ట్రాప్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్

ట్రాప్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Trap Movie Pre-Release Function

ట్రాప్ మూవీ ట్రైలర్ చూడగానే తెలుగు ప్రేక్షకులనందర్నీ ‘ట్రాప్’ లో పడేస్తుంది అనిపించింది –  ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రసమయి బాలకిషన్.  

 
ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ బ్యానేర్ పై మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ హీరోహీరోయిన్లుగా 
 వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో  రూపొందిన  క్రైమ్ థ్రిల్లర్ ‘ట్రాప్’. ఈ చిత్రం ద్వారా అల్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్నారు.  బ్రహ్మాజీ  ప్రధాన పాత్రలో నటిస్తోన్న  ఈ చిత్రం ప్రీ- రిలీజ్ ఫంక్షన్  ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రేమకవితాలయ బ్యానేర్ లోగో ను తుమ్మలపల్లి  రామ సత్యనారాయణ, ట్రాప్ చిత్ర టైటిల్ లోగోను  నిర్మాత సురేష్ చౌదరి, టీజర్ ను ప్రముఖ రచయిత మోహన్ వడపట్ల విడుదల చేయగా ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయనాయకుడు, టి ఆర్ ఎస్ ఎం.ఎల్.ఏ రసమయి బాలకిషన్ ముఖ్య అతిధిగా హాజరై ట్రాప్ మూవీ ట్రైలర్, ఆడియో బిగ్ సీడీను విడుదల చేశారు. ఈ సందర్భంగా
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ – ” ఈ కార్యక్రమంలో  ప్రతిఒక్కరూ ఇంకొకరిని ట్రాప్ లో పడేశారు.  ట్రైలర్ చూడగానే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులందర్నీ ట్రాప్ లో పడేస్తుంది అనిపించింది. వీరి బేనర్ పేరే ప్రేమ కవితాలయ.. అంటేనే తెలుస్తుంది.  ఒక మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. పురిటి నొప్పులు ఉంటాయని తెలిసినా కూడా ఎలాగైతే ఒక తల్లికి తన బిడ్డ మీద ప్రేమ చావదో.. అలానే సినిమా నిర్మాణంలో  ఎన్నో కష్టాలు ఉంటాయని తెలిసినా ధైర్యంగా  నిర్మాత స్వర్ణలత ముందడుగు వేశారు. ఆమెకు అండగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అలాగే  స్వర్ణలత, మహీంద్రా  గారి మీద ఉన్న అభిమానంతోనే ఈ ఫంక్షన్ కి రావడం జరిగింది తప్ప మరేదికాదు.  వారి నుండి ఇలాంటిమరెన్నో సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది పెద్ద సినిమా ఏది చిన్న సినిమా అనేది కేవలం ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
తుమ్మల పల్లి రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ – ” ఇండస్ట్రీ లోకి  మరో లేడీ ప్రొడ్యూసర్ రావడం చాలా ఆనందం గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమాకు  ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా ఎలాంటి సహకారం  చేయడానికైనా  సిద్ధంగా ఉన్నాం” అన్నారు.
మోహన్ వడపట్ల మాట్లాడుతూ – ” ట్రైలర్ బాగుంది, దర్శకుడిలో మంచి విజన్ ఉంది. అలాగే నిర్మాణ పరంగా కూడా చాలా రిచ్ గా ఉంది. సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది” అన్నారు.
నిర్మాత స్వర్ణలత మాట్లాడుతూ – ” మొదట నిర్మాణ రంగంలోకి రావాలంటే చాలా భయం వేసింది. కానీ హీరో, హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్  ప్రతి ఒక్కరూ మంచి సపోర్ట్ అందిస్తున్నారు. అలాగే మా దర్శకుడు  ఫణింద్ర ఒక సోదరుడిలా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.  త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ కావలి” అన్నారు.
దర్శకుడు వి ఎస్ ఫణింద్ర మాట్లాడుతూ – ” ఈ స్టోరీ చెప్పగానే వెంటనే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న మా సోదరి, నిర్మాత స్వర్ణలత గారికి థాంక్స్. అలాగే మా సినిమాలో  కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాజీ గారికి కృతజ్ఞతలు. ఆయనకు సిందూరం సినిమా ఎలా మంచి పేరు తీసుకువచ్చిందో నాకు ఈ చిత్రం అలా మంచి పేరు తీసుకువస్తుంది అని నమ్ముతున్నాను. మా సినిమాలో మంచి సంగీతం తో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ఈశ్వర్, హర్ష కు ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావలి” అన్నారు.
హీరోయిన్  కాత్యాయనీ శర్మ మాట్లాడుతూ – ” నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మంచి క్యారెక్టర్ తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది” అన్నారు.
 
ఇంకా ఈ కార్యక్రమంలో ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన హర్ష, కొరియోగ్రాఫర్ జో జో, తదితరులు పాల్గొన్నారు.
మహేందర్ ఇప్పలపల్లి, కాత్యాయనీ శర్మ, బ్రహ్మాజీ, షాలు, రచ్చరవి, విట్టల్, పరమేశ్వర శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె, శివ, ఎడిటర్ : రామ్ జెపి రావ్, మ్యూజిక్: ఈశ్వర్ పెరవలి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్ష ప్రవీణ్, కొరియోగ్రాఫర్ : జో జూ,  ప్రొడ్యూసర్ : ఆళ్ల స్వర్ణలత, కథ,దర్శకత్వం : వి ఎస్ ఫణింద్ర.