Poorna Starrer Back Door Second Schedule Completed !!
కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి!!
యువ ప్రతిభాశాలి-నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ తెరకెక్కిస్తున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’ రెండో షెడ్యుల్ పూర్తయింది. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర
పోషిస్తున్న ఈ వినూత్న కథా చిత్రాన్ని.. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ
మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న
ఈ చిత్రం పతాక సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.. “పూర్ణ ఎంత మంచి పెర్ఫార్మరో అందరికీ తెలిసిందే. తనకు చాలా మంచి పేరొస్తుంది. మా సినిమా చేస్తుండగానే తనకు బాలకృష్ణగారితో నటించే అవకాశంతోపాటు కంగనా రనౌత్ తో రూపొందుతున్న జయలలిత బయోపిక్ లో శశికళగా నటించే రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. “బ్యాక్ డోర్” ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మా అందరికీ మంచి పేరు తెస్తుంది. మా నిర్మాత శ్రీనివాస్ రెడ్డిగారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నారు” అని అన్నారు.
‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ‘మా దర్శకుడు బాలాజీ శర వేగంతో, కంప్లీట్ క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు” అని వివరించారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి. వయసులో నాకంటే చిన్న వయసున్న అబ్బాయివెప్రేమ కోసం పరితపించే పాత్ర చేస్తున్నాను. చాలా ఛాలెంజింగ్ రోల్. బాలాజీ గారు నా పాత్రతోపాటు సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు” అని అన్నారు.
హీరో తేజ మాట్లాడుతూ…
‘పూర్ణ గారు వంటి సీనియర్ అండ్ హైలీ టాలెంటెడ్ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు బాలాజీ గారు, నిర్మాత శ్రీనివాస్ రెడ్డి గార్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అన్నారు.
ఈ చిత్రానికి మేకప్: మోహన్, కాస్ట్యూమ్స్: శ్రీనివాస్, మేనేజర్: అంజి, ప్రొడక్షన్: శ్యామ్, స్టిల్స్: శ్రీనివాస్ విల్లా, కెమెరా & లైట్స్: ఓంకార్ యూనిట్,
అసిస్టెంట్ డైరెక్టర్: సాదిక్, అసోసియేట్ డైరెక్టర్: రవి రోహిత్,
కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను,
నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ.