Jersey Movie Review

Jersey Movie Review
Jersey Movie Review
Jersey Movie Review
సినిమా రివ్యూ: జెర్సీ 
రేటింగ్: 3/5
నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, సంపత్, ప్రవీణ్ త‌దిత‌రులు
బేన‌ర్ః  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎడిటర్: నవీన్ నూలి
కెమేరా: సాను జాన్ వర్గీస్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత‌: సూర్యదేవర నాగవంశీ
రచన, ద‌ర్శ‌క‌త్వం: గౌతమ్ తిన్ననూరి
విడుదల తేదీ: ఏప్రిల్ 19, 2019
రేటి్ంగ్ః 3/5
నాని మొద‌టి నుంచి `జెర్సీ` పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అంత కాన్ఫిడెంట్ గా ఎప్పుడు నాని ఏ సినిమాకు చెప్ప‌లేదు. కొంత మంది ఓవ‌ర్ కాన్ఫిడెంట్ కూడా అనుకున్నారు. కానీ సినిమా చూసాక క‌చ్చితంగా సినిమాకు ఫిదా అవ్వాల్సిందే. మ‌రి ఈ రో్జు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…
 స్టోరిలో కి వెళితే…
 హైదరాబాదీ రంజీ క్రికెటర్  అర్జున్ ( నాని). ఇండియన్ క్రికెట్ టీమ్‌కి సెలెక్ట్ అవ్వాల‌నేది అత‌డి డ్రీమ్. కానీ, మ‌నీ కి త‌ప్ప ప్ర‌తిభ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని అధికారులు అర్జున్ ని కాకుండా మ‌రొక‌రిని ఫైన‌ల్ టీమ్ సెల‌క్ట్ చేస్తారు.  దాంతో అర్జున్ క్రికెట్ ని వ‌దిలేస్తాడు.  ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరతాడు.  ఒక  లంచం కేసులో ఇరుక్కొని ఆ ఉద్యోగం నుండి స‌స్పెండ్ చేయ‌బ‌డ‌తాడు.  అప్పటికి అర్జున్‌కి పెళ్ళై ఎనిమిదేళ్లు. ఓ ఏడేళ్ల కుమారుడు కూడా. ప్రేమించి పెళ్లి చేసుకున్న సారా (శ్రద్ధా శ్రీనాథ్) ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని పోషిస్తుంది. రెండేళ్ల పాటు ఉద్యోగం లేకుండా ఖాళీగా గడిపేస్తాడు అర్జున్. తరవాత మళ్లీ క్రికెట‌ర్‌గా గ్రౌండ్‌లో అడుగుపెడతాడు. ఎందుకు? పదేళ్ల క్రితం వదిలేసిన క్రికెట్‌లోకి మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? అప్పుడు సారా స్పందన ఏంటి? పదేళ్ల క్రితం కోపంతోనే క్రికెట్‌ని వదిలేశాడా? మరో కారణం ఏమైనా ఉందా? అర్జున్ జీవితంలో ఏం జరిగింది? అనేది మిగ‌తా సినిమా.
బ‌లాలు..
 నాని న‌ట‌న‌
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎమోష‌న‌ల్ సీన్స్
సినిమాటోగ్ర‌ఫీ
మైనస్‌ పాయింట్స్‌:
ల్యాగ్
క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు
 విశ్లేష‌ణ‌లోకి వెళితే…
 ప్ర‌యత్నిస్తూ కొంత మంది మ‌ర‌ణిస్తారు…కానీ అర్జున్ మాత్రం మ‌ర‌ణిస్తాడ‌ని తెలిసినా ప్ర‌య‌త్నిస్తాడు. అదే ఈ సినిమాలో ఇచ్చిన సందేశం.
 సినిమా అంతా మంచి ఎ మోష‌న‌ల్ గా సాగుతుంది. సినిమా స్టార్ట్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఎండింగ్ వ‌ర‌కూ స్క్రీన్ కి అతుక్కుపోయి చూస్తాం. ముఖ్యంగా నాని ప‌ర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. హీరోయిన్ కూడా నాని పోటా పోటీగా న‌టించింది. బాల‌న‌టుడు రోనిక్ కూడా చాలా నేచ‌ర‌ల్ గా న‌టించాడు. ముఖ్యంగా త‌న కొడుకు అడిగిన  జెర్సీ కోసం 500 వంద‌లు లేక హీరో ఇబ్బంది ప‌డ‌టం…దాని కోసం అత‌డు ప‌డే త‌పన ప్ర‌తి ఒక్క‌రి క‌ళ్ల‌ను చెమ‌ర్చేలా చేస్తుంది. అలాగే మ్యాచ్ ఎంతో స‌హ‌జంగా ఉంటూ అంద‌ర్నీ ఎగ్జైటింగ్ కి గురి చేసేలా ఉంటుంది.  అనిరుధ్ చేసిన రెండు పాట‌లు బావున్నాయి. ముఖ్యంగా నేప‌థ్య సంగీతంతో సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. అలాగే సినిమాటోగ్ర‌ఫీ కూడా బాగా కుదిరింది.
 సూటిగా చెప్పాలంటేః స‌రైన స‌మ‌యంలో స‌రైన సినిమా అని చెప్ప‌వ‌చ్చు. ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని, తండ్రీ కొడుకుల ఎమోష‌న్స్ ని అద్భుతంగా చూపించాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌తి ఒక్క‌రూ ఫ్యామిలీతో వెళ్లి హాయిగా చూడాల్సిన సినిమా జెర్సీ.