హీరోగా `విక్ర‌మ్` నాకో మార్క్ క్రియేట్ చేస్తుందిః యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో నాగ‌వ‌ర్మ‌

  హీరోగా `విక్ర‌మ్` నాకో మార్క్ క్రియేట్ చేస్తుందిః యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో నాగ‌వ‌ర్మ‌

  హీరోగా `విక్ర‌మ్` నాకో మార్క్ క్రియేట్ చేస్తుందిః యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో నాగ‌వ‌ర్మ‌

                     

 

ఆరడుగుల అంద‌గాడు, న‌వ‌ర‌సాలు అవ‌లీల‌గా పోషించ‌గ‌ల మ‌రో యువ క‌థానాయ‌కుడు టాలీవుడ్ కు ప‌రిచయం అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్ ఫ్రా రంగంలో త‌న ప్రతిభ‌ను చాటుకుని సినిమా రంగంలో త‌న‌ స‌త్తా చాటుకోవ‌డానికి  `విక్ర‌మ్` అనే చిత్రంతో హీరోగా ఇంట‌ర్ డ్యూస్  అవుతున్నారు   నాగ‌వ‌ర్మ . ఏ రంగంలోనైనా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలాగా ప‌ని చేసే ఆయ‌న సినిమా రంగంలో కూడా త‌న ప‌రాక్ర‌మాలు ప్ర‌ద‌ర్శిస్తాన‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌తో పాటు  దివ్యా సురేష్‌ని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తూ ఇంకా కొంత మంది టెక్నీషియ‌న్ల‌ను కూడా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేస్తూ ఈ చిత్రాన్ని ఆయ‌నే స్వ‌యంగా నిర్మించ‌డం విశేషం. పాట‌లు, ట్రైల‌ర్ తో ఇప్ప‌టికే  ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఈనెల 31న గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో క‌మ్ ప్రొడ్యూస‌ర్ నాగ‌వ‌ర్మతో బాక్సాఫీస్ ఇంట‌ర్వ్యూ జ‌రిపింది. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లో…

  మీ నేప‌థ్యం?
 నేను 20 ఏళ్లుగా ఇన్ ఫ్రా రంగంలో ఉన్నాను. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా ఫీల్డ్ అంటే ఎంతో ప్యాష‌న్ ఉండేది.   న‌టుడుగా కృష్ణంరాజు గారే నాకు ఇన్ స్పిరేష‌న్. ఆయ‌న సినిమాలు ఎక్కువ‌గా చూసేవాణ్ని. మా సినిమాలో కూడా `మై ఇన్ స్పిరేష‌న్` కృష్ణంరాజు గారు` అని టైటిల్  కార్డ్ కూడా వేశాము. ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత కృష్ణంరాజు గారిని క‌లిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటాను.
 విక్ర‌మ్ సినిమా ఎలా సెట్ట‌యింది?
 హ‌రిచంద‌న్ నాకు మంచి మిత్రుడు. `నా ద‌గ్గ‌ర మంచి స్క్రిప్ట్ ఉంది.  సినిమా చేద్దాం అంటూ న‌న్ను రెగ్యుల‌ర్ గా ఫాలో అప్ చేసేవాడు. తన క‌మిట్మెంట్, స్క్రిప్ట్ న‌చ్చి ప్ర‌జంట్ ట్రెండ్ కు త‌గిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి  విక్ర‌మ్ సినిమా స్టార్ట్ చేశాం. త‌ను డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ఎక్క‌డా ప‌ని చేయ‌క‌పోయినా కానీ ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా సినిమా చేశాడు. దానికి తోడు వ‌ర్క్ ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న డైర‌క్ష‌న్ టీమ్ ని పెట్టుకోవ‌డంతో ఎక్క‌డా మాకు ఇబ్బంది ఎదురుకాలేదు.
 
