“సెన్సార్ ” పూర్తి చేసుకున్న “వధుకట్నం” చిత్రం “పోస్టర్ ” రిలీజ్

“సెన్సార్ ” పూర్తి చేసుకున్న “వధుకట్నం” చిత్రం “పోస్టర్ ” రిలీజ్

 
శ్రీహర్ష, ప్రియ , రఘు , కవిత , ఆర్యన్ , రేఖ , కుషాల్ , అనోన్య , మణి చందన  ప్రధాన పాత్రధారులుగా , గ్రీన్ క్రాస్ థియోసోఫికల్  రూరల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్  సొసైటీ సమర్పణ లో “షబాబు ఫిలిమ్స్ ” పతాకం పై భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం లో  “షేక్ బాబు సాహెబ్” నిర్మించిన సందేశాత్మక హాస్య రస కుటుంబ కధా చిత్రం ” వధుకట్నం.. ఇలా జరగొచ్చేమో “; రెడీ ఫర్ రిలీజ్ పోస్టర్ ను ప్రముఖ నటి హేమ విడుదల చేశారు . 

 
ప్రస్తుత సమాజం లో మహిళలు ఎన్నో రంగాలలో , పురుషులతో సమానంగా రాణిస్తున్న , ఇంకా మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది . స్కానింగ్ లో ఆడ శిశువు అని తెలుసుకొని కొందరు అబార్షన్స్ చేయించడం వళ్ళ ఆడ పిల్లల నిష్పత్తి తగ్గి పెళ్ళికి మగ పిల్లల కు ఆడ పిల్లలే దొరక్కపోతే  అమ్మాయిలకే “వధుకట్నం “, ఇవ్వాల్సిన రోజులు వస్తాయనే సందేశం తో రూపొందించిన ఈ చిత్ర దర్శక నిర్మాతలను అభినందించిన నటి హేమ , అనంతరం , ఈ చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించి స్త్రీలను రక్షించండి ; గౌరవించండి ; స్త్రీ లపైనున్న వివక్షత ను  రూపుమాపండి – అనే సందేశంతో మీ ముందుకు త్వరలో రాబోతున్న ఈ “వధుకట్నం ” చిత్రాన్ని ఆదరించి , ఈ చిత్ర టీమ్ ను   ఆశీర్వదించండి అని కోరారు . 
 
ఈ చిత్రాన్ని  చూసిన సెన్సార్ సభ్యులు మంచి సందేశాత్మక చిత్రంగా నిర్మించారంటు అభినందించారని , ఈ చిత్రానికి  “యు / ఏ ” సర్టిఫికెట్ ను జారీ చేశారని చిత్ర దర్శకుడు భార్గవ గొట్టిముక్కల చెబుతూ , “సేవ్ ది గర్ల్ చైల్డ్ ” అనే ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందించినట్టు పేర్కొన్నారు. 
నిర్మాత షేక్ బాబు సాహెబ్ , అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా , చక్కటి సందేశాత్మక హాస్య రస కుటుంబ కథా చిత్రంగా నిర్మించామని , ప్రముఖ దర్శకులు కీర్తి శేషులు శ్రీ ఎస్ . డి. లాల్ తనయుడు ఎస్ . డి. జాన్ ఛాయా గ్రహణం ఈ చిత్రానికి ఎంతో ఆకర్షణీయంగా నిలిచిందని , ఆయన శ్రీమతి ప్రముఖ నటి హేమ  మా “వధుకట్నం ” చిత్రం పోస్టర్ ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని ,ఈ చిత్రాన్ని అన్ని భాషల ప్రేక్షకులు థియేటర్లు , ఓ. టీ .టి . ద్వారా తిలకించి ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు . 
 
నటీనటులు : శ్రీహర్ష, ప్రియ , రఘు , కవిత , ఆర్యన్, రేఖ, కుషాల్, అనోన్య, మణి చందన, పూజ, నాగ లక్ష్మి  ఇంజి, చైతన్య, రాకెట్ రాఘవ, రాము(జబర్దస్త్ ఫేమ్ ), కోటేష్ మానవ్ , శ్రీనివాసులు , నిట్టల శ్రీరామ మూర్తి , మల్లాది భాస్కర్ , రవి శంకర్ , మాస్టర్ అనీష్ శుక్ల , మాస్టర్ ధీరజ్ 
 
సాంకేతిక వర్గం : 
డైరెక్టర్ అఫ్ ఫొటోగ్రఫీ : ఎస్ . డ్. జాన్ ;
సంగీతం : ప్రభు ప్రవీణ్ లంక (నాని);
ఎడిటింగ్: సునీల్ మహా రాణ;
పాటలు: శ్రీరామ్ తపస్వి, షేక్ బాబు సాహెబ్ ;
ఆర్ట్: విజయ కృష్ణ ;
కో డైరెక్టర్స్ : రామా రావు శితిరాల, గోలి వెంకటేశ్వర్లు ;
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: షేక్ హమీద్ బాబు (బబ్లు ); 
కథ , నిర్మాత : షేక్ బాబు సాహెబ్ (బాబుషా );
స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం : భార్గవ గొట్టిముక్కల