`సంహారి` మూవీ మోష‌న్ పోస్ఠ‌ర్ లాంచ్ !!

`సంహారి` మూవీ మోష‌న్ పోస్ఠ‌ర్ లాంచ్ !!

       `సంహారి` మూవీ మోష‌న్ పోస్ఠ‌ర్ లాంచ్ !!

శ్రీ తుల్జా భవాని గ్రూప్స్ మూవీ మేకర్స్ పతాకం పై రవి కుమార్ రాణా మరియు నేహా శ్రీ హీరో హీరోయిన్ గా లక్ష్మి కేతావత్ మరియు రేణుక కేతావత్ సమర్పణ లో రవి కుమార్ రాణా స్వయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం “సంహారి”. ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని దర్శకుడు ఎన్ శంకర్ విడుదల చేయగా మోషన్ పోస్టర్ ను జనాదరణ పొందిన దర్శకుడు సాగర్ విడుదల చేసారు. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని విడుదల కు సిద్ధం గా ఉంది. ఈ సందర్భంగా

జనాదరణ పొందిన దర్శకుడు సాగర్ మాట్లాడుతూ “సంహారి కథ చాలా కొత్తగా ఉంది. నటుడు దర్శకుడు మరియు నిర్మాత రవి కుమార్ రాణా ఈ చిత్రాన్ని చాలా కష్టపడి నిర్మించారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను” అని తెలియజేసారు.

దర్శకులు ఎన్ శంకర్ మాట్లాడుతూ “శ్రీ తుల్జా భవాని గ్రూప్స్ మూవీ మేకర్స్ పతాకం పై హీరో రవి కుమార్ రాణా స్వీయ దర్శకత్వం లో నిర్మించిన సంహారి సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని నేను విడుదల చేసినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా లో నటించిన నటి నటులకి టెక్నిషన్స్ కి శుభాకాంక్షలు. ఈ సంహారి సినిమా మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

హీరోయిన్ నేహా శ్రీ మాట్లాడుతూ “ఈ సంహారి సినిమా లో నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాత మరియు హీరో రవి కుమార్ రాణా గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకి ఖచ్చితం గా నచ్చుతుంది” అని తెలిపారు.

బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడుతూ “ఈ సంహారి సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కథ చాలా బాగుంటుంది. మాస్ ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది” అని తెలిపారు.

ఈ చిత్ర దర్శకుడు, హీరో మరియు నిర్మాత రవి కుమార్ రాణా మాట్లాడుతూ “మా సంహారి సినిమా విడుదల కి సిద్ధంగా ఉంది. ఇది ఒక్క క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రతి ప్రేక్షకుడికి ఖచ్చితంగా నచ్చుతుంది. నా చిత్రానికి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కి నా ధన్యవాదాలు. త్వరలోనే సినిమా ని విడుదల చేస్తాము” అని తెలిపారు.

సినిమా పేరు : సంహారి

నటి నటులు : రవి కుమార్ రాణా, నేహా శ్రీ

కెమెరా మాన్ : అంజి బాబు, కృష్ణ నాయుడు

సంగీతం : రాజ్ కిరణ్

ఎడిటింగ్ : వంశీ పెళ్లూరి

ఫైట్స్ : అశోక్ రాజ్

డాన్స్ మాస్టర్ : ఉమా శంకర్, మనోజ్ పెద్ది

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : కె. రవి కుమార్ రాణా