క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా ‘ ఆకాశ వీధుల్లో’ ఫస్ట్ లుక్ విడుదల

క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా ‘ ఆకాశ వీధుల్లో’ ఫస్ట్ లుక్ విడుదల

క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా ‘ ఆకాశ వీధుల్లో’ ఫస్ట్ లుక్ విడుదల

విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారి చేతుల మీదుగా ఆకాశ వీధుల్లో చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ – ఫస్ట్ లుక్ చాలా బాగుంది. చిత్రం యొక్క టీజర్ మరియు రెండు పాటలు చూశాను నాకు  బాగా నచ్చాయి. టీమ్ అందరికీ  అభినందనలు” అన్నారు

చిత్ర కథానాయిక పూజిత పొన్నాడ మాట్లాడుతూ –  క్రిష్ గారు మా  సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

నూతన నటుడు మరియు దర్శకుడిగా పరిచయం అవుతున్న గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ – ” ఈ సినిమా  నా రెండున్నర ఏళ్ల కృషి,ఈ మూవీ కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. మా మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసినందుకు క్రిష్ గారికి కృతజ్ఞతలు” అన్నారు.

ఈ చిత్రాన్ని జీ.కే.ఫిల్మ్.ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో మనోజ్ జే.డి. మరియు డి.జే. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నటీనటులు :
గౌతమ్ కృష్ణ
పూజిత పొన్నాడ
రచన & దర్శకత్వం : గౌతమ్ కృష్ణ
బ్యానర్లు : జీ కే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియషన్స్
ప్రొడ్యూసర్స్ : మనోజ్ జే.డీ &  డా. డీ.జె. మణికంఠ
సంగీతం : జుడా శాండీ
డి.ఓ.పీ : విశ్వనాథ్ రెడ్డి
PRO – వంశీ శేఖర్