‘బ్యాక్ డోర్` మూవీ సాంగ్ విడుద‌ల చేసిన వై.ఎస్. ష‌ర్మిళ‌ !!

‘బ్యాక్ డోర్` మూవీ సాంగ్ విడుద‌ల చేసిన వై.ఎస్. ష‌ర్మిళ‌ !!

‘బ్యాక్ డోర్’ బాగా ఆడి బాలాజీకి మంచి పేరు తేవాలి -రాజకీయ సంచలనం వై.ఎస్.షర్మిళ !!

‘బ్యాక్ డోర్’ చిత్రం మంచి విజయం సాధించి దర్శకుడు బాలాజీకి మంచి పేరు తెచ్చిపెట్టాలని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి వై.ఎస్.షర్మిళ ఆకాంక్షించారు. హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిళ… ‘బ్యాక్ డోర్’ నుంచి ‘యుగాల భారత స్త్రీని’ అనే పల్లవితో సాగే గీతాన్ని ఆవిష్కరించారు. ఎంతో బిజీ షెడ్యూల్ మధ్య తమకు సమయం కేటాయించి… పాట విడుదల చేయడంతోపాటు తమను అభినందించిన షర్మిళగారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు బాలాజీ, సహ నిర్మాత ఊట శ్రీను, చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, చిత్ర కథానాయకుడు తేజ త్రిపురాన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకురాళ్లు ఇందిరా శోభన్, ఇందూజా రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ విజయ.ఎల్.కోట, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ పాల్గొన్నారు.
ప్రణవ్ సంగీత సారధ్యం వహించిన “బ్యాక్ డోర్” చిత్రంలోని ఈ గీతానికి జావళి సాహిత్యం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రం ఆడియో హక్కుదారు.
పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ‘బ్యాక్ డోర్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, సమర్పణ: ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!