ఆస్కార్ కి ఎంపికైన ‘నాటు నాటు.. సాంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘వెయ్ దరువెయ్’ టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్!

ఆస్కార్ కి ఎంపికైన ‘నాటు నాటు.. సాంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘వెయ్ దరువెయ్’ టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్!

 

ఆస్కార్ కి ఎంపికైన ‘నాటు నాటు.. సాంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘వెయ్ దరువెయ్’ టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్!

 మాస్‌ మహరాజ్‌ రవితేజ నటించిన ‘ధమాక’ చిత్రం సక్సెస్‌లో  మఖ్య కారకులుగా పేరు తెచ్చుకున్న డబుల్‌ ఇంపాక్ట్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌  భీమ్స్‌ సిసిరోలియో. ప్రస్తుతం ఈయన టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ధమాక తర్వాత వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్నారు. భీమ్స్‌ మ్యూజిక్‌ డైరక్షన్‌లో  వస్తోన్న తాజా చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’.  సాయి రామ్‌ శంకర్‌ హీరో. నవీన్‌ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రంలోంచి ‘మై నేమ్‌ ఈజ్‌ మంజుల’ అనే ఐటమ్‌ సాంగ్‌ విడుదలై 5 మిలియన్ల వ్యూస్‌ తో దూసుకుపోతుంది. తాజాగా  ఈ చిత్రంలోంచి ‘వెయ్‌ దరువెయ్‌’ అనే టైటిల్‌ సాంగ్‌ని అక్కినేని నాగ చైతన్య రిలీజ్‌ చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకుని.. ఆస్కార్ కి ఎంపికైన ‘ఆర్ ఆర్ ఆర్ ‘ లో ‘నాటు నాటు.. పాట పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటను తనదైన స్టైల్‌లో మాంచి ఎనర్జీతో  యువతను ఉర్రూతలూగించేలా ఆలపించారు.  ‘బొంబాయి పోతావా రాజా’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేష్‌ గంగుల హీరో క్యారక్టరైజేషన్‌ని చెబుతూనే చిన్న ఫిలాసఫీ టచ్‌తో  యూత్‌కి కనెక్టయ్యేలా ట్రెండీ లిరిక్స్‌ రాశారు. ప్రస్తుతం ఈ పాట 2 .5 మిలియన్‌ వ్యూస్‌  సాధించి…యూట్యూబ్‌ లో హల్‌ చల్‌ చేస్తోంది. భీమ్స్ బీట్, రాహుల్ సిప్లి గంజ్ గళం,  సాయిరాం శంకర్ స్టెప్స్ , కొరియోగ్రఫీ  పాటకు ప్లస్ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ‘వెయ్‌ దరువెయ్‌’ సినిమా పై మంచి క్రేజ్‌ని ఏర్పరిచాయి. దేవరాజ్‌ నిర్మిస్తోన్న  ఈ చిత్రం ఫిబ్రవరి 24న గ్రాండ్‌ గా రిలీజ్‌ కానుంది.