స్పెయిన్ లోని ప్లాజా డి ఎస్పానాలో రవితేజ ధమాకా రొమాంటిక్ పాట చిత్రీకరణ !!

స్పెయిన్ లోని ప్లాజా డి ఎస్పానాలో రవితేజ ధమాకా రొమాంటిక్ పాట చిత్రీకరణ !!

స్పెయిన్ లోని ప్లాజా డి ఎస్పానాలో రవితేజ ధమాకా రొమాంటిక్ పాట చిత్రీకరణ !!

మాస్ మహారాజా రవితేజ మరియు త్రినాధరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ధమాకా” షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

ఇటీవల హైదరాబాద్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. కాగా, పాటల చిత్రీకరణ కోసం టీమ్ స్పెయిన్ వెళ్లింది. ప్రస్తుతం రవితేజ, శ్రీలీలపై ఓ పాటను ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్ లొకేషన్లో చిత్రీకరిస్తున్నారు.

ప్లాజా డి ఎస్పానా స్పెయిన్ లోని సెవిల్లె లోని పార్క్ డి మారియా లూయిసాలో ఉన్న ప్లాజా. ఇది ప్రాంతీయ వాస్తుశిల్పంతో రూపొందిన ప్రపంచంలోనే ప్రత్యేకమైన ప్లాజా-ప్యాలెస్. రొమాంటిక్ పాటను చిత్రీకరించడానికి ఇది ఖచ్చితంగా అద్భుతమైన ప్రదేశంగా నెలకొంది.

‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్లైన్ తో ధమాకా వస్తుంది. ఇందులో ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ గా అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

తారాగణం: రవితేజ, శ్రీలీల

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: త్రినాధరావు నక్కిన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
PRO: వంశీ శేఖర్

 
Ravi Teja’s “DHAMAKA”- A Romantic Song Being Filmed At Plaza de España In Spain

Mass Maharaja Ravi Teja and Trinadha Rao Nakkina’s out and out action entertainer “Dhamaka” is fast progressing with its shoot. The film is being mounted on a grand scale by the producer TG Vishwa Prasad. Sreeleela, who is one of the most sought after actresses in Tollywood right now, is playing the female lead role.
The team canned a high voltage action sequence recently in Hyderabad. Ram-Lakshman masters choreographed this action episode. Meanwhile, the team flew to Spain to film a song on Ravi Teja and Sreeleela. They are presently shooting a song in a historic location called Plaza de Espana.

The Plaza de España is a spectacle of light and majesty. Framed in the María Luisa Park, this is a plaza-palace unique in the world. It’s definitely a wonderful place to shoot a romantic song.

Dhamaka comes up with an interesting tagline of ‘Double Impact’. It features some well-known actors in vital roles and top-notch technicians handling different crafts.

Prasanna Kumar Bezawada has penned story, screenplay and dialogues for the film, while Bheems Ceciroleo is scoring the music and Karthik Ghattamaneni handles the cinematography. The film is Co Produced by Vivek Kuchibotla and Srinagendra Tangala is the Production Designer of the movie. Other cast and crew details will be revealed soon.

Cast: Ravi Teja, Sreeleela

Technical Crew:
Director: Trinadha Rao Nakkina
Producers: TG Vishwa Prasad
Banners: People Media Factory, Abhishek Aggarwal Arts
Co-Producer: Vivek Kuchibhotla
Story, Dialogues: Prasanna Kumar Bezawada
Music Director: Bheems Ceciroleo
Cinematography: Karthik Ghattamaneni
Fights: Ram-Lakshman
Production Designer: Srinagendra Tangala
PRO: Vamsi Shekar