`నేనంటే నాకిష్టం` మూవీ ప్రారంభం !!

`నేనంటే నాకిష్టం` మూవీ ప్రారంభం !!

`నేనంటే నాకిష్టం` మూవీ ప్రారంభం !!

శివ ప్రియ ప్రొడక్షన్ పతాకంపై భొక్కిశం భూలక్ష్మి నిర్మాతగా బి ఎల్ ప్రసాద్ దర్శకుడిగా ప్రొడక్షన్ నెంబర్ 2 ” నేనంటే నాకిష్టం” లవ్ అండ్ కామెడీ ఫామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇటీవల పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనది , పూజాకార్యక్రమాల అనంతరం స్క్రిప్ట్ ను ప్రముఖ అతిధి పరిశామికవేత్త మాసాబత్తిని శివ చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు అందజేశారు దేవుడి పటాలపై బేబీ శివ ప్రియ క్లాప్ నివ్వగా నిర్మాత భొక్కిశం భూలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేయగా , దర్శకుడు బి ఎల్ ప్రసాద్ ఫస్ట్ షాట్ డైరెక్టన్ చేసారు.
నిర్మాత భొక్కిశం భూలక్ష్మి మాట్లాడుతూ … మా బ్యానర్లో “నేనంటే నాకిష్టం” మూవీ రెండో చిత్రం ఇంతకు ముందు ఇదే దర్శకుడితో “ఇది నాది” అనే చిత్రాన్ని నిర్మించాను ప్రస్తుతం అది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ తో రెడీ గా ఉంది త్వరలో రిలీజ్ చేస్తాం, ఈ చిత్రం షూటింగ్ టైం లోనే నాకు “నేనంటే నాకిష్టం” కథ చెప్పటం జరిగింది బాగా నచ్చి వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభించాం అన్నారు . దర్శకుడు బి ఎల్ ప్రసాద్ మాట్లాడుతూ … నా మీద నమ్మకం తో ఒక సినిమా రిలీజ్ కాకా ముందే ఇంకొక చిత్రానికి అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు , ఈ చిత్రంలో ఐదు పాటలు ,రెండు ఫైట్లు ఉన్నాయి, త్వరలో ఆర్టిస్టులు టెక్నిషన్ల వివరాలు తెలియజేస్తామన్నారు .