సురాపానం హీరోగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే సినిమా అవుతంది: సంపత్‌ కుమార్‌

 సురాపానం హీరోగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే సినిమా అవుతంది: సంపత్‌ కుమార్‌

 సురాపానం హీరోగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే సినిమా అవుతంది: సంపత్‌ కుమార్‌

 మెగాస్టార్‌ చిరంజీవి అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. ఆ అభిమానమే సినిమాలపై ఆసక్తి పెంచింది. మెగాస్టార్‌ ఆదర్శంతో హీరో అవ్వాలని  కలగన్నాడు. నటుడికి కావాల్సిన క్వాలిటీస్‌ పెంచుకుంటూ..సినిమా ప్రయత్నాలు ప్రారంభించాడు..తనకు ఎటువంటి సినీ నేపథ్యం లేకపోడంతో అవకాశాలు అందుకోలేకపోయాడు. అయినా నిరాశ చెందక తన రియల్‌ ఎస్టేట్ మిత్రుడు, సోదర సమానులైన మట్టా మధు యాదవ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో హీరోగా పరిచయం అవుతూ ‘సురాపానం’ అనే చిత్రాన్ని తనే డైరక్ట్‌ చేశాడు. అఖిల్‌ భవ్య క్రియేషన్స్‌ పతాకంపై రూపొందోతన్న ఈ చిత్రం జూన్‌ 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో సంపత్‌ కుమార్‌తో బాక్సాఫీస్‌ ఇంటర్వ్యూ జరిపింది. ఆ విశేషాలు..
  మీ నేపథ్యం?
 మాది వనపర్తి జిల్లా. చిన్న చింత కుంట గ్రామం. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. నా చిన్నతనంలోనే హైదరాబాద్‌ వచ్చేశాం. ఇక్కడే  ఎమ్‌బిఏ కంప్లీట్‌ చేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నాను. మెగాస్టార్‌ చిరంజీవి గారికి వీరాభిమానిని. ఆయన ఇన్‌స్పిరేషన్‌తో హీరో అవ్వాలనుకున్నా. డిగ్రీలోనే ఇండస్ట్రీలోకి వద్దామనుకున్నా..కానీ అప్పుడే మా ఫాదర్‌ ఎక్ప్‌పైర్‌ అవడంతో కుటుంబ బాధ్యతల వల్ల రాలేకపోయా. ఆ తర్వాత ఎమ్‌బిఏ పూర్తి  చేసి కొంతకాలం మెడికల్‌ రిప్రజెంటివ్‌గా చేశాను. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చాను కానీ ఇంకా ఏదో చేయాలన్న తపన మొదలైంది. మళ్లీ సినిమా ఫీల్డ్‌ పైన ఆసక్తి పెరిగింది. ఆ టైమ్‌లో రిషికృష్ణ అనే ఒక ఫ్రెండ్‌ పరిచయం అయ్యాడు. తనతో ట్రావెల్‌ అవుతూ సినిమా ఫీల్డ్‌ గురించి, డైరక్షన్‌ గురించి కొంచెం తెలుసుకోగలిగా. ఈ క్ర‌మంలో “ఇప్పుడు నేను ఆఫీసుల చుట్టూ, దర్శకులు చుట్టూ తిరిగి అవకాశాలు పట్టుకోవడమంటే టైమ్‌ టేకింగ్‌ ప్రాసెస్‌ అని అర్థమైంది. డైరక్షన్‌కి సంబంధించిన మెళకువలు అన్నీ యూట్యూబ్‌లో నేర్చుకున్నా. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో   హీరోగా, డైరక్టర్‌గా ‘కిర్రాక్‌ పోరడు’ అనే షార్ట్‌ ఫిలిం చేశాను. దానికి మంచి పేరుచ్చింది. నా  ప్యాషన్‌ గమినించిన  మధు అన్న నువ్వే హీరోగా, డైరక్టర్‌గా సినిమా స్టార్ట్‌ చేయి నేను సపోర్ట్‌ చేస్తా అనడంతో సురాపానం ప్రారంభించాం.