  విక్ర‌మ్ క‌థాంశం గురించి వివ‌రిస్తారా?
  ఇదొక బ‌ర్నింగ్ ల‌వ్ స్టోరి.  అమ్మాయి , అబ్బాయి మ‌ధ్య‌లో, ఫ్యామిలీస్ మ‌ధ్య‌లో ఇగోస్ వ‌స్తే ఆ ఇగోస్ ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయి. వాటన్నింటినీ దాటుకుని హీరో త‌న ప్రేమ‌ను ఎలా గెలుచుకున్నాడు అన్న‌ది  క‌థాంశం. ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌జంట్ ట్రెండ్ కు కనెక్ట‌య్యే రియ‌లిస్టిక్ అంశాలు మా సినిమాలో చాలా ఉన్నాయి. ల‌వ్, ఫ్రెండ్ షిప్ నేప‌థ్యంలో జ‌రిగే  మాస్  యాక్ష‌న్ డ్రామా అని చెప్ప‌వ‌చ్చు.  
 మీరే నిర్మించ‌డానికి కార‌ణం?
 న‌న్ను  నేను న‌టుడుగా ప్రూవ్ చేసుకోవ‌డానికి నేనే స్వ‌యంగా ఈ సినిమా నిర్మించాను. క‌చ్చితంగా విక్ర‌మ్ సినిమా హీరోగా నాకు మంచి ఇంట‌ర్ డ్యూసింగ్ సినిమా అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. బ‌య‌ట సినిమాల‌తో పాటు నా బేన‌ర్ లో కూడా నేను హీరోగా సినిమాలు నిర్మించ‌డానికి ప్లాన్ చేసుకున్నాను. ఇక మీద‌ట వ‌రుసగా నా సొంత బేన‌ర్ తో పాటు బ‌య‌ట బేన‌ర్స్ లో కూడా సినిమాలు చేస్తాను.
ఏయే ప్రాంతాల్లో,ఎన్ని రోజులు షూటింగ్ చేశారు?
 హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో దాదాపు 50 రోజుల పాటు సినిమా షూటింగ్ చేశాం. అనుకున్న‌దానిక‌న్నా బ‌డ్జెట్ పెరిగినా క్వాలిటీ ప‌రంగా చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా నిర్మాణంలో చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఎదురైనా వాటిని అధిగ‌మించి సినిమాను అనుకున్న విధంగా నిర్మించాను.
 
