మే28న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌వుతున్న న‌ట‌సింహ‌ బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను BB3

మే28న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌వుతున్న న‌ట‌సింహ‌ బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను BB3

‘సింహా’, ‘లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ హ్యాట్రిక్ మూవీ BB3. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా రిలీజ్ చేసిన BB3 First Roar టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని మే28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు  అధికారికంగా ప్ర‌క‌టిస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. టీజ‌ర్‌లో మాస్‌లుక్‌లో అద‌ర‌గొట్టిన న‌ట‌సింహం ఇప్పుడు స్టైలిష్‌లుక్‌లో ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. జేబులో చేయిపెట్టుకుని న‌డిచివ‌స్తున్న బాల‌య్య స్టైలిష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మే 28 విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న‌ నందమూరి తారక రామారావు జ‌యంతి కావ‌డం విశేషం.

చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ – “’సింహా’, ‘లెజెండ్` త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను గార్ల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మ‌రో సూప‌ర్‌ సెన్సేష‌న‌ల్ మూవీ ఇది. మా ద్వార‌కా క్రియేష‌న్స్ బేన‌ర్‌లో అత్యంత ప్రెస్టీజియ‌స్‌గా, భారీ తారాగ‌ణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఫిబ్ర‌వ‌రి సెకండ్ వీక్ నుండి ఫైన‌ల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్త‌వుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే28న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్నాం“ అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌తో పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

 
NataSimha Nandamuri Balakrishna, Boyapati Srinu’s Much Awaited ‘BB3’ Is Releasing Worldwide On May 28th

#BB3 is the hat-trick Film in Natasimha Nandamuri Balakrishna, Mass Director Boyapati Srinu‘s massive blockbuster combination after biggest blockbusters ‘Simha’ and ‘Legend’, Prestigiously Produced by Young Producer Miryala Ravinder Reddy in Dwaraka Creations banner. The teaser, ‘BB3 First Roar’ which was released on the occasion of NBK’s Birthday garners massive response. The film will be released worldwide on May 28th.  Makers unveiled a special poster announcing the release date. NataSimha NBK who rocked with Mass look in teaser is looking Uber cool in a Stylish look as a feast to fans in latest poster.  Balayya’s latest look is further increasing the buzz around the film. May 28th also marks the Birth Anniversary of Vishwa Vikhyatha NataSarwabhouma, Natarathana Nandamuri Taraka Rama Rao Garu.  On this occasion…

Film Producer Miryala Ravinder Reddy said, ” This is another Super Sensational film which is coming in Balakrishna and Boyapati garla combination after Blockbusters ‘Simha’ and ‘Legend’. This film is being made in a prestigious, on a grandeur scale with a huge casting in our Dwarka Creations banner. The final schedule will start from February 2nd week. The entire shooting part will be done with this schedule. Completing all formalities we are releasing the film worldwide on May 28th as a summer special.”  

This Natasimha Balakrishna starrer will have Pragya Jaiswal and huge cast

Cinematography: C.Ramprasad, Music: Thaman S, Dialogues: M Rathnam, Art Director: AS Prakash, Editing: Kotagiri Venkateswara Rao, Thammiraju, Fights: Ram – Lakshman, Presented by Miryala Satyanarayana Reddy,
Producer: Miryala Ravinder Reddy,
Direction: Boyapati Srinu

#BB3 Roar in theatres from May 28th, 2021🔥

#BB3RoarOnMay28th
#NBK106 #BalayyaBoyapati3

#NandamuriBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation