బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఇంటర్వ్యూ.

బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఇంటర్వ్యూ.

బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఇంటర్వ్యూ !!

బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మంచు విష్ణు మోసగాళ్లు చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చి 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సునీల్ శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మోసగాళ్లు సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?
సునీల్ శెట్టి : ఓ సినిమా చేయాలంటే స్క్రిప్ట్ బాగా ఉండాలి. చేసే దర్శకుడు, అదిరిపోయే కథ, హాలీవుడ్ స్థాయిలో ఉన్న స్టాండర్డ్స్ అన్నీ కలిసి ఈ సినిమాను ఓకే చేసేలా చేశాయి. సినిమాను చూసే విధానం, దాన్ని తెరపైనే తెరకెక్కించేదానికి ఎంతో తేడా ఉంటుంది. అక్కాతమ్ముడు కలిసి ఇలా స్కాం చేయడమనేది నన్ను ఆకట్టుకుంది. వారిని పట్టుకోవడమే నా పాత్ర. కానీ వారిద్దరూ ఎంతో తెలివిగా సిస్టం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. యదార్థ ఘటనల ఆధారంగా తీసే సినిమాలు వర్కవుట్ అవుతుంటాయి. జనాలు వాటినే ఇష్టపడుతున్నారు. ఇందులో ఎంతో వినోదం కూడా ఉంది. అవన్నీ కూడా నన్ను ఈ సినిమాను ఒప్పుకునేలా చేశాయ్.

తెలుగు భాషతో మీకు ఏదైనా సమస్యలు వచ్చాయా?
సునీల్ శెట్టి : నాకు తెలిసి తెలుగు భాషను మాట్లాడటమే కష్టం కానీ అర్థం చేసుకోవడం సులభమే. ప్రతీ పదం అర్థం తెలుసుకోవడం కష్టం. కానీ నాకు అద్భుతమై టీం దొరికడంతో అది సులభమైంది. మామూలుగా అయితే ఈ మూవీ మొదటగా ఇంగ్లీష్‌లోనే షూట్ చేశాం. ఆ తరువాతే తెలుగులో తీశాం. హిందీ వర్షెన్‌ను కూడా చేశాం. అలా వేర్వేరు భాషల్లో చేయడం చాలా కష్టతరమైన పని. కానీ నా వంత ప్రయత్నం నేను చేశాను.

వయసు కనపడకుండా ఇలా ఎలా ఉంటున్నారు? మీ సీక్రెట్స్ ఏంటి?
సునీల్ శెట్టి : నేను ఏం తింటున్నాను.. ఎంత తినాలే అనే దానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. నా వయసు మీద ఓ దృష్టి పెట్టాలి.. అలానే నా ఫిట్‌నెస్ మీదా శ్రద్ద పెట్టాలి. అందుకే నేను తినే తిండి మీద చాలా శ్రద్దగా ఉంటాను. ఇక యోగా, వర్కవుట్లు ప్రతీరోజూ కచ్చితంగా చేస్తాను.

మోసగాళ్లు సినిమా చేస్తున్న సమయంలో ఏమైనా మెమోరీస్ ఉన్నాయా?
సునీల్ శెట్టి : మోసగాళ్లు టీంతో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీది అనుకున్న సమయంలో అయిపోతుంది. అదే దక్షిణాది పరిశ్రమ గొప్పదనం. తినడం, ప్యాకప్ చెప్పడం, రిహార్సల్స్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా అన్నీ టైంకి జరుగుతూ ఉంటాయి. హైద్రాబాద్‌లో అడుగుపెట్టినప్పుడే నాకు ఓ రకమైన మంచి అనుభూతి కలిగింది. నేను డైరెక్టర్ జెఫ్రీ, విష్ణు, కాజల్‌తో ఎప్పుడూ కూడా పని చేయలేదు. ఈ సినిమాను వాళ్లు కొత్తగా ఆలోచించారు.. సరికొత్తగా తెరకెక్కించారు. వారు మా అనుభవాన్ని ఉపయోగించుకున్నారు.. మేం వారి క్రియేటివిటీని వాడుకున్నాం. వారు సీన్ బై సీన్ వెళ్తుంటారు.

విష్ణుతో మీ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏమైనా పంచుకున్నారా?
సునీల్ శెట్టి : విష్ణు కొత్త తరానికి చెందిన వారు. వారికే ఇంకా బాగా తెలుస్తాయ్. నేను పాత కాలపు మనిషిని. సినిమాలో మా ఇద్దరి మధ్య ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయ్. ప్రతీ యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది. పైగా యాక్షన్ సీక్వెన్స్‌లంటే ఎంతో శ్రద్దగా ఉండాలి. టైమింగ్‌తో చేయాలి లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ మా సెట్‌లో అలాంటివేమీ జరగలేదు అదే మా అదృష్టం.

గని సినిమా గురించి చెప్పండి?
సునీల్ శెట్టి : గని అద్భుతంగా ఉండబోతోంది.. వరుణ్ తేజ్ నిజంగా బ్రిల్లియంట్. మళ్లీ ఓ కొత్త దర్శకుడు. ఈ సినిమా కోసం మళ్లీ శరీరాకృతిని మార్చాలి.. నేను ఎంతో ఆత్రుగా ఎదురుచూస్తున్నాను.

Bollywood Actor Suniel Shetty is doing a crucial role in Manchu Vishnu’s Mosagallu !!

Bollywood Actor Suniel Shetty is doing a crucial role in Manchu Vishnu’s Mosagallu. The movie releases on March 19th. Here are some excerpts of an exclusive interview with the actor: 

What excited you to do Mosagallu?

It is always the script. The director, exciting subject, it’s a Hollywood perspective. Jeffrey Chan has directed the film. It is a different way of looking at cinema and the way they presented it. Two siblings end up conning the corporate giants is exciting. My role wants them to be tried here. But they do it so smartly without getting caught by the system. True stories work these days and audiences like them. Lots of fun and very exciting.

Did you face any difficulty with the Telugu language?

I think Telugu is not difficult to understand but difficult to speak. The pauses, meaning of every word are tough. But with a good team, it is manageable with promoting. The movie was primarily shot in English and then in Telugu. We also did the Hindi version. It is tough switching between different versions. But I did my best.

What is your secret? You do not look old?

I am conscious of what I eat. I need to play my age and at the same time, I need to look fit. So, I am extremely conscious about what I eat. Also, do my yoga and workout on time.

Any Memorable Moments during Mosagallu?

Lovely working with the team. The beauty of the South is everything happening on time. Eat on Time, Pack-up on Time, Doing Rehearsals. At the minute I land in Hyderabad, I feel good about it. I never worked with Vishnu, Kajal, and the director Jeffrey. They look at a film differently and this film was shot differently. They thrive on our experience, we thrive on their creativity. We jump angles but they do not. They go as per the scene. 

Did you share any fitness secrets with Vishnu?

They are the new generation. They know better. I am from Old School. We had a lot of action together. Every action has a reaction. Timing is necessary when you do the action or you may end up injuring yourself. But that did not happen and that is brilliant. 

About Ghani:

Ghani is exciting and Varun Tej is brilliant. A New director again. The second day of my shoot. I have to look lean and I am very excited.