 


 ‘సురాపానం’ స్టోరికి ఇన్‌స్పిరేషన్‌ ఏమైనా ఉందా?
అలా ఏం లేదు..ఇదొక ఫాంటసీ థ్రిల్లర్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌. హీరో చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఫేస్‌ చేశాడు అనేది కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారక్టర్‌లో ఆల్‌ ఎమోషన్స్‌ ఉంటాయి. ఈ సినిమాతో నటుడుగా నన్ను ప్రూవ్‌ చేసుకుంటానన్న నమ్మకం ఉంది.
 మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పండి?
ఇందులో మెయిన్‌ విలన్‌గా అజయ్‌ ఘోష్‌ నటించారు. అలాగే ఫిష్‌ వెంకట్‌ చేసే కామెడీ ఏ సినిమాలో చూసుండరు. సీనియర్‌ నటుడు సూర్య గారిది కూడా ఇంపార్టెంట్‌ రోల్‌. హీరో ఫ్రెండ్స్‌గా చేసిన చమ్మక్‌ చంద్ర, మీసాల లక్ష్మణ్‌ చేసే కామెడీ హైలెట్‌గా ఉంటుంది. అలాగే హీరోయిన్‌కు నాకు మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది.

 

టెక్నీషియన్స్‌ సపోర్ట్‌ ఎలా ఉంది?
  నాకు వండ్రఫుల్‌ టెక్నికల్‌ టీమ్‌ దొరికింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో గురించి చెప్పుకోవాలి. మూడు అద్భుతమైన పాటలిచ్చారు. ఇప్పటికే ఆదిత్య ద్వారా విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సురేష్ గంగుల‌, అల‌రాజు, దేవ్ ప‌వార్ మంచి సాహిత్యాన్ని అందించారు. అలాగే విజయ్‌ ఠాగూర్ సినిమాటోగ్రఫీ, జెపి ఎడిటింగ్‌, రాజేంద్రప్రసాద్‌ చిరుత మాటలు, సురేష్‌ కనకం కొరియోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణలు, కో`డైరక్టర్‌ శ్రీనివాస్‌ రాయి, డైరక్షన్‌ టీమ్‌ విద్యాసాగర్‌, బండ రమేష్‌ కాంట్రిబ్యూషన్‌ మరువలేనిది. ఇక ఈ సినిమా జర్నీలో నేను థ్యాంక్స్‌ చెప్పుకోవాల్సింది మా అమ్మగారికి, నా కుటుంబ స‌భ్యుల‌కు  అలాగే ఈ సినిమా నిర్మాత మధు అన్నకు.
 ‘సురాపానం’ రిలీజ్‌ ఎప్పుడు?
 ఇటీవల సెన్సార్‌ పూర్తైంది. యుబైఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పాటు సెన్సార్‌ సభ్యులు మంచి కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. మా సినిమా పాటలు, టీజర్‌ సినిమా పట్ల మంచి క్రేజ్‌ని ఏర్పరచడంతో బిజినెస్‌ పరంగా కూడా రెస్పాన్స్‌ బావుంది. జూన్‌ 10న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం.

 


 నిర్మాత ప్రోత్సాహం ఎలా ఉంది?
 ఈ సినిమా మొదలైంది అంటే కేవలం మా నిర్మాత మధు అన్నే కారణం. నా మీద నమ్మకంతో డైరక్టర్‌గా, హీరోగా చేసే అవకాశం ఇచ్చారు. కచ్చితంగా ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సినిమా వచ్చింది. ఇలాగే మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాలు  చేయాలన్న ఆలోచనలో ఉన్నాం.
 హీరోగా మీ యాంబీషన్‌, మీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌?
 కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ నటుడుగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలన్నదే నా యాంబిషన్‌. హీరోగా ఇంకా నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నా. హీరోగా రెండు మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్‌ కాగానే ఆ వివరాలు వెల్లడిస్తా అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు యంగ్ హీరో సంప‌త్ కుమార్‌.