“ నీకు నాకు పెళ్లంట టాంటాంటాం“ మూవీ రివ్యూ!

“ నీకు నాకు పెళ్లంట టాంటాంటాం“ మూవీ రివ్యూ!

 

 

“ నీకు నాకు పెళ్లంట టాంటాంటాం“ మూవీ రివ్యూ!

దర్శకత్వం : తాళ్లూరి మణికంట
నిర్మాత : కాసు శ్రీనివాస్ రెడ్డి
సంగీతం : రఘు కుంచె
సినిమాటోగ్రఫీ : ఆదిత్య వర్ధన్
నటీనటులు సంజన, కార్తిక్, ఖయ్యుం తదితరులు ..
విడుదల : 18-02-2022
రేటింగ్ : 3 .25/ 5

శ‌తాబ్ది శ్రీనివాస్ రెడ్డి అంటే తెలియ‌ని వారుండ‌రు. టౌన్ షిప్ రంగంలో అగ్ర‌గామిగా ఉంటూ ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. ఏ రంగంలో అయినా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకునే ఈయ‌న సినిమా రంగంలో కూడా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డానికి అడుగుపెట్టారు. త‌ను నిర్మాత గా మారి సంజన, కార్తీక్, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో ` నీకు నాకు పెళ్లంట టాంటాంటాం` అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదలైంది. బిగ్ బాస్ ఫేమ్ సంజన ప్రధాన పాత్ర పోషించింది. టీజ‌ర్, ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం యూత్ తో పాటు ఫ్యామిలీ స‌భ్యుల‌ను టార్గెట్ చేశారు. ఆద్యంతం ఆక‌ట్టుకునే సీన్స్ తో క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీతో సినిమా సాగుతుంది. మ‌రి థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

స్టోరిలోకి వెళితే…
మందు, సిగరెట్ లాంటి నానా అల‌వాట్లు ఉన్న అమ్మాయి సంజ‌న‌. ఎంతో బోల్డ్ గా ఉండే ఈ అమ్మాయికి ఒక అబ్బాయితో ప‌రిచ‌యం అవుతుంది. అతనితో ప్రేమలో పడుతుంది. కొన్నాళ్ళకు అతనితో బ్రేక్ అప్ అవుతుంది. సంజన అలవాట్లను భరించలేక బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్లిపోతాడు.  ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది.  అసలు సంజన జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది  అన్నది మిగ‌తా క‌థాంశం.

ఆర్టిస్టుల ప‌ర్ఫార్మెన్స్ః
బిగ్ బాస్ 2 లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న సంజన చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ గా నటించిన చిత్రమిది. ఇందులో సంజన ఎంతో లైవ్లీగా న‌టించింది. ముఖ్యంగా బోల్డ్ పాత్ర చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకుంది. ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే అమ్మాయిగా గ్లామర్, నటనలో ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. హీరో పాత్రలో కార్తీక్ ఆకట్టుకున్నాడు. అందమైన అమ్మాయిప్రేమించే వ్యక్తిగా .. ఆ తరువాత ఆమె టార్చర్ తట్టుకోలేక విడిపోయే యువకుడిగా బాగా నటించాడు. ఇక కమెడియన్ ఖుయ్యుమ్ పాత్ర నవ్విస్తూనే మరోవైపు ఆసక్తి కనబరిచేలా ఉంది. చాలా కాలం తరువాత ఖయ్యుమ్ కు మంచి పాత్ర దక్కింది. అలాగే మిగతా పాత్రల్లో అంద‌రూ వారి పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
ఒక ఇంట్ర‌స్టింగ్ స్టోరీ తీసుకుని దానికి మరో థ్రిల్ల‌ర్ యాంగిల్ జోడించి క‌థ‌ను న‌డిపిన విధాన ఎంతో బావుంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడిని ప్ర‌శంసించాలి. క‌థ‌తో పాటు క‌థ‌నం కూడా ఆక‌ట్టుకునే విధంగా రాసుకున్నాడు. ఇందులో మంచి కామెడీ కూడా పండించాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడుగా త‌ను పాస్ మార్కులు కొట్టేసాడు అన‌డంలో సందేహం లేదు. ఆదిత్య వ‌ర్ధ‌న్ క‌థతో పాటు సినిమాటో గ్ర‌ఫీ కూడా సినిమాకు ప్ల‌స్ అయింది. ర‌ఘు కుంచె చేసిన పాట‌ల్లో రెండు ఆక‌ట్టుకుంటాయి. నేప‌థ్య సంగీతం కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ఎడిట‌ర్ వ‌ర్క్ ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక దృష్టి కోణంతో క‌థ‌ను న‌డిపించి.. ఆ త‌ర్వాత మ‌నం చూసిన కోణ‌మే త‌ప్పు అన్న‌ట్లుగా మొత్తం క‌థ‌ను మ‌రో కోణంలో మార్చి చూపించ‌డం ఒక‌ స్క్రీన్ ప్లే టెక్నిక్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ టెక్నిక్ వ‌ర్కవుట్ అయింది.

విశ్లేషణ :
టైటిల్ చూసి ఇదేదో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైమెంట్ సినిమా అనుకుని వెళితే ఓ సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతుంది సినిమా. నీకు నాకు పెళ్లంట కొన్నిచోట్లేమో ఇది చాలా సీరియ‌స్ థ్రిల్ల‌ర్ లాగా అనిపిస్తుంది. కాస్త ఉత్కంఠ‌ను ఫీలై ఆ మూడ్ లోకి వెళ్లే లోపు   మొత్తం వ్య‌వ‌హారాన్ని కామెడీ  గా మ‌లిచిన విధానం బావుంది. స్నేహం, ప్రేమ, ఎమోషన్స్‌ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. డైరెక్టర్ మధ్యతరగతి విలువలను తెరపై చక్కగా చూపించాడు .ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు ఫీల్‌ అయ్యేలా సన్నివేశాలను రూపొందించాడు. ఇందులో ల‌వ్ , బోల్డ్ సీన్స్, స‌స్పెన్స్ తో పాటు క‌డుపుబ్బ న‌వ్వించే చ‌క్క‌టి కామెడీ కూడా ఉంది. డోంట్ మిస్ దిస్ మూవీ.
సూటిగా చెప్పాలంటేః
సినిమా సూప‌రంట టాంటాంటాం