`పీన‌ట్ డైమండ్ ` టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ !!

`పీన‌ట్ డైమండ్ ` టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ !!

 

 

 

                                                     `పీన‌ట్ డైమండ్ ` టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ !!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కొత్త కాన్సెప్ట్స్ తో వ‌చ్చే కొత్త డైర‌క్ట‌ర్స్ హ‌వా కొన‌సాగుతోంది. అలాంటి ఓ విభిన్న‌మైన కొత్త కాన్సెప్ట్ తో కొత్త డైరక్ట‌ర్ `పీన‌ట్ డైమండ్ ` చిత్రంతో ప‌రిచ‌య‌మ‌వుతున్నాడువెంక‌టేష్ త్రిప‌ర్ణ‌. టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో ఆసక్తి రేపిన ద‌ర్శ‌కుడు ఈ రోజు దిల్ రాజు చేతుల మీదుగా విడుద‌ల చేసిన టీజ‌ర్ తో టాలీవుడ్ దృష్టిని మ‌ర‌ల్చుకున్నాడు. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్ కి మంచి వ్యూస్ తో పాటు, పాజిటివ్ కామెంట్స్ తో వ‌స్తున్నాయి.

శుభ‌లేఖ సుధాక‌ర్ వాయిస్ తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగింది. ముఖ్యంగా అభిన‌వ్ స‌ర్దార్ సాలీడ్ ప‌ర్స‌నాలటీతో స్ట‌న్నింగ్ లుక్స్ తో అద‌ర‌గొట్టాడు. అలాగే మ‌రో డిఫ‌రెంట్ పాత్ర‌లో రామ్ కార్తిక్ కూడా ఆక‌ట్టుకున్నాడు. ‌
`ఎంతో జ్ఞానం ఉన్నా కూడా అసుర ల‌క్ష‌ణాలు ఉండ‌టం మూలాన అత‌ని జీవితంలో తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి..ఎవ‌రికైనా విలువైనా వ‌జ్రం దొరికితే దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటారు లేదా దాన్ని వాడుకుంటారు..కానీ అత‌డు మాత్రం అంద‌రిలా ఆలోచించ‌లేదు ఆరోజు అత‌డికి వ‌చ్చిన ఆలోచ‌న ఒక చ‌రిత్ర సృష్టించ‌బోతుందంటూ “ వ‌చ్చే డైలాగ్స్ వింటుంటే నిజంగానే `పీన‌ట్ డైమండ్` సినిమా చ‌రిత్ర సృష్టించ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. రెండు టైమ్ లైన్స్ లో జ‌రిగే ఈ సైన్స్ ఫిక్ష‌న్ డ్రామాతో ద‌ర్శ‌కుడు ఏదో కొత్త విష‌యాన్ని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.
టీజ‌ర్ రిలీజ్ చేసిన దిల్ రాజు సైతం డైలాగ్స్ , డైర‌క్ట‌ర్ షాట్స్, విజువ‌ల్స్ గురించి చెప్పారంటే క‌చ్చితంగా టీజ‌ర్ లో విష‌యం ఉంద‌న్న‌ట్టే. ఇక భీమ్స్ సిసిరోలియో చేసిన నేప‌థ్య సంగీతం, ప్ర‌భాక‌ర్ రెడ్డి విజువ‌ల్స్ , టీజ‌ర్ కు హైలెట్ గా నిలిచాయి. టీజ‌ర్ తో ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ రావ‌డంతో ద‌ర్శ‌కుడి గురించి ఆరా తీయడం ప్రారంభించార‌ట టాలీవుడ్ నిర్మాత‌లు.