‘Premabhiksha’ Censor completed

‘Premabhiksha’  Censor completed

‘ప్రేమభిక్ష’.. సెన్సార్ పూర్తి.. త్వరలోనే విడుదల
ఓం సాయి పిక్చర్స్ బ్యానర్‌పై అనిల్‌, శృతి హీరోహీరోయిన్లుగా.. మద్దేరి సిఎన్ అశ్వత్‌రెడ్డి, బాలగంగాధర్ నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. యాక్షన్‌తో నిండిన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ సభ్యుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో.. చిత్ర విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యధార్ధ ఘటనతో ఈ సినిమా కథ తయారైంది. చక్కని లవ్ స్టోరీతో నిండిన యాక్షన్ చిత్రమిది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా. దేవిశ్రీ గురూజీ ఇందులో ఓ మంచి పాత్రలో నటించారు. ఆయన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. అలాగే సుమన్‌గారు ఈ సినిమాలో చాలా కీలకపాత్రను చేశారు. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీవారు మెచ్చుకోవడమే కాకుండా ఒక్క కట్ కూడా చెప్పకుండా.. క్లీన్ యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో మా యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. సినిమా మంచి విజయం సాధిస్తుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాం. త్వరలోనే రిలీజ్ వివరాలను తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

అనిల్, శృతిలయ, ఓంకారం దేవిశ్రీ గురూజీ, సుమన్, షఫీ, జీవ, కవిత, సుమన్ శెట్టి, రాజేంద్రకుమార్, రాజశ్రీ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి  ఫైట్స్: శంకర్, ఎడిటర్: వినయ్ కూర్గ్, డ్యాన్స్: సందీప్, సాహిత్యం: ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి, సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్ భారతీయ, నిర్మాతలు: బాలగంగాధర్, మద్దేరి సిఎన్ అశ్వత్ రెడ్డి; కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రాజీవ్ కృష్ణ గాంధీ(ఆర్.కె.గాంధీ).