రాజమండ్రిలో ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ !!

రాజమండ్రిలో ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ !!

   కీర్తి సురేష్‌ని స్ఫూర్తిగా తీసుకుని వెంకీ ఈ క‌థ రాశారు – హీరో నితిన్‌

 
  నితిన్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్ – కీర్తి సురేష్‌ 
 
  సరదాగా, సందడిగా రాజమండ్రిలో ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
 
యూత్ స్టార్ నితిన్ న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `రంగ్ దే`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవర నాగ‌వంశీ నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్ వీడియోల‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ నెల 26న విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ ఈవెంట్‌ని బుధవారం రాత్రి రాజ‌మండ్రిలో గ్రాండ్‌గా నిర్వహించారు.  
 
ఈ వేడుకలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ  “రాజ‌మండ్రికి నాకు అనుబంధం వుంది. ఫ‌స్ట్ టైమ్ ఈవెంట్ ఇక్క‌డ జ‌ర‌గ‌డం..చాలా ఆనందంగా వుంది. బేసిగ్గా ల‌వ్‌స్టోరీసే చేయాల‌న్న‌ది నా అభిమ‌తం కాదు. జ‌స్ట్ ఇది యాదృచ్ఛికంగా జ‌రిగింది. `రంగ్ దే` అనేది ఇద్ద‌రు వ్య‌క్తుల ప్రేమ‌క‌థ మాత్ర‌మే కాదు. `రంగ్ దే` అని పెట్ట‌డానికి కార‌ణం ఏంటంటే హోళీ ఆడితే ర‌క‌ర‌కాల క‌ల‌ర్ల‌ని ఒకేసారి ముఖం మీద కొడ‌తాం. అలాగే ఈ సినిమాలో కూడా ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ ఒక స్ప్లా‌ష్ కింద వ‌స్తే ఎంత హ్యాపీగా ఫీల‌వుతామో అంత చ‌క్క‌గా వుంటుందీ సినిమా. ప్రామిస్‌గా చెబుతున్నాను.. నితిన్‌గారు కామెడీ నిజంగా అద‌ర‌గొట్టేశారు. కీర్తిగారిని ఎంత ఏడిపిస్తారో.. త‌రువాత ఆమె అంత ప‌గ తీర్చుకుంటారు. ఈవిడ మామూలు మ‌నిషి కాదు. ఖ‌చ్చితంగా ఈ సినిమా మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. దేవిగారి విష‌యంలో త‌ప్పు చేశాను. అందుకు అంద‌రి ముందు పారీ చెబుతున్నాను. “బస్టాండే.. బ‌స్టాండే..” పాట ఎంతో పెద్ద హిట్టయింది. అందరికి న‌చ్చింది. అయితే ఈ పాట ముందు విన్న‌ప్పుడు సార్ ఇది అంటూ న‌సిగాను. వెంట‌నే దేవిగారు మీకు మైండ్ వుందా? అని తిట్టి ఈ సాంగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని ఈ సాంగ్ పెడ‌దాం అని న‌న్ను క‌న్విన్స్ చేశారు. ఆ పాట రిలీజైన ద‌గ్గ‌రి నుంచి మిలియ‌న్స్ వ్యూస్‌ని దాటేస్తోంది. ఈ సంద‌ర్భంగా దేవిగారికి సారీ చెబుతున్నాను.”అన్నారు.   ‌ 
 
రాక్ స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “చాలా హ్యాపీగా వుంది. కొన్ని రోజుల క్రితం `ఉప్పెన‌`కు వ‌చ్చాం.. ఊపేశారు. ఇప్పుడు `రంగ్ దే`కు వ‌చ్చాం. ఈ మూవీ ఆడియోను బ్లాక్ బ‌స్ట‌ర్ చేసినందుకు చాలా థ్యాంక్స్‌. `రంగ్ దే` వెరీ రొమాంటిక్‌, సెంటిమెంట్‌, ఫ్యామిలీ, యూత్‌, అంద‌రికీ న‌చ్చే విధంగా కామెడీ అన్నీ వున్నాయి ఈ సినిమాలో. సో ఖ‌చ్చితంగా మీ అంద‌రికి న‌చ్చుతుంది. బాగా ఎంజాయ్ చేస్తార‌నుకుంటున్నాం. నేను కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన‌ప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ప్ర‌త్యేకంగా చెప్పాలంటే వెంకీ గారు చాలా అందంగా తీర్చిదిద్ది ఈ సినిమాని తీశారు. థాంక్యూ వెంకీ గారు ఇలాంటి వండ‌ర్‌ఫుల్ రొమాంటిక్ మూవీకి వ‌ర్క్ చేసినందుకు. థ్యాంక్యూ ఫ‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ గారు. ప్రారంభం నుంచి నాకు పేరు తెచ్చిన‌వి ల‌వ్ స్టోరీసే. ఆనందం, సొంతం.. వ‌ర్షం కానీ..ఈ మ‌ధ్య కాలంలో చేసిన `ఉప్పెన‌` కానీ `రంగ్ దే` కానీ మంచి పేరు తెచ్చి పెట్టాయి. తొలిసారి నితిన్‌గారు నేను క‌లిసి వ‌ర్క్ చేశాం. మెలోడీస్ తో చేసిన రొమాంటిక్ ఫిల్మ్ ఇది. నితిన్ గారితో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా వుంది. ప్ర‌తీ సాంగ్ కి నాకు ఫోన్ చేసి ఫుల్ జోష్ ఇచ్చేవారు. ఈ మూవీలో నితిన్ గారి న‌ట‌న చూస్తే ఒక బ్యూటిఫుల్ గ్రాఫ్ వుంటుంది. అల్ల‌రి కుర్రాడి నుంచి ఫుల్ కామెడీ చేస్తూ కీర్తిని ఏడిపించుకుంటూ ఫైన‌ల్‌గా మెచ్యూర్డ్ న‌ట‌న.. నాకు చాలా చాలా న‌చ్చింది. కీర్తి సురేష్‌, నితిన్ ల కెమిస్ట్రీ అదిరిపోయింది.” అన్నారు. 
 
