Wedding song ‘Dumm Dumm’ from Rajinikanth’s ‘Darbar’ released

రజనీకాంత్ ‘దర్బార్’లో పెళ్లి పాట ‘డుమ్ డుమ్’ విడుదలైంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా ‘దర్బార్‌ ‘. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ ‘దుమ్ము ధూళి’ విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఆ పాటను అనంత శ్రీరామ్ రాయగా… ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. సినిమాలో మరో పాట, పెళ్లి నేపథ్యంలో వచ్చే ఎనర్జిటిక్ సాంగ్ ‘డుమ్ డుమ్’ను కృష్ణకాంత్ రాశారు. ఈరోజు ఆ పాటను విడుదల చేశారు. విడుదలైన కొన్ని క్షణాల లో ఈ పాట వైరల్ అయింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా గేయ రచయిత కృష్ణకాంత్ (కేకే) మాట్లాడుతూ “సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో పాట రాసే అవకాశం నాకు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. నాకు ఇంకా ఇది ఒక కలలా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ గారు సంగీతం అందించిన సూర్య ‘గ్యాంగ్’, నాని ‘జెర్సీ’ సినిమాలలో అన్ని పాటలు రాశాను. అనిరుధ్ గారు నన్ను గుర్తుపెట్టుకుని… ఈ సినిమాలో ఒక పాట రాయమని ఇచ్చారు. చిన్నప్పటి నుండి రజనీకాంత్ గారిని చూస్తూ పెరిగిన నాకు… ఆయన సినిమాలో పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో ఒక యువ జంటకు పెళ్ళయ్యే సందర్భంలో ఈ ‘డుమ్ డుమ్’ పాట వస్తుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉంటారు? అని చిన్న పిలాసఫీతో సాగే గీతం ఇది. రజినీకాంత్ గారి పాటల్లో ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది. తమిళంలో ఈ పాటను వివేక్ గారు రాశారు. ఆ పాటను నాకు పంపించారు. తెలుగులో ఈ పాటను మీరు రాయలని చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు మురుగదాస్ గారు తీసిన ‘గజినీ’, ‘కత్తి’, ‘తుపాకీ’ సినిమాలు నాకు చాలా ఇష్టం. నా అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరు. రజనీకాంత్ గారు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న తమిళ్ సినిమాలో నాకు ఒక పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎనర్జిటిక్ మ్యారేజ్ సాంగ్ ను నకాష్ అజీజ్ పాడారు. రజనీ గారి ఎనర్జీకి ఆ వాయిస్ బాగా సూట్ అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిరుధ్ రవిచంద్రన్, రజనీకాంత్, మురుగదాస్, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి థాంక్స్. పాటను హిట్ చేసినట్టు జనవరి 9న విడుదల అవుతున్న సినిమాను హిట్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో సునీల్ శెట్టి తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఓ: సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి, బి.ఎ.రాజు, స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, కృష్ణకాంత్ (కేకే), సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

Wedding song ‘Dumm Dumm’ from Rajinikanth’s ‘Darbar’ released

‘Darbar’, coming in the direction of ‘Ghajini’ and ‘Thuppaki’ helmer AR Murugadoss, has the legendary Rajinikanth in the lead. Presented by Subaskaran of Lyca Productions, which bankrolls huge movies, this film has the Superstar in the role of a cop named Aditya Arunachalam. To hit the screens as a Sankranthi treat, it will be released by the famous producer NV Prasad in the Telugu States. The film will hit the screens as a Sankranthi special, on January 9.

Already, Rajinikanth’s introduction song, titled ‘Dummu Dhooli’, was out a few days ago, and has been garnering huge numbers of views on YouTube, creating records. Rendered by SP Balasubramaniam, it’s written by Anantha Sriram. And, latest, a wedding song from the movie, titled ‘Dumm Dumm’, is out. Penned by Krishnakanth, this peppy number is sure to become a chartbuster. Within minutes of its release, the Anirudh composition has started going viral on the Internet.

Talking about the song, lyricist Krishnakanth says, “I never imagined that I would get an opportunity to pen a song in a Rajinikanth garu’s movie this early in my career. It’s like a dream. Before this film, I had written songs for Suriya’s ‘Gang’ and Nani’s ‘Jersey’ in Anirudh’s music direction. He made it a point to give me the opportunity to write a song in ‘Darbar’. I am delighted to have got this opportunity, given that I have grown up watching Rajinikanth garu’s movies. The song, ‘Dumm Dumm’, comes against the backdrop of a wedding. It’s somewhat philosophical, talking about how we are before and after marriage. We know that the songs in Superstar’s movies are philosophical. The Tamil version of this song is penned by Vivek garu. Nakash Aziz has rendered the song, and his voice is apt for the hero’s energy. I thank the makers for the opportunity. Coming to director AR Murugadoss garu, I love his ‘Ghajini’, ‘Kathi’, and ‘Thupaki’. He is one of my favourite directors.”

Cast & Crew

With Nayanthara as the hero’s pair, the big-ticket mass entertainer has Nivetha Thomas as Rajinikanth’s daughter.  Bollywood actor Suneil Shetty, Yogi Babu, Thambi Ramaiah, Sriman, Pratheik Babbar, Jatin Sarna, Nawab Shah, Dalip Tahil and others are part of the cast.

PRO: Naidu Surendra Kumar-Phani, B.A. Raju.  Fights: Peter Hein, Ram-Lakshman.  Lyricist: Anantha Sriram, Krishnakanth.  Art Direction: T Santanam.  Editor: Srikar Prasad.  Executive Producer: Sundar Raj.  Cinematography: Santosh Sivan.  Music: Anirudh Ravichandran.  Production House: Lyca Productions.  Written and directed by: AR Murugadoss.  Producer: Subaskaran.