స్టార్ హీరోయిన్ స‌మంత రిలీజ్ చేసిన `సీటీమార్` టైటిల్ సాంగ్‌ !!

స్టార్ హీరోయిన్ స‌మంత రిలీజ్ చేసిన `సీటీమార్` టైటిల్ సాంగ్‌ !!

స్టార్ హీరోయిన్ స‌మంత రిలీజ్ చేసిన సీటీమార్ టైటిల్ సాంగ్‌ కి సుపర్బ్ రెస్పాన్స్

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కి మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్‌ల‌తో రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా  `సీటీమార్` టైటిల్ సాంగ్‌ని స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని  రిలీజ్ చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

`గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి ప్రొద్దు తిరుగుడు పువ్వా..మా పాపి కొండ‌ల న‌డుల రెండు జెళ్లేసిన చంద‌మామ నువ్వా..
మ‌లుపు మ‌లుపులోన గ‌ల‌గ‌ల‌పారేటి గోదారి నీ న‌వ్వా..నీ పిలువు వింటే చాలు ప‌చ్చాపచ్చాని చేలు ఆడెనే సిరిమువ్వా.
సీటీమార్..సీటీమార్..సీటీమార్..
కొట్టు కొట్టూ ఈలే కొట్టు..ప్ర‌పంచ‌మే వినేటట్టు..దించితేనే అడుగులు ఈ నేల గుండెపై ఎదుగుతావు చిగురులా
ఎత్తితేనే నీ త‌ల ఆకాశమందుతూ ఎగురుతావు జెండ‌లా..గెలుపే న‌డిపే బ‌ల‌మే గెలుపే క‌బ‌డ్డి క‌బ‌డ్డి క‌బడ్డి..సీటీమార్..సీటీమార్.. సీటీమార్‌`
అంటూ ఫుల్ ఎన‌ర్జిటిక్‌, ఇన్స్‌పైరింగ్‌గా సాగే ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యం అందించ‌గా మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, రేవంత్‌, వ‌రం అంతే ఎనర్జీతో ఆల‌పించారు. ఈ టైటిల్‌సాంగ్‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్నారు.

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.

 
Superb Response For ‘Seetimaarr’ Title Song Unveiled By Star Heroine Samantha

Aggressive Star Gopichand, Mass Director Sampath Nandi’s latest is ‘Seetimaarr’, a sports based Actioner with a backdrop of mass game Kabaddi. ‘Seetimaarr is the highest budgeted film in Gopichand’s career made with high technical values. Presented by Pavan Kumar and Produced by Srinivasaa Chhitturi under the Srinivasaa Silver Screen banner. Melody Brahma Mani Sharma is composing music for this film. Tamannaah is the heroine while Bhumika is playing a pivotal role. Powerpacked Trailer of ‘Seetimaarr’ which was released recently received a rave response. Star Heroine Samantha Akkineni released ‘Seetimaarr Title Song’ and wished all the best to the entire team.

The song goes with lyrics,

‘Gelupu sooreedu chutuu tirigeti proddu tirugudu puvvaa… MAA paapikondala naduma rendu jellesina chandamama nuvvaa..
Malupu malupu lona gala gala paareti godaari nee navvaa.. nee pilupu vinte chaalu pachha pachhani chelu aadenu sirimuvva..
Seetimaarr… Seetimaarr… Seetimaarr
Kottu kottu eele kottu… Prapanchame vinetattu..Dinchitene adugulu ee nela gunde pai edugutaavu chigurulaa.. gelupe nadipe balame gelupe
Kabaddi…Kabaddi…Kabaddi
Seetimaarr…Seetimaarr…Seetimaarr’

The song is filled with full-on energy and inspiring lyrics penned by Kasarla Shyam. Melody Brahma Mani Sharma composed a catchy tune for this song. Anurag Kulkarni, Revanth, Varam crooned energetically. This title song is already getting very good response in social media. ‘Seetimaar’ is releasing worldwide on April 2nd.

Gopichand, Tamannaah, Bhumika, Digangana Suryavanshi, Posani Krishna Murali, Rao Ramesh, Bhumika, Rehaman, Bollywood actor Tarun Arora are principal cast while Apsara Rani is doing a special song.

Chief Technicians of this movie are
DOP: S. Soundar Rajan
Music Director: Mani Sharma
Editor: Thammiraju
Art Director: Satyanarayana D.Y.
Presented by: Pavan Kumar
Producer: Srinivasaa Chhitturi
The story, Screenplay, Dialogues, and Direction: Sampath Nandi