కొత్త గాజువాక‌లో శ్రీ‌వేద ఫ్యాఫ‌న్స్ ప్రారంభం

కొత్త గాజువాక‌లో శ్రీ‌వేద ఫ్యాఫ‌న్స్ ప్రారంభం

కొత్త గాజువాక‌లోశ్రీ‌వేద ఫ్యాఫ‌న్స్ ప్రారంభంబిగ్ బాస్ ఫేమ్ హిమ‌జ సంద‌డి

 

గాజువాక : కొత్త గాజువాక‌లోని మెయిన్ రోడ్డు ద‌రి హైస్కూల్ రోడ్డు ప‌క్క‌న శ్రీ‌వేద ఫ్యాష‌న్స్ స్టోర్‌ను బిగ్‌బాస్ ఫేమ్ హిమ‌జ శనివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ స్టోర్‌లో అన్ని ర‌కాల ఫ్యాష‌న్ వ‌స్త్రాలు ఉండ‌టం ఒక ప్ర‌త్యేక‌త‌న్నారు. శ్రీ‌వేద‌లో షాపింగ్ చేసుకొని ఈ పండ‌గ సంతోషాన్ని మ‌రింత రెట్టింపు చేసుకోవాల‌ని కోరారు. అంద‌మైన సాగ‌ర తీరానికి ఎన్ని సార్లు వ‌చ్చినా రావాల‌నిపిస్తోంద‌ని పేర్కొన్నారు. ఈ స్టోర్ ఓపెనింగ్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.

శ్రీ‌వేద ఫ్యాష‌న్స్ ఎండీ కే వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ సూటింగ్‌, ష‌ర్టింగ్స్ ఇక్క‌డ ల‌భించున‌ని తెలిపారు. రెడీమేడ్ ష‌ర్ట్స్‌, ప్యాంట్స్‌తో పాటు బెడ్ షీట్స్‌, దివాన్ కాట్ బెడ్ షీట్స్‌, డోర్ మేట్స్ ఉన్నాయ‌న్నారు. మ‌హిళ‌ల మ‌న‌సు దోచే కాట‌న్ శారీస్‌కు ఈ షాపు నిల‌య‌మ‌న్నారు. వేద‌పండితుల‌కు పంచి కండువాలు, దోతీస్‌, చిన్నారుల దోతీ సెట్స్ ఉన్నాయ‌ని తెలిపారు. యువ‌త ఇష్ట‌ప‌డే సంప్ర‌దాయ వ‌స్త్రాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. అన్ని బ్రాండ్స్ ఇన్న‌ర్ వేర్‌, గార్మెంట్స్ ఉన్నాయ‌ని చెప్పారు. రేమండ్స్‌, లెనిన్ క్ల‌బ్‌, ఆర‌వింద్‌, రీడ్ అండ్ టేల‌ర్, డోనియ‌ర్, బొంబే డ‌యింగ్‌, రామ‌రాజ్‌, లెనిన్ వోగ్‌, సియారామ్స్ ఇక్క‌డ ల‌భించున‌ని పేర్కొన్నారు. జాకీ, రామ‌రాజ్‌, దిక్సీ, ఓక్సో, గోకుల్ త‌దిత‌ర ఇన్న‌ర్ వేర్ కూడా ల‌భించున‌ని తెలిపారు.

హిమ‌జ సంద‌డి

బిగ్‌బాస్ ఫేమ్ హిమ‌జ శ్రీ‌వేద ఫ్యాష‌న్స్ స్టోర్ ప్రారంభానికి వ‌స్తోంద‌ని తెలియ‌డంతో ఆమె అభిమానులు ఉద‌యం నుంచి ఆ ప్రాంతంలో బారులు తీరారు. దీంతో ఆమె అభిమానులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అభిమానులు కేరింత‌ల‌తో సంద‌డి చేశారు. స్టోర్ ప్రారంభం అనంత‌రం బ‌య‌టికి వ‌చ్చి అభిమానుల‌కు అభివాదం చేశారు. హాయ్ గాజువాక పీపుల్ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.