నవీన కధాంశంతో నేను లేని నా ప్రేమకథ !!

నవీన కధాంశంతో నేను లేని నా ప్రేమకథ !!

నవీన కధాంశంతో నేను లేని నా ప్రేమకథ !!

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర, మరో సరికొత్త ప్రేమకధా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లక్ష్మీ కందుకూరి సమర్పణలో త్రిషాల ఎంటర్ టైన్ మెంట్స్, సిద్దిపల్లి సూర్యనారాయణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేని నా ప్రేమకధ’.

ఈ చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించారు. పాండమిక్ టైంలో మూవీకి మెరుగులు దిద్ది అధ్బుతంగా.. అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు దర్శకులు సురేష్ ఉత్తరాది. మ్యూజిక్ డైరెక్టర్ జువెన్ సింగ్ అందించిన స్వరాలు ప్రతీ ఒక్కరికీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని, దీనికి మంచి సాహిత్యాన్ని రాంబాబు గోశాల రాసారని, ప్రముఖ ఎడిటర్ ప్రవీణ్ పూడి, సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఎన్.కె. భూపతిగారి సహకారంతో సినిమా మంచి క్వాలిటీతో వచ్చిందని నిర్మాత కళ్యాణ కందుకూరి గర్వంగా చెప్పారు.

ఈ చిత్రానికి చక్కటి సంభాషణలు మనసుకు హత్తుకునే విధంగా మాటల రచయిత సాబిర్ షా వ్రాసారని మరో నిర్మాత నిమ్మకాయల దుర్గాప్రసాద్ రెడ్డి చెప్పారు. సినిమా రషెస్ చూసి ఇంప్రెస్ అయిన UFO డిస్ట్రిబ్యూషన్ పార్ట్ నర్ గా తమతో టైఅప్ అయ్యారని నిర్మాతలు కళ్యాణ్ కందుకూరి నిమ్మకాయల దుర్గాప్రసాద్ రెడ్డి, డా. అన్నదాత బాస్కర్‌రావు చెప్పారు.

జెమిని రికార్డ్స్ వారు మొదటిసారిగా ఆడియో రంగంలోకి వస్తూ ‘నేను లేని నా ప్రేమకథ’  ఆడియో రైట్స్ తీసుకున్నారని ఆనందం వ్యక్తపరిచారు నిర్మాతలు. త్వరలో టీజర్, ఆడియో ఫంక్షణ్ రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తామని చెప్పారు నిర్మాతలు

ఈ సినిమాలో నవీన్ చంద్రతో పాటు గాయత్రి ఆర్. సురేష్, క్రిష్, అదితీ మ్యాకల్, రాజా రవీంద్ర, బ్యాంక్ వెంకట రమణ, బండ స్వీటీ డివిజ, జబర్దస్త్ శాంతి, షైనీ, రామ్ విన్నకోట, దాసరి శ్రీనివాస్ నటీ నటులుగా నటించారు

 
Much awaited entertainer …

‘’NENU LENU NAA PREMA KADHA”

All set to release!!!

The upcoming film, ‘’NENU LENU NAA PREMA KADHA” starring Naveen Chandra,
Gayatri R Suresh ,
Krish Siddipalli and
Aditi mykala
in lead roles, has wrapped the shooting and is all set to release.

Suresh Utharadhi has helmed this youthful and interesting entertainer which is bankrolled by KALYAN KADUKURI, NIMMAKAYALA DURGA PRASAD REDDY,
Dr.A.BHASKAR RAO under the banners THRISHALA ENTERTAINMENTS, S.S STUDIOS and SARASWATI CREATIONS.

‘’NENU LENU NAA PREMA KADHA”,  the film with new subject and storyline has been shot in natural and beautiful locations. Recently, the film unit has wrapped up the shoot for song sequences. Juevin Singh has composed music. Prominent editor Prawin Pudi, senior DOP Boopathy have contributed a lot in getting a quality output.
Dialogue writer SABEER SHA has added heartfelt dialogues to the movie ,and also Three songs wrote by famous lyric writer RAMBABU GOSALA !

Producer – KALYAN KADUKURI said, after seeing the amazing output, the UFO got impressed and has tie up with us as a distribution partner.

Soon, the details pertaining to triler , audio function and movie release date will be announced.