ఇళ‌య‌రాజా మ్యూజిక‌ల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’లో సింగర్‌గా, న‌టుడిగా మెప్పించనున్న షాన్

ఇళ‌య‌రాజా మ్యూజిక‌ల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’లో సింగర్‌గా, న‌టుడిగా మెప్పించనున్న షాన్

ఇళ‌య‌రాజా మ్యూజిక‌ల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’లో సింగర్‌గా, న‌టుడిగా మెప్పించనున్న షాన్
 
వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ  ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సింగర్ షాన్ ఇప్పుడు పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాష‌ల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్‌’ కోసం న‌టుడిగా మారారు. మాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  త‌న విల‌క్ష‌ణ గాత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సింగర్ షాన్ ‘మ్యూజిక్ స్కూల్’ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను కూడా ఆక‌ట్టుకున్నారు. అయితే గాత్రంతోనే కాదు బాడీ లాంగ్వేజ్‌తోనూ. ఇళ‌య‌రాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగ‌ర్‌ను చూసి, పాత్ర‌కు స‌రిపోతాడ‌ని భావించి త‌మ‌ సినిమాలో న‌టించాల‌ని చిత్ర‌ ద‌ర్శ‌క నిర్మాత‌లు కోరారు. శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో శ్రియ మాజీ ప్రేమికుడుగా షాన్ క‌నిపించ‌బోతున్నారు. షాన్ ఈ సినిమాలో న‌టించ‌డంతో పాటు సినిమాలో పాట పాడ‌టం విశేషం. సృజ‌నాత్మ‌క‌మైన క‌ళ‌ల‌లో రెండు ర‌కాలైన పాత్ర‌ల‌ను పోషించ‌డానికి, వ‌ద్ద‌ని చెప్ప‌లేక‌పోయాన‌ని షాన్ అన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ‘‘ఇళ‌యరాజాగారి స్టూడియోలో షాన్ పాట పాడుతున్న‌ప్పుడు త‌న‌లోని  విల‌క్ష‌ణ‌త  నాకు న‌చ్చింది. అలాంటి ఓ పాత్ర నా సినిమాకు అవ‌స‌రం అని భావించాను. సాధార‌ణంగా సింగ‌ర్స్ ఎవ‌రూ అదే సినిమాలో న‌టించ‌లేద‌ని నేను భావిస్తున్నాను. ఇది షాన్‌కు కొత్త అనుభ‌వాన్ని ఇస్తుంది. అందుక‌నే న‌టుడిగా త‌న‌కు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చాను. సింగ‌ర్‌గా కొన్నేళ్ల నుంచి షాన్ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే  ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రంతో తను నటుడిగానూ మెప్పించబోతున్నారు. షాన్  పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను ఎగ్జ‌యిట్‌మెంట్ చేసే అంశాలెన్నో ఉన్నాయి. మిమ్మ‌ల్ని థియేట‌ర్స్‌లో క‌ల‌వ‌డానికి ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. 
 
షాన్ మాట్లాడుతూ ‘‘‘మ్యూజిక్ స్కూల్’లో భాగం కావడం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో పాట పాడ‌ట‌మే కాదు, న‌టుడిగా క‌నిపిస్తాను. న‌టించ‌డం నాకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. మాస్ట్రో ఇళ‌య‌రాజాగారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌టం గొప్ప విష‌యం. సృజ‌నాత్మ‌క క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని చెప్పే సినిమా ఇది. మ్యూజిక్‌లో చాలా వేరియేష‌న్స్‌ను చూపించే ఈ సినిమాలో..క‌ళ‌లు, ఆట‌లు కూడా పిల్లల జీవితంలో ముఖ్య‌మ‌ని చెబుతారు. సినిమాలోని ప్ర‌ధానాంశం నాకు వ్య‌క్తిగ‌తంగా ఎంత‌గానో న‌చ్చింది. ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తో సినిమాను చేస్తున్న పాపారావుగారికి థాంక్స్‌. అలాగే ఈ సినిమాలో పాట పాడ‌టంతో పాటు న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇది నాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది ’’ అన్నారు. 
 
 
యామిని ఫిలింస్ నిర్మించ‌నున్న ‘మ్యూజిక్ స్కూల్‌’  సినిమా తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతుంది.  ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫ‌ర్ ఆడ‌మ్ ముర్రే కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్‌, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, విన‌య్ వ‌ర్మ‌, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో 12 పాటలుంటాయి. పిల్ల‌ల‌కు క‌ళ‌లు, ఆట‌ల ప్రాధాన్య‌త‌ను తెలియ‌నీయ‌కుండా కేవ‌లం వారిని ఇంజనీర్లు, డాక్ట‌ర్స్‌గా చూస్తూ  మూస పద్ధతిలో ఉంటూ ఎలాంటి క్రియేటివిటీలేని నేటి విద్యావ్య‌వ‌స్థ‌లో పిల్ల‌లు తెలియ‌ని ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని చెప్ప‌డ‌మే ఈ సినిమా ప్ర‌ధానాంశం.
 
Shaan roped in as actor-singer for the Ilaiyaraaja musical ‘Music School’ 
 
Renowned for his euphonious voice, singer Shaan has stepped aboard for Papa Rao’s Biyyala’s Hindi directorial debut, Music School, a musical by Ilaiyaraaja in the capacity of an actor. The director-writer was thoroughly impressed by the singer’s flamboyance as the latter sang in Ilaiyaraaja’s studio after which he was offered a part in the upcoming musical. Starring Sharman Joshi and Shriya Saran, the forthcoming musical shall witness Shaan in the role of Saran’s ex-boyfriend. What’s more is that apart from acting, he will also be singing a song that shall feature him. The actor-singer remarks that he couldn’t resist saying yes to the musical given that it encourages creative arts. 
 
Filmmaker Papa Rao Biyyala says, “The minute I saw Shaan sing at Ilaiyaraaja’s studio, I knew that the presence of no other singer would fit the bill in the movie. I welcome him on board. As a singer he has regaled listeners for many years, with Music School he will be seen charming the audience through acting and singing. The musical has a lot of exciting things in store for the audience and we can’t wait to meet them in theatres.” 
 
Sharing his joy on stepping aboard the musical, Shaan says, “I’m happy to have stepped aboard a musical by none other than legendary maestro Ilaiyaraaja. It’s a film that highlights the difference an upbringing in music, arts and sports can make to a pupil’s life. The theme of the film felt personal to me and I thank Papa Rao sir for conceptualizing this film. I’m thrilled to be acting and singing for it.” 
 
Produced by Yamini Films and written and directed by Papa Rao Biyyala, ‘Music School’, a one-of-a-kind bilingual (Hindi and Telugu) musical by Ilaiyaraaja, to be choreographed by Broadway Choreographer Adam Murray, with cinematography by Kiran Deohans and starring Sharman Joshi, Shriya Saran, Suhasini Mulay, Benjamin Gilani, Prakash Raj, Telugu comedian Brahmanandam, Vinay Varma, Mona Ambegaonkar, Gracy Goswamy and Ozu Barua. It’s a 12-song musical about the pressure of the unimaginative education system on children to mug equations and aim only to become doctors or engineers, leaving no time for arts or sports.