మొదటి చిత్రంతోనే ఆకట్టుకుంటోన్న యువ హీరో పవన్ వర్మ

మొదటి చిత్రంతోనే ఆకట్టుకుంటోన్న యువ హీరో పవన్ వర్మ

మొదటి చిత్రంతోనే ఆకట్టుకుంటోన్న యువ హీరో పవన్ వర్మ !!

ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఇంకా విడుదల కాలేదు.. హీరోగా అరంగేట్రం చేస్తున్న పవన్ వర్మ నటన గురించి చిత్రయూనిట్టే కాకుండా.. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా మెచ్చుకుంటుండటం విశేషం. ‘రుద్రాక్షపురం’ చిత్రం హీరోలలో ఒకడిగా నటిస్తోన్న పవన్ వర్మ.. మొదటి చిత్రంతోనే సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో మంచి నటుడు రాబోతున్నాడని పరిశ్రమ ప్రముఖుల చేత అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ వర్మ చేస్తోన్న ‘రుద్రాక్షపురం’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో పవన్ వర్మ నటనకు మంచి మార్కులే కాదు ప్రశంసలు కూడా దక్కుతాయని, ముందు మందు మంచి హీరోగా నిలబడే సత్తా అతనిలో ఉందని చిత్రయూనిట్ సైతం మాట్లాడుకుంటోంది. ఇంత వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే నటుడిగా రెండు, మూడు అవకాశాలను సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

ఈ సందర్భంగా హీరో పవన్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ముందుగా ‘రుద్రాక్షపురం’ చిత్రంలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన దర్శకులు ఆర్.కె. గాంధీగారికి, నిర్మాత ఉపేంద్రగారికి, సహనటీనటులకి ధన్యవాదాలు. ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. చిన్నప్పటి నుండి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో కష్టాలను దాటుకుని హీరోగా నిలబడిన ప్రతి ఒక్కరి నుండి స్పూర్తి పొందాను. హీరోగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంత కష్టమైనా వెనుకాడను. ప్రస్తుతం రెండు సబ్జెక్ట్స్ ఫైనల్ అయ్యాయి. మరొక సబ్జెక్ట్‌కి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాను. ప్రేక్షకుల ఆశీస్సులు కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.