 
 విక్ర‌మ్ చిత్రానికి మ్యూజిక్ ఉన్న ప్రాధాన్య‌త ఎలాంటిది?
 కీర‌వాణి, కోటి, మణిశ‌ర్మ గార్ల వ‌ద్ద ప‌లు చిత్రాల‌కు ప‌ని చేసిన సురేష్ ప్ర‌సాద్ మా చిత్రానికి   ఐదు అద్బుతమైన  సాంగ్స్ ఇచ్చారు. ఆదిత్య ఆడియో ద్వారా ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి వ్యూస్ తో పాటు  మంచి రెస్పాన్స్  కూడా వ‌స్తోంది. విజ‌య్ ప్ర‌కాశ్‌, పృథ్వీ, హేమ‌చంద్ర‌, గీతామాధురి, ప్ర‌ణ‌వి, ర‌మ్య బెహ‌రా మా చిత్రంలోని పాట‌లు ఆల‌పించారు. ఇందులో నాలుగు పాట‌లకు స‌త్య మాస్ట‌ర్, క‌పిల్ మాస్ట‌ర్ ఒక సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ చేశారు.
న‌టీన‌టుల గురించి చెప్పండి?
నేను, హీరోయిన్ త‌ప్ప చాలా మంది  సీనియ‌ర్ ఆర్టిస్టులు మా సినిమాలో న‌టించారు. ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సీనియ‌ర్స్ ఆర్టిస్ట్స్ అంద‌రూ ఎంతో ఎంకరేజ్ చేశారు. వాళ్ల స‌పోర్ట్, స‌ల‌హాలు నాకు చాలా ఉప‌యోగ‌ప‌డ్డాయి.
 టెక్నీషియ‌న్స్ గురించి చెప్పండి?
సెంథిల్ గారి వ‌ద్ద ప‌లు చిత్రాల‌కు ప‌ని చేసిన వేణు సినిమాటోగ్ర‌ఫీ చేశారు. ప్ర‌తి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఎడిట‌ర్ గా మేన‌గ శ్రీను చేశారు. పెద్ద ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌ని చేసిన డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ మా సినిమాకు ప‌ని చేశారు.  ప్ర‌తి ఒక్క‌రూ టాలెంటెడ్ తో పాటు  ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న టెక్నీషియ‌న్స్ మా సినిమాకు ప‌ని చేశారు. ఇక  మా డైరక్ట‌ర్ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా ఫుల్ కాన్ఫిడెన్స్ తో సినిమా చేశాడు. అద్భ‌తమైన టేకింగ్ తో పాటు ఆక‌ట్టుకునే డైలాగ్స్ రాశాడు. ఈసినిమాతో డైర‌క్ట‌ర్ గా త‌న‌కు మంచి పేరు రావ‌డం ఖాయం.
 ఈ సినిమా విష‌యంలో మీరు ధ్యాంక్స్ చెప్ప‌ద‌లుచుకున్న‌వారు?
డైర‌క్ట‌ర్ తేజ గారు టైటిల్ ,  డైర‌క్ట‌ర్ బాబి గారు టీజ‌ర్, కోటి గారు, చంద్ర‌బోస్ గారు, శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు త‌లా ఒక సాంగ్ లాంచ్ చేసి మా టీమ్ అంద‌రికీ త‌మ బ్లెస్సింగ్స్ అందించారు. ప‌త్రికాముఖంగా వీరంద‌రికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
  సినిమాకు హైలెట్స్?
  యూత్ కి న‌చ్చే స్టోరి, డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్  మా సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. శివ ప్రేమ్ మాస్ట‌ర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తాయి.
 విక్ర‌మ్ క‌థ‌నే ఫ‌స్ట్ సినిమా తీయ‌డానికి రీజ‌న్‌?
 చాలా క‌థ‌లు విన్నాను. విన‌గానే విక్ర‌మ్ క‌థ న‌చ్చింది.  ప‌ర్ఫార్మెన్స్ కి స్కోపున్న క‌థ అనిపించింది. అందుకే వెంట‌నే ఈ క‌థ ఓకే చేశాను. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ పాత్ర నాది. క‌చ్చితంగా ఈ సినిమాతో న‌టుడుగా మంచి పేరు వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాను.
 హీరోగా మాత్ర‌మే చేస్తారా? ఎలాంటి పాత్రైనా చేయ‌డానికి సిద్ధ‌మేనా?
 హీరోగా మాత్ర‌మే కాదు… ప‌ర్ఫార్మెన్స్ స్కోపున్న ఎలాంటి క్యార‌క్ట‌ర్ అయినా చేయ‌డానికి నేను సిద్ధ‌మే. అది నెగిటివ్ పాత్రైనా స‌రే.
 మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
  హీరోగా  రెండు చిత్రాలు క‌మిట‌య్యాను. ఒక సినిమా జ‌న‌వ‌రి 19న షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి జూ.ఎన్టీఆర్ హీరోగా న‌టించిన `నాగ‌` సినిమా డైర‌క్ట‌ర్ డికే సురేష్ గారు డైర‌క్ష‌న్ చేయ‌నున్నారు. ఇక రెండో సినిమా బాల గారి డైర‌క్ష‌న్ లో ఉంటుంది. వీరిద్ద‌రూ త‌మిళ ద‌ర్శ‌కులే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ రెండు సినిమాలు రూపొంద‌నున్నాయి. నా బేన‌ర్ లో కూడా కంటిన్యూయ‌స్ గా సినిమాలు చేస్తాను.
 `విక్ర‌మ్` సినిమా ఎప్పుడు రిలీజ్?
 ఈ నెల 31న గ్రాండ్ గా దాదాపు 150 థియేట‌ర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. త‌మిళ్ లో మ‌హావీర‌న్ గా అదే రోజు రిలీజ్ చేస్తున్నాం.
 మీరు న‌టించాల‌నుకునే ద‌ర్శ‌కులు?
పూరి గారి డైర‌క్ష‌న్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న సినిమాల్లో హీరోయిజం బావుంటుంది. అలాగే ఆర్జీవీ గారు, కృష్ణ వంశీగారు అన్నా కూడా చాలా ఇష్టం. రాజ‌మౌళి గారి ద‌ర్శ‌క‌త్వంలో చిన్న పాత్ర దొరికినా చాలు.