`కేస్ 30` మూవీ రివ్యూ!!

`కేస్ 30` మూవీ రివ్యూ!!

 


`కేస్ 30` మూవీ రివ్యూ!!
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్స్, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్స్ చిత్రాల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ ఉంటూనే ఉంటుంది. ఆ కోవ‌లో రొమాంటిక్ ల‌వ్ తో కూడిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మొక‌టి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అదే `కేస్ 30`. సందీప్ పైడిమ‌ర్రి ద‌ర్శ‌క‌త్వంలో పి.న‌ర‌సింహ‌రావు, బోడ రాధాకృష్ణ నిర్మించారు. సిద్ధార్ధ్ నాయుడు, షామిలీ యూనియ‌ల్, త‌న్వి గావ‌దె ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. టైటిల్, టీజ‌ర్ , టైటిల్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌లైంది. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

స్టోరి విష‌యానికొస్తే…
శ్వేత అనే అమ్మాయి దారుణమైన హత్య తో క‌థ మొద‌ల‌వుతుంది. రాత్రిపూట ఒక ఇంట్లో జ‌రిగిన‌ శ్వేత హత్యను పరిశోధించే పనిని వైజాగ్ సిటీ ఇన్‌స్పెక్టర్ అర్జున్ భ‌రద్వాజ్‌కు అప్పగిస్తారు హ‌య్య‌ర్ ఆఫీస‌ర్స్. అతనికి ఇది 30వ కేసు. ఈ కేసును ఛేదించే క్ర‌మంలో , క్రైమ్ స్పాట్‌లో అర్జున్‌కి ఒక్క క్లూ కూడా దొర‌క‌దు. శ్వేత బాయ్‌ఫ్రెండ్ సిరిల్‌ని విచారించి చిన్నపాటి సమాచారాన్ని సేకరిస్తాడు. అతను ఆ సమాచారంతో శ్వేతను ఎవరు చంపారో తెలుసుకోవడానికి ఎంతో డీప్ గా ప‌రిశోధ‌న మొద‌లుపెడ‌తాడు. అయితే, దురదృష్టవశాత్తూ కేసును నిర్వహిస్తున్నప్పుడు, అతని గత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అతను చాలా ఎమోషనల్, నిరాశకు గురవుతాడు. అతను తన స్నేహితురాల’ గురించి ఆలోచిస్తాడు. అప్పుడు ఫ్లాష్‌బ్యాక్ మొద‌ల‌వుతుంది. నిత్యతో అతని లవ్ ట్రాక్, అక్కడ మరొకరితో సంబంధం ఏర్ప‌డుతుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎండ్ అవుతుంది. కేసు చిక్కుముడి విప్పుతున్నప్పుడు అర్జున్, కొంతమంది అనుమానితులను విచారిస్తారు. ఆ విచార‌ణ‌లో దొరికిన క్లూస్ ఏంటి? ఈ కేసును అర్జున్ ఎలా పరిష్కరిస్తాడు అనేదే మిగిలిన కథ? అతను ఏ క్లూస్ పొందాడు? శ్వేతను చంపిన నిందితుడు ఎవరు? ఆమె ఎందుకు చంపబడింది? ఇలా అనేక ట్విస్టుల‌తో సాగుతుంది క‌థ‌. ఆ ట్విస్టులు ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌లోకి వెళితే..
ఈ కథను హీరో సిద్ధార్థ్ నాయుడు చాలా గ్రిప్పింగ్ గా రాసాడు. హీరో సిద్ధార్థ్ నాయుడు – డైరెక్టర్ సందీప్ ఇద్ద‌రూ సొంత అన్న‌ద‌మ్ముళ్లు. ఎటువంటి అనుభవం లేకపోయిన చాలా బాగా డైరెక్ట్ చేసాడు. సినిమాకు డైలాగ్స్ ప్ల‌స్ పాయింట్స్ అని చెప్పొచ్చు. డైలాగ్ రైటర్ భరత్ ని చ‌క్క‌గా ఉపయోగించుకున్నారు. స్క్రీన్‌ప్లే సినిమా స్టార్టింగ్ నుండి మొదలై ముగింపు వరకు పవర్ ప్లే ఉంటుంది. 3 పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఇంకొక హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. ఎడిటింగ్ వ‌ర్క్ బాగా కుదిరింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడ‌క్ష‌న్ క్వాలిటీ రిచ్‌గా వ‌చ్చింది. ఇక హీరోయిన్లు ఇద్ద‌రూ.. షామిలీ యూనియ‌ల్ & తన్వి గవాదె ఇద్దరూ త‌మ అందంతో పాటు న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. జ్యోతి లాబాలా ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో కనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్‌ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఎండ్ కార్డ్ వరకు ఆడియన్స్ సీట్ల‌కు ఆతుక్కుపోయి కూర్చుంటారు. ద‌ర్శ‌కుడు కొత్తవాళ్లందరినీ బాగా హ్యాండిల్ చేసాడు, ఎక్కడ ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ రాకుండా ఆడియ‌న్స్‌ను మెప్పించ‌గడంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్స్ చిత్రాలు న‌చ్చ‌ని వారుండ‌రు. సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడాల్సిన చిత్ర‌మిది. సో డోంట్ మిస్.. దిస్ మూవీ.

రేటింగ్ 3.2.5/5