హీరో నితిన్ మాట్లాడుతూ “రంగ్ దే` సినిమా మార్చి 26న మీ ముందుకొస్తోంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఖ‌చ్చితంగా మీ అంద‌రికి బాగా న‌చ్చుతుంది. ఈ బ్యాన‌ర్‌లో నాకిది మూడ‌వ సినిమా. అ ఆ, భీష్మ ఇప్పుడు `రంగ్ దే`. సో ఆ రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఆడాల‌ని కోరుకుంటున్నాను. రాజ‌మండ్రికి లాస్ట్ టైమ్ `భీష్మ‌` షూటింగ్‌కి వ‌చ్చాను. సాంగ్ షూట్ కోసం వ‌చ్చాను. ఆ సినిమా హిట్ట‌యింది. `రంగ్ దే` కోసం మ‌ళ్లీ ఇప్పుడు ఇక్క‌డికి వ‌చ్చాను. సెంటిమెంట్‌గా మ‌ళ్లీ ఆడాల‌ని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూస‌ర్ వంశీగారు ఇక్క‌డికి రాలేక‌పోయారు. వెంకీ అట్లూరి ఎప్ప‌టి నుంచో  నాకు మంచి స్నేహితుడు. త‌ను సినిమా బాగా చేశాడు. డీఎస్పీగారితో తొలిసారి వ‌ర్క్ చేశాను. చాలా అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. ఈ సాంగ్స్ చాలా రోజుల వ‌ర‌కు గుర్తుంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాట‌లు చాలా పెద్ద హిట్ అవుతాయి. థ్యాంక్యూ దేవీ స‌ర్.. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. మ‌న కాంబో ముందు ముందు ఇలాగే కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను. కీర్తీ చాలా మంచి న‌టి. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. త‌న రియ‌ల్ క్యారెక్ట‌ర్ అదే. అంద‌రిని టార్చ‌ర్ పెడుతూ వుంటుంది. అది చూసి స్ఫూర్తిగా తీసుకుని వెంకీ ఈ క‌థ రాశారు. మార్చి 26 థియేట‌ర్‌లో ఈ సినిమా చూడండి. ఏప్రిల్ 9న ‘వ‌కీల్ సాబ్’ చూద్దాం” అన్నారు. 
 
కీర్తి సురేష్ మాట్లాడుతూ “రొమాంటిక్  కామెడీ సినిమా ఇచ్చినందుకు వెంకీకి థ్యాంక్స్‌. డీఎస్పీతో ఇది నా థ‌ర్డ్ ఫిల్మ్‌. ఇది హ్యాట్రిక్ అవుతుంద‌ని చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. నితిన్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్‌. ఒక విష‌యం చెప్పాలి. ట్రైల‌ర్ చూస్తే నేను విల‌న్‌లా క‌నిపిస్తున్నాను. అది అబ‌ద్ధం. నితినే విల‌న్‌. సెకండ్ హాఫ్‌లో నేను రివేంజ్ తీర్చుకున్నాను. అది మాత్ర‌మే ట్రైల‌ర్‌లో వుంది. అది చూసి మ‌రోలా భావించ‌కండి. థియేట‌ర్లో సినిమా చూసి నిజం ఏంటో తెలుసుకోండి. థియేట‌ర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. 26న మా చిత్రం విడుద‌ల‌వుతోంది చూసి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించండి” అన్నారు. 
 
