Rajputh movie opening

Rajputh movie opening

రాజ్ పుత్` షూటింగ్ ప్రారంభం!!
 
బంజారా బిగ్ సినిమాస్ ప‌తాకంపై బంజార భాష‌లో `గోర్ మాటి`గా తెలుగులో `రాజ్ పుత్‌`గా రెండు భాష‌ల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రేఖ్యా నాయ‌క్‌. శంక‌ర్ జాద‌వ్ హీరోగా  న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అదిరే అభి మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. సిరిరాజ్‌, క‌రిష్మా రామ్ హీరోయిన్స్. ఈ చిత్రం ఈ రోజు ఫిలింన‌గ‌ర్‌లోని తెలంగాణ ఫిలించాంబ‌ర్ లో షూటింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించుకుంది. 
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ‌ ఫిలించాంబ‌ర్ చైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ..తెలంగాణ `టీమా` సెక్ర‌ట‌రి వి.తిరుమ‌ల దేవి కెమేరా స్విచాన్ చేశారు. మ‌రో అతిథి లక్మ‌ణ్ వేముల గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ…“ఇటీవ‌ల కాలంలో బంజార భాష‌లో రూపొందిన చిత్రాలు విజ‌యం సాధించాయి. ఆ కోవ‌లో ఈ చిత్రం కూడా విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాకు అన్నివిధాల నా పూర్తి స‌హ‌కారం ఉంటుంది“ అన్నారు.
 ద‌ర్శ‌కుడు, హీరో  శంక‌ర్ జాద‌వ్ మాట్లాడుతూ…“ బంజారాల జీవితం ఎక్క‌డ ప్రారంభ‌మై ఎక్క‌డెక్క‌డి వర‌కు వ్యాపించింది. అస‌లు వారి జీవ‌న శైలి ఎలా ఉంటుంది అనే అంశాల ఇతివృత్తంతో తెలుగులో `రాజ్‌పుత్` , బంజార‌లో `గోర్‌మాటి`గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. నేను హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నా“ అన్నారు.
మ‌రో హీరో అదిరే అభి మాట్లాడుతూ…“ఈ సినిమాలో నేను సెకండ్ హీరోగా న‌టిస్తున్నా. శంక‌ర్ మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు“ అన్నారు.
నిర్మాత రేఖ్యా నాయ‌క్ మాట్లాడుతూ…“బంజార వారి స్థితిగతుల‌తో పాటు వారి స‌మ‌స్యలూ ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. బంజారాలు ఇప్ప‌టికే నేను ప్రారంభించిన `యూట్యూబ్` ఛాన‌ల్ ని ఆద‌రించారు. ఈ సినిమాకు కూడా వారి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమా ఒక్క బంజార వాళ్ల‌కే కాకుండా అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ఆలోచింప‌జేసేలా  ఉంటుంది. ఈ నెల 20 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తాం“ అన్నారు.
“ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని `టిమా` సెక్ర‌ట‌రి తిరువ‌ల దేవి, ల‌క్ష్మ‌ణ్ వేముల తెలిపారు.
“ ఒక మంచి సినిమాలో భాగ‌మ‌వుతున్నంద‌కు సంతోషంగా ఉంద‌న్నారు హీరోయిన్స్.
 వ‌డిత్య రేఖ్యా నాయ‌క్‌, జ‌బ‌ర్ద‌స్త్ ప‌వ‌న్, న‌వీన్, జాకి, హ‌రిత తదిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః ఘంటాడి కృష్ణ‌, సినిమాటోగ్ర‌ఫిః గోపి కొత్తూరు, వెంక‌ట్ కొల్లూరి, నిర్మాతః రేఖ్యా నాయ‌క్‌;  డైర‌క్ట‌ర్ః శంక‌ర్ జాద‌వ్‌.