రూపొందుతోన్న “డైరెక్టర్” చిత్రాన్ని  ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. తొలికాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో  రిలీజ్ కి రెడీ అవుతోంది. కాగా “డైరెక్టర్” చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఫిబ్రవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వీరభద్రం చౌదరి ముఖ్యఅతిధిగా విచ్చేసి “డైరెక్టర్” ట్రైలర్ లాంఛ్ చేశారు.. హీరో ఆశిష్ గాంధి, హీరోయిన్స్ ఐశ్వర్య రాజ్, ఆంత్ర, దర్శకులు కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ,  సంగీత దర్శకుడు  సాయి కార్తీక్, సినిమాటోగ్రఫర్ ఆదిత్య వర్ధన్, ఎడిటిర్  బి . నాగేశ్వర్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్: తిరుమల రెడ్డి ఎల్ల, నిర్మాతలు: నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల , పాటల రచయిత రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ.. డైరెక్టర్ సినిమా  ట్రైలర్ చాలా డిఫరెంట్ గా వుంది. కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకులు. ఈ మధ్యకాలంలో అలాంటి కొత్త రకమైన చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఒక మంచి సినిమా తీసిన ఈ టీమ్ అందర్నీ అభినందిస్తూ.. యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ అన్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో నాగం తిరుపతి రెడ్డి నా రూమ్ మెట్. 1999లో  నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నప్పటినుండి ఇద్దరం ఒకే రూంలో ఉండేవాళ్ళం. తాను రియల్ ఎస్టేట్ లో బాగా సెట్టిల్ అయి మంచి పొజిషన్లో వున్నాడు. మేము విజన్ బ్యానర్ నేనే రిజిస్ట్రేషన్ చేశాను. ఒక సినిమా చేయాలని అనుకున్నాం కానీ మెటీరియలైజ్ అవలేదు. నా మిత్రుడు తీసిన ఈ డైరెక్టర్ సినిమా సక్సెస్ అయి నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలి. యంగ్ టాలెంటెడ్ టీం అంతా కలిసి ఒక డిఫరెంట్ సినిమా చేశారు. ఇలాంటి కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా  అవసరం.. అని వీరబద్రం చౌదరి అన్నారు.

చిత్ర నిర్మాత నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా తీయడానికి మెయిన్ కారణం శ్రీకాంత్ దీపాల. కిరణ్, కార్తీక్ అద్భుతమైన కథ  చెప్పారు. నాకు బాగా నచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ చేశాం. శ్రీకాంత్ అంతా షూటింగ్ దెగ్గరుండీ చూసుకున్నాడు. ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందించిన డైరెక్టర్ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మా బ్యానర్ లో ప్రతి సంవత్సరం రెండు, మూడు సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేశాం. ముందుగా ఏప్రిల్ 3న ఒక సినిమా, మే 4న ఇంకో సినిమా ప్రారంభించబోతున్నాం.. అన్నారు.

దర్శకుడు కిరణ్ పొన్నాడ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఈ డైరెక్టర్ సినిమా కథపై వర్క్ చేశాం. తిరుపతి రెడ్డి గారికి స్టోరీ నేరేట్ చేశాం. ఆయనకి బాగా నచ్చింది. శ్రీకాంత్, తిరుమల రెడ్డి బాగా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ అయినా డిఫరెంట్ గా ట్రై చేశాం. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది.. అన్నారు.

మరో దర్శకుడు కార్తీక్ కృష్ణ మాట్లాడుతూ.. నాగం తిరుపతిరెడ్డి గారు లేకపోతె ఈ సినిమా లేదు. అలాగే శ్రీకాంత్, తిరుమల రెడ్డి ఎంతో బాగా కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి సహకరించారు. సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అవుతుంది. హీరో ఆశిష్ పెర్ఫార్మెన్స్ ఇరగదీశారు.. హీరోయిన్స్ అందరూ వారి పాత్రలకి న్యాయం చేశారు. టెక్నీకల్ గా మా టీం అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. వారందరికీ మా థాంక్స్.. అన్నారు.

హీరో ఆశిష్ గాంధి మాట్లాడుతూ.. కిరణ్, కార్తీక్ స్టోరీ బ్యూటిఫుల్ గా నేరేట్ చేశారు. కథ నచ్చి ఈ సినిమా చేశాను. నాగం తిరుపతిరెడ్డి, శ్రీకాంత్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో కాకుండా డైరెక్ట్ గా ఈ చిత్రాన్ని ధియేటర్స్ లలో రిలీజ్ చేయటం చాలా  హ్యాపీగా వుంది. ఫస్ట్ కాఫీ రెడీ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు 200 హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు. కచ్చితంగా ఇది తెలుగు కంటెంట్ సినిమా.. అన్నారు.

నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ..  మా దర్శకులు కథ హాలీవుడ్ స్థాయిలో చెప్పినా సరికొత్త స్క్రీన్ ప్లే తో సినిమాని ఎక్సలెంట్ గా రూపొందించారు. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్స్ అని గ్యారెంటీగా చెప్పగలను. ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా దర్శకులు కిరణ్, కార్తీక్ లకే చెందుతుంది. సాయి కార్తీక్ ఆర్ ఆర్ అద్భుతంగా చేసాడు. ఈ సినిమాకి మంచి టెక్నీకల్ టీం అంతా వర్క్ చేశారు.. సినిమా అంతా ఆశిష్ వన్ మాన్ షో అని చెప్పవచ్చు. ఎక్సలెంట్ గా యాక్టింగ్ చేశాడు.. అన్నారు.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రెండు సాంగ్స్ వున్నాయి. పాటలు రాశాక ట్యూన్స్ కంపోజ్ చేశాం. రాకేందు మౌళి సూపర్బ్ గా రాశారు. శ్రీకాంత్, తిరుపతిరెడ్డి మంచి నిర్మాతలు. నెక్స్ట్ లెవెల్ సినిమా తీశారు. ఈ సినిమాతో ఆశిష్ పెద్ద స్టార్ అవుతాడు. అంత గొప్పగా ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ చేశాడు.. నటీ నటులు, టెక్నీషియన్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు.  అన్నారు.

కో-ప్రొడ్యూసర్ తిరుమలరెడ్డి మాట్లాడుతూ.. ‘ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ అనుక్షణం ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠతని కలిగిస్తూ.. సినిమా రన్ అవుతుంది. ఆడియెన్స్ ఇన్వాల్వ్ అయి దిక్కులు చూడకుండా సినిమా ఎంజాయ్ చేస్తారు.. అని నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అంత అద్భుతంగా డైరెక్టర్ సినిమా ఉంటుంది.. అన్నారు.

ఆశిష్ గాంధీ, శ్యామ్ హీరోలుగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్ గా  నటిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ అప్పారావు, వీరభద్రం, తిరుమలరెడ్డి, ఆర్కే, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ  చిత్రానికి సంగీతం; సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య వర్ధన్, ఎడిటింగ్: బి . నాగేశ్వర్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్: తిరుమల రెడ్డి ఎల్ల, పి.ఆర్.ఓ.సాయి సతీష్, పర్వతనేని రాంబాబు. నిర్మాతలు: నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల, రచన-దర్శకత్వం: కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