రాజ్ తరుణ్ మూవీ నుంచి ‘పదా’ అనే పాటను విడుదల చేసిన రష్మిక మందన

రాజ్ తరుణ్ మూవీ నుంచి ‘పదా’ అనే పాటను విడుదల చేసిన రష్మిక మందన

రాజ్ తరుణ్, శాంటో మోహన్ వీరంకి, డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ స్టాండప్ రాహుల్ నుంచి ‘పదా’ అనే పాటను విడుదల చేసిన రష్మిక మందన !!

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్‌ స్టాండప్ రాహుల్ సినిమాతో శాంటో మోహన్ వీరంకి  దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.  ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతన్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని,  భరత్ మాగులూరి నిర్మించారు.

నేడు (జనవరి 18) రష్మిక మందన ఈ సినిమా నుంచి పదా అనే పాటను విడుదల చేశారు. నలుగురు స్నేహితులు రోడ్ ట్రిప్‌లో వెళ్తుంటారు. ఇక ఈ విజువల్స్ చూస్తుంటే.. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మల మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉన్నట్టు కనిపిస్తోంది. రెహమాన్ రాసిన సాహిత్యం.. రాజ్ తరుణ్, వర్షల మధ్య ఇష్టాన్ని తెలియజేసేలా ఉంది.

స్వీకర్ అగస్తి మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు. యాజిన్ నాజర్ గాత్రం చక్కగా కుదిరింది. శ్రీరాజ్ రవీంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజ్ తరుణ్ లుక్స్ ట్రెండీగా ఉన్నాయి. వర్ష బొల్లమ్మ క్యూట్‌గా కనిపిస్తున్నారు.

జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా సినిమా మీద అంచనాలను పెంచేశాయి.

వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

నటీనటులు  : రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు

సాంకేతిక బృందం

రైటర్  : డైరెక్టర్ శాంటో మోహన వీరంకి
ప్రొడక్షన్ కంపెనీ :  డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హైఫైవ్ పిక్చర్స్
సమర్ఫణ  : సిద్దు ముద్ద
నిర్మాతల  : నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
సంగీతం :  దర్శకత్వం స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫర్ :  శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిటర్  : రవితేజ గిరిజెల్లా
కొరియోగ్రఫర్  : ఈశ్వర్ పెంటి
ఆర్ట్ :  ఉదయ్
పీఆర్వో : వంశీ-శేఖర్

Rashmika Mandanna Launched Padhaaa Song From Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul

Young and promising hero Raj Tarun will be seen as a stand-up comic in his upcoming film Stand Up Rahul being directed by debutant Santo Mohan Veeranki. The film billed to be a coming-of-age feel-good romance comedy is being produced jointly by Nandkumar Abbineni and Bharath Maguluri under Dream Town Productions and HighFive Pictures banners.

Today, actress Rashmika Mandanna launched Padhaaa song from the film. Padhaaa is a travel song and four friends are on a road trip. As the visuals suggest, there is more than the friendship between Raj Tarun and Varsha Bollamma. Lyrics penned by Rehman also hint about Raj Tarun and Varsha’s liking for each other.

Sweekar Agasthi scored a cool and melodious tune with pleasant vocals from Yazin Nizar. As the song was shot in some picturesque locations, the visuals look lovely. Sreeraj Raveendran is the cinematographer. Raj Tarun looks trendy, while Varsha Bollamma is cute.

The film is about a reluctant stand-up comic who doesn’t stand up for anything in life, finally finding true love and learning to stand up for his parents, for his love and for his passion for stand-up comedy.

The teaser and other promotional content created curiosity on the project.

Venella Kishore, Murali Sharma, Indraja, Devi Prasad and Madhurima are the other prominent cast of the film.

Starring: Raj Tarun, Varsha Bollamma, Venella Kishore, Murali Sharma, Indraja, Devi Prasad, Madhurima

Technical Crew:

Writer – Director: Santo Mohan Veeranki
Production House: Dream Town Productions, HighFive Pictures
Presented by: Siddu Mudda
Producers: Nandkumar Abbineni, Bharath Maguluri
Music Director: Sweekar Agasthi
Cinematographer: Sreeraj Raveendran
Editor: Raviteja Girijella
Choreographer: Eshwar Penti
Art: Uday
PRO: Vamsi-Shekar