“మిమ్ములను మరువలేమ” పుస్తకాన్ని ఆవిష్కరించారు !!

“మిమ్ములను మరువలేమ” పుస్తకాన్ని ఆవిష్కరించారు !!

“మిమ్ములను మరువలేమ” పుస్తకాన్ని ఆవిష్కరించారు !!

జనవరి 18న పరమపదించిన ప్రముఖ నిర్మాత-పంపిణీ మరియు ప్రదర్శనదారు-మాజీ శాసన సభ్యులు దొరస్వామిరాజు సంస్మరణ సభ యువ నిర్మాత పి. వి.ఎస్.వర్మ సారధ్యంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయనపై రాసిన “మిమ్ములను మరువలేము” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కె.ఎస్.రామారావు, పోకూరి బాబూరావు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.వి.ప్రసాద్, అశోక్ కుమార్, సత్య రంగయ్య సీతారామరాజు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, రామ్ రావిపల్లి, మామిడిశెట్టి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, భగీరథ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
దొరస్వామి రాజు వ్యక్తిత్వాన్ని సమగ్రంగా ఆవిష్కరించే ఏ.వి (ఆడియో విజువల్) ఈ సందర్భంగా ప్రదర్శించారు.తన తండ్రి చూపిన మార్గం, నడిచిన బాట, నేర్పిన విలువలు తమకు సదా ఆచరణీయమని దొరస్వామిరాజు తనయుడు విజయ్ కుమార్ వర్మ పేర్కొన్నారు!!