Bharateeyudu-2 Movie Second Schedule Starts from June

Bharateeyudu-2 Movie Second Schedule Starts from June
  `భార‌తీయుడు-2` జూన్ లో మ‌రో షెడ్యూల్ ప్రారంభం!!
 
 విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌,  ఏస్ డైర‌క్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో `భార‌తీయుడు-2` చిత్రం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఆ మ‌ధ్య ఎల‌క్ష‌న్స్ వ‌ల్ల  కొంత గ్యాప్ ఇచ్చారు. ఇక బ‌డ్జెట్ కూడా ఎక్కువుగా అవుతుండ‌టంతో సినిమాను నిలిపేస్తున్నారంటూ న్యూస్ వ‌చ్చాయి. ఇక ఎంత‌కీ సినిమా షెడ్యూల్ ప్రారంభించుకోక‌పోవ‌డంతో అంతా సినిమా దాదాపు ఆగిపోయిన‌ట్టే అని ఫిక్సై పోయారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. సినిమా ఆగిపోలేద‌నీ, ఉన్న చిన్న చిన్న స‌మ‌స్య‌లు కూడా క్లియ‌ర్ అయ్యాయ‌నీ, జూన్ లో  షెడ్యూల్ ప్రారంభించుకోనుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ గ్రాండ్ గా సినిమాను నిర్మిస్తోంది. గ‌తంలో శంక‌ర్, క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో భార‌తీయుడు చిత్రం వ‌చ్చి ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో అంద‌రికీ తెలిసిందే. దాన్ని మించేలా భార‌తీయుడు 2 సీక్వెల్ ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్.