`స్పార్క్ 1.0` మూవీ రివ్యూ!!

`స్పార్క్ 1.0` మూవీ రివ్యూ!!

 `స్పార్క్ 1.0` మూవీ రివ్యూ!!

న‌టీన‌టులుః ప్రీతి సుంద‌ర్‌, భ‌వ్య‌శ్రీ, హితేంద్ర‌, రాము,
డీఓపిః గోపి ( అమితాబ్‌)
ఎడిట‌ర్ః అనీల్ కుమార్
నిర్మాతః వి.హితేంద్ర (మున్న‌)
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైర‌క్ష‌న్ః సురేష్ మాపూర్‌
విడుద‌ల తేదీః అక్టోబ‌ర్ 21
రేటింగ్ః 3.25/5

ఇటీవ‌ల కాలంలో కొత్త కాన్సెప్ట్ తో వ‌స్తోన్న చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఆ కోవ‌లో మ‌రో చిత్రం `స్పార్క్ 1.0` చిత్రం ఈ నెల 5న విడుద‌లైంది. పోస్ట‌ర్స్, టీజ‌ర్ , ట్రైల‌ర్స్ ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఒక క్యూరియాసిటీని పెంచింది. మ‌రి థియేట‌ర్స్ లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం….

స్టోరి విష‌యానికొస్తే..
ఒక సైకో డాక్ట‌ర్ కొంత మంది న‌ర్స్ ల‌ను రేప్ చేసి అత్యంత క్రూరంగా మ‌ర్డ‌ర్ చేస్తుంటాడు. ఈ కేస్ ని ఇన్వెస్ట్ గేష‌న్ చేసే క్ర‌మంలో పోలీస్ ఆఫీస‌ర్ ఝాన్సీ ఒక మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకుంటుంది. ఈ క్ర‌మంలో మ‌రో పోలీస్ ఆఫీస‌ర్ ఝాన్సీ ని అరెస్ట్ చేసి ఇన్వెస్ట్ గేష‌న్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్ గేష‌న్ ఏం బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో ఝాన్సీ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది. భ‌వ్య ఈ కేస్ ని ఎలా సాల్వ్ చేసింది? అస‌లు మ‌ర్డ‌ర్ దొరికాడా? అస‌లు మ‌ర్డ‌ర్స్ చేస్తుంది ఎవ‌రు? అన్న‌ది మిగ‌తా క‌థాంశం.

సినిమా ప్ల‌స్ పాయింట్స్ః
ప్రీతి సుంద‌ర్ త‌న కెరీర్ మొత్తంలో చేసిన ఛాలెంజింగ్ రోల్ అని చెప్ప‌వ‌చ్చు. త‌న చేసిన ఇంటెన్స్ ప‌ర్ఫార్మెన్స్ సినిమాకు చాలా ప్ల‌స్ అయింది. మేకోవ‌ర్ ప‌రంగా కూడా మంచి మార్కులు ప‌డ్డాయి. అలాగే భ‌వ్య‌శ్రీ కూడా త‌న డిఫ‌రెంట్ మేన‌రిజ‌మ్స్ తో, త‌న ఫిజిక్ తో సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ప్ర‌తి స‌న్నివేశంలో మెచ్చూర్డ్ ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచింది అన‌డంలో సందేహం లేదు. అదే విధంగా అభిన‌యంతో పాటు త‌మ అంద‌చందాల‌తో ఆక‌ట్టుకున్నారు. వీరితో పాటు హితేంద్ర‌, రాము, సురేష్ పాత్ర‌లు సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచాయి. సినిమా పాయింట్ తో ప్రేక్ష‌కులు స‌రికొత్త అనుభూతి చెందుతారు. ముఖ్యంగా ఇంట్రవెల్ బ్లాక్ , ట్విస్ట్స్ తో సినిమా నెక్ట్స్ లెవ‌ల్ కు వెళ్లింది. క్లైమాక్స్ లో వ‌చ్చే వియ‌ఫ్ ఎక్స్ సినిమాకు హైలెట్. అలాగే ద‌ర్శకుడు సినిమాను త‌న స్క్రీన్ ప్లే తో, టేకింగ్ తో సినిమాను ప‌రుగులు పెట్టిస్తూ ఆడియ‌న్స్ ని థ్రిల్ కి గురి చేశాడు. నిర్మాత ఎంత ఖ‌ర్చుపెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టారు. కెమెరా వ‌ర్క్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మ్యూజిక్ సినిమాను ఎలివేట్ చేసే విధంగా ఉంది.

మైన‌స్ పాయింట్స్ః
అక్క‌డ‌క్క‌డా కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అనిపించినా, కానీ దాన్ని అధిగ‌మించేలా త‌దుప‌రి స‌న్నివేశాన్ని ప్లాన్ చేశాడు ద‌ర్శ‌కుడు. కొన్ని ఇన్విస్టిగేష‌న్ స‌న్నివేశాలు రొటీన్ గా అనిపించినా …ఆర్టిస్ట్ ల ద‌గ్గ‌ర నుంచి అద్బుత‌మైన పర్పార్మెన్స్ తీసుకోవ‌డంతా… ఆ ఫీలింగ్ ఎక్క‌డా అనిపించ‌దు.

ఫైన‌ల్ గా చెప్పాలంటేః
ఒక అద్బుత‌మైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రం స్పార్ట్ 1.0 అని చెప్ప‌వ‌చ్చు. అనేక మలుపుల‌తో, అడుగడుగునా థ్రిల్ కి గురి చేసే చిత్ర‌మిది. క‌థ‌లో స‌స్పెన్స్, యాక్ష‌న్ ఎలిమెంట్స్ మెప్పిస్తాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు న‌చ్చే చిత్రమిది. సో డోంట్ మిస్ దిస్ మూవీ. గో అండ్ వాచ్ ఇన్ థియేట‌ర్స్.