‘అమిగోస్’ మూవీ టీజ‌ర్ జనవరి 8న విడుదల !!

‘అమిగోస్’ మూవీ టీజ‌ర్  జనవరి 8న  విడుదల !!

మూడు డిఫరెంట్ లుక్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’.. జనవరి 8న టీజర్ విడుదల !!

బింబిసార‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సత్తా చాటిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్‌. ఈయ‌న మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’. డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్నఈ చిత్రం టైటిల్ వినగానే అందరినీ ఆకట్టుకుంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం. రాజేంద‌ర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. రీసెంట్‌గానే రెండు లుక్స్ విడదల చేశారు. ఓ లుక్‌లో మెలివేసిన మీసాలతో స్టైలిష్ లుక్‌లో కనిపించే ఎంట్ర్ ప్రెన్యూరర్ సిద్ధార్థ్ పాత్ర అది. తర్వాాత మంజునాథ్ అనే అమాయకంగా కనిపించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర. ఈ రెండు లుక్స్‌కి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చింది. తాజాగా మూడో లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. గత రెండు లుక్స్‌తో పోల్చితే ఈ లుక్ మరింత స్టైలిష్‌గా ఉంది. కానీ ఈ పాత్రను అజ్ఞాత వ్యక్తి పాత్ర అని చెప్పారు. అసలు ఈ మూడు లుక్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యే అమిగోస్ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు.

కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్, పోస్టర్స్ కారణంగా సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఈ అంచనాలను పెంచేలా జనవరి 8 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు.

క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.  ‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.  

ఎన్నో సెన్సేష‌న‌ల్ మూవీస్‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

నిర్మాణ సంస్థ‌:  మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  రాజేంద్ర రెడ్డి
సంగీతం:  జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  అవినాష్ కొల్ల‌
ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హ‌రి తుమ్మ‌ల‌
కొరియోగ్రాఫ‌ర్‌:  శోభి
ఫైట్ మాస్ట‌ర్స్:  వెంక‌ట్, రామ్ కిష‌న్‌
పాట‌లు:  స్వ‌ర్గీయ శ్రీ వేటూరి, రామ‌జోగ‌య్య శాస్త్రి, రెహ‌మాన్‌,
సి.ఇ.ఓ:  చెర్రీ
కో డైరెక్ట‌ర్‌:  చ‌ల‌సాని రామారావు
కాస్ట్యూమ్స్‌:  రాజేష్, అశ్విన్‌
ప‌బ్లిసిటీ డిజైన్‌:  గోపి ప్ర‌స‌న్న‌
పి.ఆర్‌.ఓ:  వంశీ కాక