`త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్`మూవీ ప్రారంభం !!

`త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్`మూవీ ప్రారంభం !!

 మంత్రి  త‌న్నీరు హ‌రీష్ రావు క్లాప్ తో ప్రారంభ‌మైన‌  శ్రీలక్ష్మీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ `త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్`

    `ప్రేమ పిలుస్తోంది` చిత్రంతో ద‌ర్శ‌కుడుగా గుర్తింపు తెచ్చుకున్న అజ‌య్ నాత‌రి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై  శ్రీమ‌తి ల‌క్ష్మీరేసు స‌మ‌ర్పణ‌లో వెంక‌ట్ ఆర్ నిర్మిస్తోన్న చిత్రం `త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్‌`. విక్ర‌మ్, దేవ‌కి ర‌మ్య, హ‌ర్సిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఇటీవ‌ల గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్థికశాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా, మెద‌క్ ఎంపీ  కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. మున్పిప‌ల్ ఛైర్మ‌న్ రాజ‌న‌ర్సు‌, క‌ళాంజ‌లి రాజేష్  పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.
అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు మాట్లాడుతూ…“పూర్తిగా తెలంగాణ యాస‌, భాష‌ల‌తో . తెలంగాణ క‌ళాకారుల‌తో ఈ చిత్రం రూపొందుతోంది . సిద్దిపేట‌లోనే షూటింగ్ మొత్తం జ‌రుపుకోనుంది. టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉంది. నిర్మాత వెంక‌ట్ కు, ద‌ర్శ‌కుడు అజ‌య్ కు ఈ చిత్రం మంచి పేరు తీసుకరావాల‌ని“ అన్నారు.
నిర్మాత వెంక‌ట్ ఆర్ మాట్లాడుతూ…“ప్రేమ పిలుస్తోంది` చిత్రంతో ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న అజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రెండో సినిమాగా ఈ చిత్రాన్ని ప్రారంభించాం. మంత్రి హ‌రీష్ రావుగారు, ఎంపీ కొత్త  ప్ర‌భాక‌ర్ రెడ్డిగారు ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.
 ద‌ర్శ‌కుడు అజ‌య్ నాతరి మాట్లాడుతూ…“ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. దాదాపు రెండు నెల‌ల పాటు సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని సిద్దిపేట ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తి చేస్తాం“ అన్నారు.
 
ఈ చిత్రానికి సంగీతంః ఆనంద్ రాజా;  డిఓపిః ఎస్‌.ప్ర‌సాద్;  కో-డైర‌క్ట‌ర్ః శంక‌ర్‌;  పీఆర్వోః ర‌మేష్ చందు (బాక్సాఫీస్ మీడియా);  నిర్మాతః వెంక‌ట్ ఆర్‌; ర‌చ‌న-ద‌ర్శ‌క‌త్వంః అజ‌య్ నాత‌రి.