శ్రీరంగాపురం మూవీ  రివ్యూ!

శ్రీరంగాపురం మూవీ  రివ్యూ!

                             
                        శ్రీరంగాపురం మూవీ  రివ్యూ!
  వినాయక్ దేశాయ్, పాయెల్ ముఖర్జీ జంట‌గా న‌టించిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రం `శ్రీరంగాపురం`. చింద‌నూరు నాగరాజు నిర్మాత‌, ఎమె ఎస్ వాసు ద‌ర్శ‌కుడు.  ఇటీవ‌ల టీజ‌ర్, ట్రైల‌ర్, పాట‌ల‌తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లైంది.  మ‌రి థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…
 క‌థ‌లోకి వెళితే…
 శ్రీరంగాపురం అనే ఒక  గ్రామంలో పెద్దరెడ్డి (చిందనూరు నాగరాజు) అనే ఒక పెద్దాయ‌న ఉంటాడు. ఆయ‌న‌కు మ‌హాల‌క్ష్మి అనే ఒక ముద్దుల మేన‌ కోడలు ఉంటుంది. మేన కోడ‌లే ప్రాణంగా బ‌తికే ఆ  పెద్దాయ‌న జీవితంలో ఎలాంటి మ‌లుపులు తిరిగాయి. చివ‌రికి ఆయ‌న ఆమె ప్రేమ కోసం ఎలాంటి త్యాగం చేశాడు అనేది మిగ‌తా స్టోరి.
 న‌టీన‌టుల హావ‌భావాలుః
 ప‌ల్లెటూరి కుర్రాడిగా హీరో వినాయ‌క్ దేశాయ్ అద్భుతంగా న‌టించాడు.  పెద్దారెడ్డి ముద్దుల కోడ‌లుగా పాయ‌ల్ ముఖర్జీ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించింది. ఆమె అందం, అభిన‌యం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.  ఇక ఈ చిత్రానికే హైలెట్ అయిన పెద్దా రెడ్డి పాత్ర‌లో నిర్మాత చింద‌నూరు నాగ‌రాజు ప‌ర్ఫార్మెన్స్ ఒక సీనియ‌ర్ న‌టుడు త‌ర‌హాలో ఉంది. విల‌న్స్ గా న‌టించిన సత్య‌ప్ర‌కాష్‌, రోబో గ‌ణేష్ ఇద్ద‌రూ వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.  మిగతా పాత్రలలో చిత్రం శ్రీను, జబర్దస్త్  రాజమౌళి, శ్రావణ సంధ్య, వైష్ణవి సింగ్, గీతా సింగ్, దుర్గారావు , స్వాతినాయుడు కామెడీతో ఆకట్టుకున్నారు.
       టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ః
  ద‌ర్శ‌కుడు మేన‌మామ‌, మేన‌కోడ‌లు మ‌ధ్య అటాచ్ మెంట్ ఎలా ఉంటుందో తీసుకుని దానికి చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్స్, ల‌వ్ సీన్స్ , కామెడీ స‌న్నివేశాలు జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో క్లాస్ తో పాటు మాస్ ఆడియ‌న్స్ ని మెప్పించే చక్క‌టి స‌న్నివేశాలు పొందుప‌రిచారు. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగ చూపించారు. అలాగే హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ని బాగా క్యాప్చర్ చేశారు. పాటలు బాగున్నాయి ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఎడిటింగ్ ప‌ర్వాలేదు. నిర్మాత క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఖ‌ర్చు పెట్టాడు.
 ఫైన‌ల్ గా చెప్పాలంటేః
 ఈ టెక్నాల‌జీ యుగంలో బంధాలు, బంధుత్వాలు , ప్రేమానురాగాలు అంటే తెలియ‌కుండా పిల్ల‌లు పెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఒక చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా మేన‌మామ‌, మేన‌కోడ‌లు మ‌ధ్య ఉండే బాండింగ్ ని క‌థాంశంగా తీసుకుని ఒక అద్భుత‌మైన సందేశాన్ని స‌మాజానికి ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇలాంటి చిత్రాలు ప్ర‌తి ఒక్క త‌ల్లిదండ్రీ త‌మ పిల్ల‌ల‌కు చూపించాలి. అప్పుడే మ‌న తెలుగు సంస్కృతి గొప్ప‌త‌నం ఏంటో తెలుస్తుంది. అక్క‌డ‌క్క‌డా ల్యాగ్ త‌ప్ప సినిమా అంతా ఎక్క‌డా బోర్ లేకుండా సాగింది.
రేటింగ్ః 3/5