న‌వీన్‌చంద్ర హీరోగా అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో జవ్వాజి రామాంజ‌నేయులు నిర్మాత‌గా నూత‌న చిత్రం.

న‌వీన్‌చంద్ర హీరోగా అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో జవ్వాజి రామాంజ‌నేయులు నిర్మాత‌గా నూత‌న చిత్రం.

న‌వీన్‌చంద్ర హీరోగా అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో జవ్వాజి రామాంజ‌నేయులు నిర్మాత‌గా నూత‌న చిత్రం.

`అందాల రాక్షసి` చిత్రంతో హీరోగా పరిచయ‌మై టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో న‌వీన్ చంద్ర. ప్ర‌స్తుతం మంచి కంటెంట్ బేస్డ్ మూవీస్‌లో న‌టిస్తూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న న‌వీన్ చంద్ర‌ త్వ‌ర‌లోనే మ‌రో డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో మ‌న ముందుకు రాబోతున్నారు. న‌వీన్ చంద్ర‌‌ హీరోగా అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి  ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, తెలుగు, తమిళ భాషల్లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించిన జవ్వాజి రామాంజ‌నేయులు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల‌లోనే గ్రాండ్ ఓపెనింగ్ జ‌రిపి పిబ్ర‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. జిబ్రాన్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న చిత్రానికి పి.జి ముత్త‌య్య సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సిద్దార్ధ్ ఎడిటింగ్ భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇత‌ర న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

న‌వీన్‌చంద్ర హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్‌, స్మిర్తి వెంక‌ట్‌, ఎమ్‌.గోపి, పూజా రామ‌చంద్ర‌న్‌, స‌త్యం రాజేష్‌, సిరి, న‌వీనా రెడ్డి, సుద‌ర్శ‌న్‌, ర‌ఘుబాబు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ద‌ర్శ‌క‌త్వం: అర‌వింద్‌,
బేన‌ర్‌: శ‌‌ర్వంత్ ‌రామ్ క్రియేష‌న్స్‌,
నిర్మాత‌: జవ్వాజి రామాంజ‌నేయులు,
సంగీతం: జిబ్రాన్‌,
సినిమాటోగ్ర‌ఫి: పి.జి ముత్త‌య్య‌,
ఎడిట‌ర్‌: సిద్ధార్ధ్‌,
పిఆర్ఒ: వ‌ంశి- శేఖ‌ర్‌.