‘జై భజరంగి’ అక్టోబర్ 29 విడుదల !!

‘జై భజరంగి’ అక్టోబర్ 29 విడుదల !!

కె.జి.యఫ్ రేంజ్లో నిర్మించిన మరో భారీ చిత్రం  ‘జై భజరంగి’ అక్టోబర్ 29 విడుదల

‘కె.జి.యఫ్’ సినిమా స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ చిత్రం ‘జై భజరంగి 2’. ‘కరుండా చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్  హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ,  తెలుగు భాషలలో లో ఒకే సారి విడుదలకు సిద్ధమౌతోంది. డా.శివ రాజ్ కుమార్  హీరోగా నటించిన ‘భజరంగి’ 2013 లో కర్ణాటక రాష్ట్రం లో 212 థియేటర్లలో విడుదలై  బాక్స్ ఆఫీస్ వద్ద సంచలం సృటించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి 2’  తెలుగులో ‘జై భజరంగి’ గా అక్టోబర్ 29న విడుదల అవుతుంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీడియో రైట్స్ దక్కించుకుని విడుదల చేసిన శ్రీ  బాలాజీ వీడియో  అధినేత నిరంజన్ పన్సారి  ‘జై భజరంగి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ : ” “గత 35 ఏళ్లుగా వీడియో రంగం లో వున్నా ప్రసిద్ధ  సంస్థ  ‘శ్రీ  బాలాజీ వీడియో’   ఇప్పటివరకు షుమారు 400 చిత్రాలకు పైగా  వీడియో  హక్కులను పొందివున్నాము. మేమిచ్చే వీడియో నాణ్యత ను గుర్తించి టాలీవుడ్ ప్రముఖులు మమ్మల్ని ప్రోత్సహించారు. తెలుగు లో మగధీర సినిమా తో బ్లూ రే డిస్క్ ని మా సంస్థ ద్వారా  పరిచయం చేసాము. అదే విధంగా మేము స్థాపించిన ‘శ్రీ బాలాజీ మూవీస్’ యు ట్యూబ్ ఛానల్ కూడా  1 కోటి 36 లక్షల వీక్షకుల సభ్యత్వమ్ కలిగి వున్నాము.  తాజాగా  డా. శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన  ‘జై భజరంగి’  చిత్రం తో టాలీవుడ్  నిర్మాణరంగం లోకి అడుగుపెట్టడం జరిగింది. 2013 లో  కన్నడ భాష లో విడుదలైన ‘భజరంగి’  శివ రాజ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం. ఆ  సక్సెస్ ని పునస్కరించుకుని ప్రస్తుతం వున్నా ట్రెండ్ ప్రకారం   ‘భజరంగి 2’ గత 2019 లో  షూటింగ్ ప్రారంభించారు. ఈ రెండేళ్ళు  కరోనా క్రైసెస్ కారణంగా చిత్ర షూటింగ్ ఆలశ్యం అయింది. భజరంగి చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టెక్నికల్ గా బాహుబలి, కె.జి.యఫ్ లకు ఏ మాత్రం తగ్గకుండా హాలీవుడ్ టెక్నిషన్స్ సహకారంతో వి ఎఫ్ ఎక్స్,  భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఫాన్సీ రేట్ తో  ‘జై భజరంగి’ తెలుగు లో విడుదల చేయడానికి  మా  సంస్థ నిర్మాణ రంగం లోకి రావడం  జరిగింది. కన్నడ తెలుగు భాషలలో అక్టోబర్ 29న ఈ చిత్రాన్ని ఒకేసారి  విడుదల చేస్తున్నాం.” అన్నారు.
నటీనటులు: డా. శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే  తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్:  శ్రీ బాలాజీ వీడియో
సంగీతం : అర్జున్ జన్య,
సినిమాటోగ్రఫర్:  స్వామి జె. గౌడ,
ఎడిటర్: దీపు యస్ కుమార్,
కాస్ట్యూమ్స్ :యోగి జి.  రాజ్  
ఫైట్స్:డా. రవి వర్మ, విక్రమ్ మోర్,  
ఆర్ట్ డైరెక్టర్:  రవి శాంతే హక్కులూ,
మాటలు :ఏ. సెల్వమ్,
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్  :  ప్రేమ్ కుమార్,  
నిర్మాత: నిరంజన్ పన్సారి,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏ. హర్ష