ఎక్క‌డ చూసిన `ఛ‌లో ప్రేమిద్దాం` అంటున్నారు!!

ఎక్క‌డ చూసిన `ఛ‌లో ప్రేమిద్దాం` అంటున్నారు!!

 

ఎక్క‌డ చూసిన `ఛ‌లో ప్రేమిద్దాం` అంటున్నారు!!

ఛ‌లో అసెంబ్లీ, ఛ‌లో హైద‌రాబాద్, ఛ‌లో ఢిల్లీ ఇలాంటి నినాదాలు గ‌తంలో గోడ‌ల‌పై పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో రాసుండేవి. ప్ర‌స్తుతం ఇలాంటి నినాద‌మొక‌టి తెలుగు రాష్ట్రాల్లో ఏ గోడ‌ల‌పైన చూసినా ద‌ర్శ‌నమిస్తున్నాయి. అవును ఇప్పుడు ఎక్క‌డ చూసిన `ఛ‌లో ప్రేమిద్దాం` పోస్ట‌ర్సే క‌నిపిస్తున్నాయి. ఇంతకీ ఛ‌లో ప్రేమిద్దాం ఏంట‌నే క‌దా మీ డౌట్, అక్క‌డికే వ‌స్తున్నా….ఇదొక తెలుగు సినిమా. హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై ఉద‌య్ కిరణ్ నిర్మాత‌గా సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. సాయి రోన‌క్, నేహ సోలంకి హీరో హీరోయిన్స్. ఈ చిత్రం ఈనెల 19న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని రెండు పాట‌లు, టీజ‌ర్, ట్రైల‌ర్ విడుద‌లై సినిమాపై విప‌రీత‌మైన క్రేజ్ ని పెంచేశాయి. సినిమా పోస్ట‌ర్స్ క‌ల‌ర్ ఫుల్ గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. టీజ‌ర్ , ట్రైల‌ర్ లోని డైలాగ్స్, హీరోయిన్ ఎక్స్ ప్రెష‌న్స్, లొకేష‌న్స్, మ్యూజిక్ , ద‌ర్శ‌కుడు ట్రైల‌ర్ క‌ట్ చేసిన విధానం చూస్తుంటే ఛ‌లో ప్రేమిద్దాం చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లయ్యే చిత్రాల్లో స‌క్సెస్ కొట్ట‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతోంది అంటున్నారు సినీ జ‌నాలు. ఇక ఛ‌లో ప్రేమిద్దాం టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంట‌నే క‌దా మీ సందేహం …అది తెలియాలంటే క‌చ్చితంగా ఈ నెల 19న థియేట‌ర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే.