రంగ‌మ్మ అత్త‌గా అంద‌రికి సుప‌రిచితురాలైన న‌టి అన‌సూయ త్వ‌ర‌లోనే త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. అల‌నాటి తారా సిల్క్‌స్మిత బ‌యోపిక్ లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ చిత్ర‌తానికి సంబంధించిన ప‌నుల్లో భాగంగా అను ఇటీవ‌ల చెన్నై వెళ్లిన‌ట్లు స‌మాచారం. కానీ ఈ వార్త‌ల‌పై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. కానీ ఇటీవ‌ల త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ లో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. న‌టుడు విజ‌య్ సేతుప‌తిని క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని, మ‌రో మంచి క‌థ‌తో జీవితాన్ని కొన‌సాగించ‌నున్నాని, స‌రికొత్త ఆరంభం కోలిహుడ్‌, త‌మిళ‌నాడు అని షేర్ చేశారు.