`బాల మిత్ర` రివ్యూ-3.25/5

`బాల మిత్ర` రివ్యూ-3.25/5

 

 

 

 

`బాల మిత్ర` రివ్యూ!!

ఆర్టిస్ట్స్ః
రంగ‌, శ‌శిక‌ళ‌, కియారెడ్డి, అనూష‌, ద‌యానంద‌రెడ్డి మీసాల ల‌క్ష్మణ్‌
టెక్నీషియ‌న్స్ః
మ్యూజిక్ః జ‌య‌వ‌ర్థ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీః ర‌జిని
నిర్మాత‌లుః శైలేష్ తివారి, బొద్దుల ల‌క్ష్మ‌ణ్‌
ద‌ర్శ‌కత్వంః శైలేష్ తివారి
రిలీజ్ డేట్‌: 2021, ఫిబ్రవరి 26
రేటింగ్ః 3.25/5

కొత్త నీరు, కొత్త తీరుని ఎప్పుడూ సినిమా ఇండ‌స్ట్రీ అక్కున చేర్చుకుంటుంది. సాఫ్ట్ వేర్ రంగంలో మంచి హోదాలో ఉన్న శైలేష్ అన్నీ అంత మంచి జాబ్ ని వ‌దులుకుని సినిమా రంగంలోకి వ‌చ్చారంటే త‌న‌లో సినిమాల‌పై ఎంత ప్యాష‌న్ ఉందో అర్థ‌మ‌వుతోంది. ఫ‌స్ట్ సినిమాతోనే ఒక బెస్ట్ డైర‌క్ట‌ర్ గా పేరు తెచ్చుకుంటాను అని ఇంట‌ర్వ్యూ ల్లో చెప్పిన త‌న కాన్ఫిడెన్స్ చూస్తే క చ్చితంగా కొడ‌తాడు అనిపించింది. మ‌రి ఈ రోజు రిలీజైన ఈ స‌స్పెన్స్ చిత్రం `బాల‌మిత్ర‌` స‌మీక్ష తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

క‌థః
మెడిక‌ల్ స్టూడెంట్ అయిన రంగా (అర్జున్) , అదే కాలేజ్ లో చ‌దివే దీక్ష ( కియారెడ్డి) ని ఎంతో ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ ఆ అమ్మాయి ముందు ఒప్పుకోదు.. త‌ర్వాత‌ర్వాత త‌న సిన్సియారిటీ న‌చ్చి ల‌వ్ చేస్తుంది. ఇంత‌లో దీక్ష కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప‌ర్స్ రంగ‌కు పోన్ చేసి నీ ల‌వ‌ర్ నీకు ద‌క్కాలంటే మేము చెప్పిన ప‌ని చేయాలంటూ బెదిరిస్తారు. అస‌లు దీక్ష‌ను కిడ్నాప్ చేసింది ఎవ‌రు? ఏమ‌ని బెదిర‌స్తారు? వాళ్లు చెప్పిన ప‌ని హీరో చేశాడా? తన ల‌వ‌ర్ ని హీరో ఎలా ద‌క్కించుకున్నాడు అన్న‌ది సినిమా.

సినిమా హైలెట్స్ః
అర్జున్ మెడిక‌ల్ స్టూడెంట్ గా, ల‌వర్ బాయ్ గా అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచాడు. పాట‌లు, ఫైట్స్ లో చాలా ఈజ్ క‌న‌బ‌రిచాడు. ఇక హ‌త్య‌ల‌కు కార‌ణం ఏమిటో అనే స‌స్పెన్స్ చేధించే స‌న్నివేశాల్లో ఎంతో మెచ్యూరిటీ క‌నిపించింది. బాల త్రిపుర సుంద‌రి పాత్ర ఎంతో క్యూట్ గా ఉంటూనే ఒక సామాజిక బాధ్య‌త‌గ‌ల పాత్ర‌లో ఆక‌ట్టుకుంది. చిత్రానికి మెయిన్‌ ట్విస్ట్ ఇచ్చే వైశాలి పాత్ర చిత్రీకరణ చాలా బాగుంది. అలాగే వైశాలిగా చేసిన అమ్మాయి పల్లెటూరి అమ్మాయిగా, పగబట్టిన నారిగా రెండు పాత్రలను అద్భుతంగా పోషించింది. తండ్రి పాత్ర‌లో చేసిన ద‌యానంద రెడ్డి పాత్ర కూడా బావుంది.
ఈ సినిమాకి సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా రెండు పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో సంగీత దర్శకుడు మెప్పించాడు. వెళ్లిపోమాకే, తండ్రీ కూతుళ్ల బంధం తెలిపే సాంగ్‌ బాగున్నాయి. ప్రొడ్యూస‌ర్ ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఇక డైర‌క్ట‌ర్ కి ఇది తొలి సినిమా అయినా ఎక్క‌డా ఆ భావ‌న లేకుండా ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో ఆస‌క్తిక‌రంగా చిత్రీక‌రించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వ‌చ్చే ట్టిస్ట్ లు, క్లైమాక్స్ హైలెట్ సినిమాకు.

సినిమాకు మైన‌స్ః
ఎడిటింగ్, ఆర్ట్ వ‌ర్క్ సినిమాకు ఓకే అనిపిస్తాయి. ఫ‌స్టాప్ లో అక్క‌డ‌క్క‌డా కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్.

అనాల‌సిస్ః
డైర‌క్ట‌ర్ త‌ను చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దీనికి సస్పెన్స్‌ జోడించి థ్రిల్లర్‌గా మార్చాడు. ఫస్టాఫ్‌ అంతా హీరో, హీరోయిన్‌ల ప్రేమని హైలెట్‌ చేసి, సెకండాఫ్‌లో మెయిన్‌ కథని నడిపించాడు. ఎందుకు చంపుతున్నాడో తెలియని హీరోకి.. ఆ కారణం తెలియజేసే ట్విస్ట్‌ బాగుంది. అలాగే ‘అతడు’ తరహాలో హత్యలు చేసిన హీరో కొన్ని రోజులు కనిపించకుండా ఉండడానికి ఆ హత్యలకు కారణమైన ఫ్యామిలీ ఇంటిలోనే బస చేయడం కూడా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతీ పాత్రకి, ఆఖరి చిన్న బుడతడి పాత్రతో కూడా దర్శకుడు కామెడీ చేయించాడు. మనిషికి ఆశయమే కాదు.. దానికి తగిన ఆలోచన కూడా ఉండాలని, అది ఉన్నతంగా ఉండాలని దర్శకుడు చెప్పిన తీరు.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్టాఫ్‌ ఇదేం సినిమా అనుకున్న ప్రేక్షకుడు కూడా.. సెకండాప్‌కి వచ్చేసరికి తృప్తిగా బయటికి వస్తాడు. కొత్త క‌థ‌ల‌ను ఇష్ట‌ప‌డే ప్ర‌తి ఒక్క‌రికీ క‌చ్చితంగా న‌చ్చే సినిమా బాల‌మిత్ర.

ఒక్క‌మాట‌లో చెప్పాలంటేః `బాల‌మిత్ర` ప‌గ ప్ర‌తీకారాల‌తో కాదు మంచి ఆశ‌యాల‌తో పెర‌గాలి అని చెప్పే చిత్రం!!