ఇంట్ర‌స్టింగ్ ఇంట‌లిజెంట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ `ట్రు` Rating: 3/5

  ఇంట్ర‌స్టింగ్ ఇంట‌లిజెంట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ `ట్రు` Rating: 3/5

 

 

                                                    `ట్రు` మూవీ రివ్యూ!!

 

న‌టీన‌టులుః
హీరో హరీష్ వినయ్, హీరోయిన్ లావణ్య , ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మధుసూదన్, టి.ఎన్ ఆర్ , డీఎస్ రావు మణికంఠ, మహేంద్రనాత్ హెచ్ ఎమ్, శుభోదయం సుబ్బారావు, బ్రాహనందరెడ్డి మరియు బాహుబలి కల్పలత లు న‌టించారు.
సాంకేతిక నిపుణులుః
కెమెరా : శివారెడ్డి; మ్యూజిక్ : ఎంజికె ప్రవీణ్
ఎడిటింగ్ : జేపీ; ఫైట్స్ : శంకర్
డాన్స్ : కపిల్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః జానకి రామారావు పామరాజు
ప్రొడ్యూసర్ : కేఆర్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ : శ్యామ్ మండల.

Rating : 3/5

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రాలకు ఎప్పుడూ జ‌నాద‌ర‌ణ ఉంటుంది. క‌ట్టిప‌డేసే క‌థ‌, క‌థ‌నాలు తోడ‌వ్వాలే కానీ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు థ్రిల్ల‌వ్వ‌ని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. గ‌తంలో అడ‌వి శేష్ న‌టించిన క్ష‌ణం, ఎవ‌రు చిత్రాలే అందుకు ఉద‌హార‌ణ‌లు. ఆ త‌ర‌హాలోనే యంగ్ డైర‌క్ట‌ర్ శ్యామ్ మండ‌ల దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఇంట్ర‌స్టింగ్ అండ్ ఇంటిలిజెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం `ట్రు`. ఈ చిత్రం ఈ శుక్ర‌వారం విడ‌ద‌లైంది. పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్స్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం రివ్యూ ఒక‌సారి చూద్దాం.

స్టోరిః
హీరో ( హ‌రీష్ విన‌య్‌) ఫాద‌ర్ మ‌ధు సూద‌న్ క‌రెంట్ షాక్ తో చ‌నిపోతాడు. దీంతో ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట‌ర్ గా ప‌ని చేసే హీరో త‌న ఫాద‌ర్ ది స‌హ‌జ మ‌ర‌ణం కాదు ఎవ‌రో హ‌త్య చేశారంటూ ఇన్వెస్టిగేష‌న్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ ఇన్వెస్టిగేష‌న్ కు హీరోయిన్ తో పాటు ఊళ్లో వాళ్లు కూడా అడుగ‌డుగునా అడ్డు ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో హీరోకు ఒక‌ సీసీ టీవీ ఫుటేజ్ ల‌భిస్తుంది. ఆ ఫుటేజ్ చూసిన హీరో షాక్ కి గుర‌వుతాడు. అస‌లు ఆ సీసీ టీవీ ఫుటేజ్ లో ఏముంది? హీరో ఫాద‌ర్ ది హ‌త్యా, లేక స‌హ‌జ‌మ‌ర‌ణ‌మా? ఊళ్లో వాళ్లంతా హీరో కు ఎందుకు అడ్డుప‌డుతుంటారు ? చివర‌కు ఏమైంది అన్న‌ది మిగ‌తా క‌థ‌.

సినిమాకు ప్ల‌స్‌
క‌థ‌, క‌థ‌నాలు
డైర‌క్ష‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ
ఎడిటింగ్
నిర్మాణ విలువ‌లు

