అల్ల‌రి న‌రేష్‌, గిరి పాలిక‌, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘బంగారు బుల్లోడు’ జ‌న‌వ‌రిలో విడుద‌ల‌

అల్ల‌రి న‌రేష్‌, గిరి పాలిక‌, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘బంగారు బుల్లోడు’ జ‌న‌వ‌రిలో విడుద‌ల‌

 
అల్ల‌రి న‌రేష్‌, గిరి పాలిక‌, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘బంగారు బుల్లోడు’ జ‌న‌వ‌రిలో విడుద‌ల‌

అల్ల‌రి న‌రేష్ హీరోగా గిరి పాలిక ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బంగారు బుల్లోడు’. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న నాయిక‌గా పూజా ఝ‌వేరి న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రొడ‌క్ష‌న్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.

2021 జ‌న‌వ‌రిలో ‘బంగారు బుల్లోడు’ను విడుద‌ల చేయ‌డానికి చిత్రం బృందం స‌న్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లు ఓ మాస్ సాంగ్‌లో డాన్స్ చేస్తున్న‌ట్లు ఆ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం స‌మ‌కూర్చిన ఆడియో త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ది. చిత్రంలోని పాట‌ల‌న్నింటినీ రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు.

అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో ఓ చ‌క్క‌ని హాస్య‌భ‌రిత చిత్రంగా ‘బంగారు బుల్లోడు’ పేరు తెచ్చుకుంటుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. టాలీవుడ్‌లోని ప‌లువురు పేరుపొందిన హాస్య‌న‌టులు ఈ చిత్రంలో న‌టించార‌నీ, వారిపై చిత్రీక‌రించిన ప‌లు స‌న్నివేశాలు ప్రేక్ష‌కులను క‌డుపుబ్బ న‌వ్వుకునేలా చేస్తాయ‌నీ చెప్పారు.

స‌తీష్ ముత్యాల సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎం.ఆర్‌. వ‌ర్మ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తోన్న ఈ చిత్రానికి కృష్ణ‌కిశోర్ గ‌రిక‌పాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, అజ‌య్ సుంక‌ర స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, పూజా ఝ‌వేరి, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీ, ప్ర‌వీణ్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌, అనంత్‌, భ‌ద్రం, అజ‌య్ ఘోష్‌, సారిక రామ‌చంద్ర‌రావు, రామ‌ప‌త్ర నిత్ర వెలిగొండ శ్రీ‌నివాస్‌.

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గిరి పాలిక‌
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కృష్ణ‌కిశోర్ గ‌రిక‌పాటి
స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర‌
మ్యూజిక్‌: సాయి కార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీష్ ముత్యాల‌
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌. వ‌ర్మ‌
ఆర్ట్‌: ఎన్‌. గాంధీ
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
కో-డైరెక్ట‌ర్‌: ప్ర‌సాద్ దాసం
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

Allari Naresh, Giri Palika, AK Entertainments Bangaru Bullodu Releasing January

Allari Naresh is back with a hilarious family entertainer Bangaru Bullodu directed by Giri Palika and produced by Sunkara Ramabrahmam under AK Entertainments banner. Pooja Jhaveri is the leading lady opposite Allari Naresh in the film which is done with its all production and post-production works.

Bangaru Bullodu is gearing up for release in January 2021 and the announcement poster shows the lead pair dancing for a mass number. The audio of the film scored by Sai Kartheek will be out soon. Lyrics for all the songs are penned by Ramajogayya Shastri.

Satish Muthiyala handled cinematography, while MR Varma is the editor. Krishna Kishore Garikipati is the executive producer and Ajay Sunkara is the co-producer.

Cast: Allari Naresh, Pooja Jhaveri, Tanikella Bharani, Posani Krishna Murali, Prithvi, Praveen, Vennelakishore, Satyam Rajesh, Prabhas Srinu, Jabardasth Mahesh, Anant, Bhadram, Ajay Ghosh, Saarika Ramachandra Rao, Ramapatra Nitra Veligonda Srinivas.

Technical Crew:
Story, Screenplay, Direction: Giri Palika
Producer: Sunkara Ramabrahmam
Banner: AK Entertainments
Executive Producer: Krishna Kishore Garikipati
Co Producer: Ajay Sunkara
Music Director: Sai Kartheek
Cinematography: Satish Muthiyala
Lyrics: Ramajogayya Shastri
Editor: MR Varma
Art: N. Gandhi
Fights: Real Satish
Co-Director: Prasad Dasam
PRO: Vamsi Shekhar