జనవరి 7న గీతా ఆర్ట్స్ 2, కిరణ్ అబ్బవరం సినిమాకు ముహూర్తం..

జనవరి 7న  గీతా ఆర్ట్స్ 2, కిరణ్ అబ్బవరం సినిమాకు ముహూర్తం..

జనవరి 7న అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, కిరణ్ అబ్బవరం సినిమాకు ముహూర్తం..

వరస విజయాలతో దూసుకుపోతున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2. ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు వచ్చిన భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీ వాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ నిర్మాణ సంస్థలో సినిమా అంటే పక్కా హిట్ అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లోనూ కలిగించారు నిర్మాతలు. తాజాగా గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థ నుంచి ప్రొడక్షన్ నెం 7గా కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమాకు ముహూర్తం పెడుతున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు జనవరి 7 ఉదయం 10.19 నిమిషాలకు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరగనున్నాయి. హీరో కిరణ్ అబ్బవరంకు కూడా ఇది 7వ సినిమా కావడం గమనార్హం. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

నటీనటులు: కిరణ్ అబ్బవరం

టెక్నికల్ టీమ్:
నిర్మాణ సంస్థ: జీఏ 2 పిక్చర్స్
సమర్పణ: అల్లు అరవింద్