సినిమాకు మైన‌స్‌
నేప‌థ్య సంగీతం

న‌టీన‌టులు హావ‌భావాలుః
బైలంపుడి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హ‌రీష్ విన‌య్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట‌ర్ పాత్ర‌లో న‌టించాడు అన‌డం క‌న్నా జీవించాడు అని చెప్పాలి. సినిమా మొత్తం త‌న భుజాల‌పై మోశాడు. అలాగే హీరోయిన్ లావ‌ణ్య త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించిన మ‌ధుసూద‌న్ వ‌డ్డీ వ్యాపారిగా , ఉమ‌నైజ‌ర్ గా అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. అలాగే ఆయ‌న భార్య‌గా క‌ల్ప‌ల‌త కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. టియ‌న్ ఆర్ ది చిన్న పాత్రైన రిజిస్ట‌ర్ అయ్యేలా ఉంది. అంద‌రూ దాదాపు అప్ క‌మింగ్ వారైనా వారి వారి పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
శివారెడ్డి సినిమాటోగ్ర‌ఫీ; ఎక్క‌డా బోర్ లేకుండా క‌థ‌ను ప‌రుగుపెట్టించిన జేపీ ఎడిటింగ్ , ద‌ర్శ‌కుడి క‌థ క‌థ‌నాల‌తో పాటు టేకింగ్ సినిమాకు మెయిన్ ఎస్సెట్స్ గా నిలిచాయి. ఒక పాట బాగున్న‌ప్ప‌టికీ నేప‌థ్య సంగీతం అక్క‌డక్క‌డా త‌ప్ప పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ప్రొడ్యూసర్ : కేఆర్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

విశ్లేష‌ణః
గ‌తంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ స్టోరీస్ తో సినిమాలు చాలా వ‌చ్చినప్ప‌టికీ వాటిన్నింటిని మించేలా ఎవ‌రూ ఊహించ‌ని కాన్సెప్ట్ తో ట్రూ చిత్రం వ‌చ్చింది. తండ్రి ది స‌హ‌జ మ‌ర‌ణం కాదంటూ కొడుకు ఇన్వెస్టిగేష‌న్ సా ర్ట్ చేయ‌డం…ఆ ఇన్వెస్టిగేష‌న్ లో భాగంగా త‌న చుట్టూ ఉన్న వారిని అనుమానించ‌డం ఇలా వెళ్తోన్న క్ర‌మంలో ఒక్క‌సారిగా త‌నే తండ్రి ని చంపాడ‌ని తెలుసుకొనే ఇంట్ర‌వెల్ ట్విస్ట్ తో హీరోనే కాకుండా చూసే ఆడియ‌న్స్ కూడా ఒక్క‌సారిగా షాక్ కి గుర‌వుతారు. అప్ప‌టి వ‌ర‌కు అస‌లు ఏం జ‌రుగుతుందో అర్థం కానీ ఆడియ‌న్స్ కి ఒక్క‌సారే పెద్ద ట్విస్ట్ తో ఇంట్ర‌వెల్ ఇచ్చి నెక్ట్స్ ఏంటి? అనే లా ఆడియ‌న్స్ చేత ఆలోచిపంజేశాడు. ఇక సెకండాఫ్ కానీ, త‌న ఫాద‌ర్ ని త‌నే ఎందుకు చంపాడ‌న్న విష‌యాన్ని కానీ ద‌ర్శ‌కుడు చాలా సున్నితంగా ఎక్క‌డా లాజిక్ మిస్స‌వ్వ‌కుండా సైంటిఫిక్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ముఖ్యంగా త‌నే చంపి త‌నే ఇన్వెస్టిగేష‌న్ చేయ‌డం అనేది సినిమాకు హైలెట్ గా నిలిచే ట్విస్ట్. ఆ ట్విస్ట్ ని ద‌ర్శ‌కుడు ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా క‌న్విన్సింగ్ చెప్పాడు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. గంట‌ర్న‌ర సేపు ఎక్క‌డా బోర్ లేకుండా నెక్ట్స్ ఏంటి? అన్న క్యూరియాసిటీ క‌థ ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ఇష్ట‌ప‌డే వారంద‌రికీ ఈ చిత్రం క‌చ్చితంగా న‌చ్చుతుంది. కాబ‌ట్టి ట్రూ సినిమాను అంద‌రూ చూసి థ్రిల్ ఫీల‌వ్వ‌చ్చు. దిస్ ఈ జ్ ట్రూ.. సో డోంట్ మిస్.

సూటిగా చెప్పాలంటేః
  ఇంట్ర‌స్టింగ్ ఇంట‌లిజెంట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ `ట్రు`