యువ సామ్రాట్ నాగ చైతన్య విడుదల చేసిన రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ టైటిల్ సాంగ్ !!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్, శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది.
కింగ్ నాగార్జున అనుభవించు రాజా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘అనుభవించు రాజా సినిమాలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఈ పాటను చూశాను. ఎంతో అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటకు చక్కగా కుదిరాయి. ఆల్రెడీ నేను సినిమా కూడా చూశాను. సినిమా ఆసాంతం ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో రాజ్ తరుణ్ రెండు రకాల వెరియేషన్స్‌ను చూపించారు. అద్భుతమైన సందేశంతో, ఆద్యాంతం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అనుభవించు రాజా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
గోపీ సుందర్ అందించిన ఈ పాటలో.. జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందెలు, రికార్డింగ్ డ్యాన్సులు, సంక్రాంతి పండుగ వాతావరణం అంతా కూడా ఇందులో కనిపిస్తుంది. రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు భాస్కర భట్ల అద్భుతైన సాహిత్యాన్ని అందించారు. విజువల్స్ ఎంతో కలర్ ఫుల్‌గా ఉన్నాయి. ఇక కొరియోగ్రఫీ కూడా ఎంతో చక్కగా కుదిరింది. సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి ఈ పాట పెర్ఫెక్ట్ ఛాయిస్..
సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ నటిస్తున్నారు. భాస్కర భట్ల సాహిత్యాన్ని అందిస్తుండగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు : రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా
సాంకేతిక బృందం
రచయిత, దర్శకత్వం : శ్రీను గవిరెడ్డి
నిర్మాత : సుప్రియ యార్లగడ్డ
బ్యానర్స్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం : గోపీ సుందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆనంద్ రెడ్డి కర్నాటి
సినిమాటోగ్రఫర్ : నాగేష్ బానెల్
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
లిరిక్స్ : భాస్కర భట్ల
ఆర్ట్ డైరెక్టర్ : సుప్రియ బట్టెపాటి, రామ్ కుమర్
కొరియోగ్రఫర్ : విజయ్ బిన్నీ
ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
క్యాస్టూమ్ డిజైనర్ : రజినీ.పి
కో డైరెక్టర్ : సంగమిత్ర గడ్డం
పీఆర్వో : వంశీ-శేఖర్
Young and talented hero Raj Tarun has teamed up with director Sreenu Gavireddy for an out and out entertainer Anubhavinchu Raja being produced by Annapurna Studios Pvt Ltd, in association with Sree Venkateswara Cinemas LLP (SVCLLP).
King Akkineni Nagarjuna launched first look of Anubhavinchu Raja, while mega power star Ram Charan unleashed teaser of the movie. Today, Yuva Samrat Naga Chaitanya released title song of the movie.
Naga Chaitanya said, “I’m very happy to be launching first song from Anubhavinchu Raja. I’ve just watched the song, it’s really beautiful. Ram Miriyala’s voice, Gopi Sundar’’s music and Bhaskarabhatla’s lyrics worked well for the song. I’ve also watched the movie and I’ve enjoyed it thoroughly. Raj Tharun showed two different variations in two halves of the film. It looks to be a complete entertainer package with really nice image. I wish the entire team of Anubhavinchu Raja all the best.”
Scored by Gopi Sundar, the song begins on funny note describing the good fortune of protagonist who enjoys life to the fullest. Kodi Pandelu, record dancing and other Sankranthi specials are seen in the song. Ram Miriyala crooned the number with his high pitch vocals, while lyrics penned by Bhaskarabhatla are humorous. Visuals look colorful, wherein choreography is neat. This gives a perfect start to the music promotions of the film.
Kashish Khan is the leading lady opposite Raj Tarun in the movie produced by Supriya Yarlagadda. Bhaskarabhatla is the lyricist and Chota K Prasad is the editor.
Currently in post-production stages, Anubhavinchu Raja is gearing up for its theatrical release.
Cast: Raj Tarun, Kashish Khan, Posani Krishna Murali, Aadukalam Naren, Ajay, Sudharshan, Tempar Vamsi, Aadharsh Bhalakrishna, Ravi Krishna, Bhupal Raju, Ariyana