శ్రీ‌ముఖి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ కార్య‌క్ర‌మంలో టి టైమ్ ఉద‌య్‌, కాళీతేజ‌, అవి‌నాష్ కొల్లా త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇదే వేదిక‌పై రాజిరెడ్డి, స‌త్యకృష్ణ‌, మింది నాగేంద్ర .. యువ‌త హ‌రిత కార్య‌క్ర‌మం లో భాగంగా  చిత్ర బృందానికి మొక్క‌ల్ని అంద‌జేశారు. “బ‌స్టాండే బ‌స్టాండే”.. పాట‌కు ధేవిశ్రీ‌ప్ర‌సాద్‌, నితిన్‌, వెంకీ అట్లూరి, కీర్తి సురేష్ స్టెప్పులేశారు. అంతే కాకుండా ఇదే వేదిక‌పై కీర్తి సురేష్‌తో పాట పాడించారు.
 
Rang De Grand Release Event Held at Rajamahendravaram
 
Youth star Nithiin and Keerthy Suresh starrer ‘Rang De’ is gearing up for a worldwide release on March 26th. The film written and directed by Venky Atluri is getting a lot of positive buzz, all thanks to the trailer and lyrical videos released recently. ‘Rang De’ grand release event was held in a splendour manner in Rajamahendravaram.
 
Director Venky addressed the gathering first and said, “I have a connection with Rajamahendravaram and happy that ‘Rang De’ event is taking place here. Basically I did not confine myself to do only love stories but it just happened. ‘Rang De’ is like Holi festival that we see too many colors on a single day. This film will have many emotions.”
 
Adding the director said, “Nithiin’s comedy timing will be something else in this movie. He will bully Keerthy Suresh but she will get her share of revenge. She is no ordinary woman and definitely ‘Rang De’ will entertain everyone especially family audiences.”
 
Venky offered apology to music composer Devi Sri Prasad on this occasion. “When I heard the song ‘Bus Stande.. Bus Stande..’ I did not like. But DSP was sure that the song will be a huge hit and he even scolded me. After the release of the song and when it was getting millions of views, I realised I was wrong. I’m sorry DSP,” concluded Venky.
 
Music composer Devi Sri Prasad said, “A few days back I was here for ‘Uppena’ event and I’m back yet again. So happy to be in Rajamahendravaram. First of all I would like to thank everyone for making ‘Rang De’ music a huge success. This film has romance, comedy, entertainment, sentiment and will appeal to both family and youth audiences. I thoroughly enjoyed while doing the background score. Director Venky has crafted the film extremely well, so thank you director Venky for giving me to work in a romantic entertainer like ‘Rang De.’ Also thanks to Sithara Entertainments and Naga Vamsi.”
 
Further DSP said, “From the beginning of my career, love stories have brought me a big name. films like ‘Anandam’ ‘Varsham’ were the films in those days and now ‘Uppena’ and ‘Rang De’ are the ones that I’m happy to work.”
 
“This is my first film with Nithiin and he pumped my energy levels with his feedback for every song. His performance will be like a beautiful graph in this movie. He transforms from a playful youngster to a matured man. The chemistry between Nithiin and Keerthy is major highlight and asset for the film,” summed up DSP.
 
It was hero Nithiin’s turn then. “Rang De is releasing on March 26th and I’m sure that you all will like it. This is a family entertainer and will be liked by everyone. This is my third film in Sithara Entertainments banner. ‘A Aa’ and ‘Bheeshma’ were huge hits and I hope to score a hat-trick with Sithara. Due to some reasons my producer Naga Vamsi could not make it to the event,” said Nithiin.
 
“I know director Venky since long time and finally we worked together. Also this is my first film with music composer Devi Sri Prasad. He did give an amazing music. After the release of ‘Rang De’ the songs will turn even big hits and will be remembered for long. Thank you DSP for fantastic music. I hope more and more films come in our combination,” added Nithiin.
 
On Keerthy Suresh Nithiin said, “Keerthy is a terrific actor and she played her real self in the movie. She tortures everyone and director Venky got inspired by her and penned this story. Watch ‘Rang De’ in theatres on March 26th and then ‘Vakeel Saab’ on April 9th.”
 
Lastly Keerthy spoke and said, “Thanks to director Venky for making me part of this romantic comedy. I’m eagerly looking forward to score hat-trick hits with music composer Devi Sri Prasad. Nithiin is one of the best co-stars and I would like to clarify one thing. If you watch ‘Rang De’ trailer, I’m the villain but it’s not true. Nithiin is the villain and I take revenge in the second half. But don’t get carried away, watch the film in theatres and get to know the real twist. Bless us all and go watch ‘Rang De’ in theatres from March 26th.”
 
Sree Mukhi hosted the grand release event of ‘Rang De’ while Kali Teja, Avinash Kolla and others graced the occasion. Nithiin and ‘Rang De’ team took part in ‘Yuvatha-Haritha’ initiative and planted a sapling.
 
Nithiin, Keerthy, director Venky and DSP shook their leg on stage while DSP made Keerthy sing too.